News


నవీన్‌ ఫ్లోరిన్‌, శిల్పా మెడీ.. దూకుడు

Tuesday 25th February 2020
Markets_main1582624721.png-32082

నవీన్‌ ఫ్లోరిన్‌ 20 శాతం హైజంప్‌
శిల్పా మెడికేర్‌ 5 శాతం‍ సర్క్యూట్‌

ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌, శిల్పా మెడికేర్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ నవీన్‌ ఫ్లోరిన్‌ కౌంటర్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఈ బాటలో ఫార్మా రంగ కంపెనీ శిల్పా మెడికేర్‌ సైతం భారీ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌
ఒక గ్లోబల్‌ కంపెనీతో కొన్నేళ్లపాటు అమల్లో ఉండే(మల్టి ఇయర్‌) కాంట్రాక్టును కుదుర్చుకున్నట్లు నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌ తాజాగా వెల్లడించింది. 41 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,900 కోట్లు) విలువైన ఈ కాంట్రాక్టులో భాగంగా ఫ్లోరోకెమికల్స్‌ విభాగంలో హైపెర్ఫార్మెన్స్‌ ప్రొడక్టును సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 440 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. అనుబంధ సంస్థ ద్వారా గుజరాత్‌లోని  దహేజ్‌లో ఈ ప్లాంటును నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో నవీన్‌ ఫ్లోరిన్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో కొనేవాళ్లే తప్ప అమ్మకందారులు కరవుకావడంతో రూ. 242 ఎగసింది. రూ. 1454 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం!

శిల్పా మెడికేర్‌ లిమిటెడ్‌
సొంత అనుబంధ సంస్థకు బయోలాజికల్‌ యూనిట్‌ను విక్రయించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు శిల్పా మెడికేర్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. శిల్పా బయోలాజికల్స్‌ను స్లంప్‌సేల్‌ ప్రాతిపదికన విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఈ యూనిట్‌ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ యూనిట్‌ నెట్‌వర్త్‌ను రూ. 322 కోట్లుగా అంచనా వేస్తోంది.  ఈ నేపథ్యంలో శిల్పా మెడికేర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో కొనేవాళ్లే తప్ప అమ్మకందారులు కరవుకావడంతో 5 శాతం(రూ. 24) ఎగసింది. అప్పర్‌ సర్య్యూట్‌తో రూ. 514 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం!



You may be interested

భారత్‌-అమెరికాల మధ్య 300 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందం!

Tuesday 25th February 2020

అమెరికా, భారత్‌ దేశాల మధ్య 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరింది. మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య న్యూఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాలు  ఆర్థిక, వాణిజ్య, రక్షణ సంబంధించి మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అపాచీ ఎం16  హెలికాఫ్టర్ల ఒప్పందం, మానసిక ఆరోగ్యంపై మెడికల్‌ ఉత్పత్తుల సరఫరా ఒప్పందాలపై ఇరు దేశాలు

రెలిగేర్‌ నుంచి టాప్‌ రికమండేషన్స్‌

Tuesday 25th February 2020

వచ్చే మూడు నాలుగువారాల్లో మంచి రాబడిని అందించే మూడు రికమండేషన్లను రెలిగేర్‌ బ్రోకరేజ్‌ అందిస్తోంది. 1. వేదాంత: మార్చి ఫ్యూచర్స్‌ను అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 126. స్టాప్‌లాస్‌ రూ. 140. మెటల్‌ కౌంటర్లలో చాలా కౌంటర్లు బలహీనంగా ఉన్నాయి. వీటిలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. వేదాంత షేరు ఇతర మెటల్‌ షేర్లతో పోలిస్తే పేలవంగా ఉంది. ప్రస్తుతం సరికొత్త బ్రేక్‌డౌన్‌కు రెడీగా ఉంది. ఆరు నెలల కన్సాలిడేషన్‌ షేరులో అప్‌మూవ్‌

Most from this category