News


నిరాశ ఫలితాలు..14% పతనమైన ఎన్‌బీసీసీ

Friday 9th August 2019
Markets_main1565342312.png-27669

నేషనల్‌ బుల్డింగ్‌ కనస్ట్రక్షన్‌ కార్పోరేషన్‌ (ఎన్‌బీసీసీ) ఇండియా క్యూ1 ఫలితాలు మార్కెట్లను నిరాశపరచడంతో ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో శుక్రవారం మధ్యాహ్నం 2.25 సమయానికి 14.09 శాతం నష్టపోయి ఐదేళ్ల కనిష్టానికి సమీపంలో (రూ. 34.15 వద్ద) ట్రేడవుతోంది. రియల్‌ ఎస్టేట్‌ విభాగంలో మందగమనం వలన, ఆర్థిక సంవత్సరం 2019 క్యూ1 త్రైమాసికంలో ఎన్‌బీసీసీ నికర లాభం 38 శాతం తగ్గి, రూ. 51 కోట్లుగా నమోదైంది. కాగా గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 83 కోట్లుగా ఉండడం గమనర్హం. ఎన్‌బీసీసీ షేరు ఇంట్రాడేలో రూ. 33.80 స్థాయికి పడిపోవడంతో, సెప్టెంబర్‌ 16, 2014 తర్వాత అత్యంత కనిష్టస్థాయికి పడిపోయినట్టయ్యింది. 
   ఈ త్రైమాసికంలో ఎన్‌బీసీసీ ఆపరేషనల్‌ ఆదాయం 16 శాతం క్షీణించి రూ. 1,886 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ. 2,252 కోట్లుగా ఉంది. కంపెనీ రియల్ ఎస్టేట్ విభాగ లాభం (పన్ను, వడ్డీకి ముందు) కేవలం రూ. 14 లక్షలుగా ఉంది. ఇది మునుపటి ఏడాది ఇదే త్రైమాసికంలో ప్రకటించిన రూ. 68 కోట్లకంటే తక్కువ కావడం గమనర్హం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఎన్‌బీసీసీ రియల్‌ఎస్టేట్‌ విభాగం ఆదాయం రూ. 130 కోట్లుండగా, ఈ త్రైమాసికం నాటికి 96 శాతం క్షీణించి రూ. 5 కోట్లకు పడిపోయింది. పునరాభివృద్ధి ప్రాజెక్టులు నెమ్మదించడం, భవిష్యత్తులో సరియైన ప్రదర్శనల చేయలేని సంస్థలపై ప్రభుత్వ ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉండడం, ఈ కంపెనీకి సమస్యలుగా పరిణమించాయని  విశ్లేషకులు తెలిపారు. గత నెలలో, ఎస్ అండ్‌ పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 3 శాతం నష్టపోగా, ఈ షేరు ఇదే కాలంలో 39 శాతం పడిపోయింది.



You may be interested

కశ్మీర్‌ ఇష్యూతో పాక్‌ స్టాక్‌ మార్కెట్‌ కకావికలం!

Friday 9th August 2019

భారత్‌తో వాణిజ్య సంబంధాల రద్దుతో వెల్లువెత్తిన అమ్మకాలు ఐదేళ్ల కనిష్ఠాలకు సూచీలు వరుసగా ఆరోరోజు కూడా పాకిస్థాన్‌ స్టాక్‌ మార్కెట్లో భారీ పతనం నమోదయింది. దీంతో పాక్‌ స్టాక్‌ ఇండెక్స్‌ కేఎస్‌ఈ 100 ఐదేళ్ల కనిష్ఠస్థాయికి చేరింది. ఒకదశలో ఇంట్రాడేలో 29400 పాయింట్ల కనిష్ఠాలను తాకిన కేఎస్‌ఈ చివరకు 29800 పాయింట్ల వద్ద సెటిలైంది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల రద్దు ప్రకటన తర్వాత పాక్‌ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ మందగమన ప్రభావంతో

నిఫ్టీ అప్‌ట్రెండ్‌ ర్యాలీకి ఈ షేర్ల ర్యాలీ కీలకం

Friday 9th August 2019

నిఫ్టీ అప్‌ట్రెండ్‌ ర్యాలీకి రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కీలకమని యస్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రీతీష్‌ మెహతా అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌ పయనంపై మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే... గురువారం మార్కెట్‌ టర్న్‌ అరౌండ్‌లో భాగంగా నిఫ్టీ సూచీ 10,800 వద్ద విరామస్థాయిని ఏర్పరుచుకుందని మెహతా తెలిపారు. బేరిష్‌ కారణాలతో మార్కెట్‌ ఒక పతనదిశలో వెళ్లినప్పుడు కొంతదూరం తర్వాత ఒక సగటు స్థాయికి తిరిగి వస్తుంది. నిఫ్టీ ఇండెక్స్‌

Most from this category