News


నవీన్‌, సీసీఎల్‌.. జూమ్‌- హెచ్‌జీ ఇన్‌ఫ్రా వీక్‌

Tuesday 28th January 2020
Markets_main1580204458.png-31272

క్యూ3 ఎఫెక్ట్‌- నవీన్‌, సీసీఎల్‌ జోరు
హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ పతనం

కరోనా వైరస్‌ భయాలతో ప్రపం‍చ మార్కెట్లు వెనకడుగులో ఉన్నప్పటికీ తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి డీలాపడ్డాయి. మధ్యాహ్నం 3 ప్రాంతంలో మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో నవీన్‌ ఫ్లోరిన్‌ కెమికల్స్‌, సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా మరోవైపు ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి నవీన్‌ ఫ్లోరిన్‌, సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ షేర్లు లాభాలతో కళకళలాడుతుంటే.. హెచ్‌జీ ఇన్‌ఫ్రా నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం.. 

నవీన్‌ ఫ్లోరిన్‌ కెమికల్స్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నవీన్‌ ఫ్లోరిన్‌ కెమికల్స్‌ నికర లాభం 17 శాతం ఎగసి రూ. 45 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 11 శాతం పుంజుకుని రూ. 260 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 26 శాతం బలపడి రూ. 65 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో నవీన్‌ ఫ్లోరిన్‌ కెమికల్స్‌ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 1182 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1212 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. 

సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ నికర లాభం 44 శాతం ఎగసి రూ. 47 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 29 శాతం పుంజుకుని రూ. 303 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 52 శాతం బలపడి రూ. 84 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ షేరు 3.5 శాతం జంప్‌చేసి రూ. 200 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 205 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. 

హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ నికర లాభం 6 శాతం నీరసించి రూ. 33.5 కోట్లను తాకింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం పుంజుకుని రూ. 575 కోట్లను అధిగమించింది. కాగా.. స్టాండెలోన్‌ నికర లాభం 18 శాతం బలపడి రూ. 41.5 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌జీ ఇన్‌ఫ్రా షేరు 4.5 శాతం  పతనమై రూ. 266 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 265 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. కంపెనీలో ప్రమోటర్లకు 73.90% వాటా ఉంది.



You may be interested

డీఓటీ వైఖరిపై సుప్రీంలో పిల్‌: నష్టాలతో ముగిసిన టెలికాం షేర్లు

Tuesday 28th January 2020

దేశీయ టెలికాం రంగ షేర్లు మంగళవారం మిడ్‌సెషన్‌ నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ రంగానికి చెందిన భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, ఐటీఐ, ఆన్‌మొబైల్‌ గ్లోబల్‌ షేర్ల పతనంతో బీఎస్‌ఈలో టెలికాం సెక్టార్‌ ఇండెక్స్‌ 5శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. మార్కెట్‌ ముగిసే సరికి ఇండెక్స్‌ క్రితం ముగింపు(1,150.51)తో పోలిస్తే 4శాతం నష్టంతో 1161.62 వద్ద స్థిరపడింది.  సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజీఆర్) చెల్లింపునకు సంబంధించి టెలికం

కుటుంబ కల్లోలం..అమ్మకానికి గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌

Tuesday 28th January 2020

కెకె మోది గ్రూప్‌లో తల్లికొడుకుల మధ్య విభేదాలు విక్రయానికి లలిత్‌ మోదీ మొగ్గు సిగరెట్‌ తయారీ సంస్థ గాడ్‌ఫ్రేఫిలిప్స్‌ సహా ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణకుమార్‌ మోదీ(కేకే మోదీ)కి చెందిన ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టినట్లు ఆయన కుమారుడు లలిత్‌ మోదీ వెల్లడించారు. గాడ్‌ఫ్రేఫిలిప్స్‌ సంస్థ మాల్‌బొరో బ్రాండ్‌ పేరిట సిగిరెట్లు విక్రయిస్తుంది. ఇందులో కేకే మోదీగ్రూప్‌నకు 47.09 శాతం వాటా, ఫిలిప్‌ మోరిస్‌కు 25.1 శాతం వాటా ఉన్నాయి. మోదీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ కృష్ణకుమార్‌

Most from this category