News


విలీనానికి 3 బీమా సంస్థల బోర్డులు ఆమోదం

Wednesday 22nd January 2020
Markets_main1579663707.png-31088

చెన్నై: ప్రభుత్వ రంగంలోని మూడు సాధారణ బీమా సంస్థల విలీనం చర్యలు ఊపందుకున్నాయి. ఈ ప్రతిపాదనకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎన్‌ఐసీ), ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఓఐసీ), యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (యూఐఐసీ) బోర్డులు ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓఐసీ, యూఐఐసీ బోర్డులు గత శుక్రవారం ఢిల్లీలో సమావేశం కాగా... ఎన్‌ఐసీ బోర్డు సోమవారం కోల్‌కతాలో భేటీ అయ్యింది. 2018 కేంద్ర బడ్జెట్‌లో ఈ మూడు సంస్థల విలీనాన్ని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. అయితే, బోర్డులు ఇప్పటిదాకా ఆమోదం తెలపకపోవడంతో ముందుకు సాగలేదు. మరోవైపు, తాజా బడ్జెట్‌లో మూడు కంపెనీలకు ప్రభుత్వం గానీ అదనపు మూలధనం అందించే ప్రతిపాదనలేవైనా చేసిన పక్షంలో.. విలీనం అవసరమే ఉండకపోవచ్చని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. 



You may be interested

టెల్కోలకు ఆఖరు అవకాశం

Wednesday 22nd January 2020

పాక్షిక చెల్లింపులైనా చేయాలంటున్న డీఓటీ ఏజీఆర్‌ బకాయిలపై టెల్కోల అభ్యర్ధనను వినేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈ లోపు టెలికం శాఖతో చెల్లింపుల విధివిధానాలు, కాలపరిమితి గురించి టెల్కోలు చర్చించాల్సిఉంటుంది. గురువారానికి టెలికం కంపెనీలు టెలికం శాఖకు రూ. 1.02 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సిఉంది. అయితే డెడ్‌లైన్‌ సమయానికి మొత్తం కట్టకున్నా, కొంత మొత్తం చెల్లిస్తే చర్చలకు తాము సిద్ధమని డీఓటీ అధికారులు సంకేతాలు ఇచ్చారు. కోర్టు తీర్పు వచ్చే

నిఫ్టీ నిరోధం 12,212, 12,255

Wednesday 22nd January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 48 పాయింట్లు ప్లస్‌ నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల(గ్యాప్‌ అప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 48 పాయింట్లు ఎగసి 12,248 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,200 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ప్రపంచ ఆర్థిక వృద్ధి

Most from this category