News


యూఎస్‌లో ఎమర్జెన్సీ- స్టాక్స్‌ రికార్డ్‌

Saturday 14th March 2020
Markets_main1584160036.png-32476

10 శాతం దూసుకెళ్లిన డోజోన్స్‌
మార్కెట్‌ చరిత్రలో కొత్త రికార్డ్‌
2008 తదుపరి అతిపెద్ద ర్యాలీ
గత వారం నికరంగా భారీ నష్టాలు
ఇండియన్‌ ఏడీఆర్‌లు జూమ్‌

వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా హైజంప్‌ చేశాయి. కోవిడ్‌-19 విస్తృతిని అడ్డుకోవడం కోసం ప్రెసిడెంట్‌ ట్రంప్‌ జాతీయ అత్యయిక పరిస్థితి(నేషనల్‌ ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు డ్రమటిక్‌గా కోలుకున్నాయి. రెండు రోజుల భారీ పతనాల నుంచి బయటపడిన మార్కెట్లు రివ్వున పైకెగశాయి. డోజోన్స్‌ 1985 పాయింట్లు(9.5 శాతం) దూసుకెళ్లింది. ఇది మార్కెట్‌ చరిత్రలోనే అత్యధికంకాగా.. 23,186 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ 230 పాయింట్లు(9.3 శాతం) ఎగసి 2,711 వద్ద నిలిచింది. ఇక నాస్‌డాక్‌ సైతం 673 పాయింట్లు(9.5 శాతం) జంప్‌చేసి 7,875 వద్ద స్థిరపడింది. వెరసి 2008 తదుపరి యూఎస్‌ మార్కెట్లు ఒకే రోజు అతిపెద్ద ర్యాలీ చేశాయి.

గత వారం నష్టాలే
నికరంగా గత వారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను మిగిల్చుకున్నాయి. ప్రధానంగా బుధవారం డోజోన్స్‌ 1464 పాయింట్లు పతనంకాగా.. గురువారం ఏకంగా 2352 పాయింట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇది 1987 తదుపరి అత్యధిక నష్టంకాగా.. కరోనా వైరస్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును తగ్గించడంతోపాటు.. బిలియన్లకొద్దీ డాలర్లను వ్యవస్థలోకి పంప్‌చేసినప్పటికీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిలో పడటం గమనార్హం! ఈ నేపథ్యంలో డోజోన్స్‌ గత వారం 10.4 శాతం తిరోగమించగా.. ఎస్‌అండ్‌పీ 9 శాతం వెనకడుగు వేసింది. 

బ్లూచిప్స్‌ దన్ను
బ్లూచిప్స్‌లో యాపిల్‌ ఇంక్‌ షేరు 12 శాతం దూసుకెళ్లగా.. బోయింగ్‌ కంపెనీ 10 శాతం జంప్‌చేసింది. మరోవైపు ఇటీవల పతన బాటలో సాగిన ఫైనాన్షియల్‌, ట్రావెల్‌(ఎయిర్‌లైన్స్‌), ఎనర్జీ రంగాలు 12-8 శాతం మధ్య పుంజుకోవడంతో మార్కెట్లకు జోష్‌ వచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. గత వారం అమెరికా మార్కెట్ల విలువ(కేపిటలైజేషన్‌)లో 2 లక్షల కోట్ల డాలర్ల విలువ ఆవిరికావడం ప్రస్తావనార్హం!

సోమవారం ఇలా
ఎన్‌ఎస్‌ఈలో సోమవారం టాటా మోటార్స్‌ షేరు 8.2 శాతం పతనమై రూ. 105 వద్ద నిలవగా.. వేదాంతా మరింత అధికంగా 15.3 శాతం కుప్పకూలి రూ. 94 వద్ద ముగిసింది. ఇక విప్రో 4 శాతం నష్టంతో రూ. 215 వద్ద స్థిరపడగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2 శాతం తక్కువగా రూ. 1112 వద్ద నిలిచింది. ఇతర కౌంటర్లలో ఇన్ఫోసిస్‌ 4.4 శాతం క్షీణించి రూ. 706 వద్ద, డాక్టర్‌ రెడ్డీస్‌ 3.4 శాతం నష్టంతో రూ. 3063 వద్ద ముగిశాయి. ఇదే విధంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ 6 శాతం పతనమై రూ. 458 దిగువన స్థిరపడింది.  

బేర్‌ మార్కెట్‌
నిజానికి గత నెల వరకూ అమెరికా మార్కెట్లు 11ఏళ్ల బుల్‌ మార్కెట్‌ బాటలో కొనసాగుతూ వచ్చాయి. దీంతో డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సరికొత్త గరిష్టాలను తాకాయి కూడా. ఈ స్థాయిల నుంచి ఇండెక్సులు 21-25 శాతంవరకూ క్షీణించాయి. వెరసి మార్కెట్లు బేర్‌ ట్రెండ్‌లోకి జారుకున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. 2020లో ఇప్పటివరకూ డోజోన్స్‌ 18 శాతం క్షీణించగా.. ఎస్‌అండ్‌పీ 16 శాతం, నాస్‌డాక్‌ 12 శాతం చొప్పున నష్టపోయాయి. 

టాటా మోటార్స్‌ జోరు..
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌) వారాంతాన లాభాల బాటలో సాగాయి. వేదాంతా(వీఈడీఎల్‌) 10.5 శాతం జంప్‌చేసి 4.54 డాలర్లను తాకగా.. ఇన్ఫోసిస్‌ 4.1 శాతం బలపడి 8.38 డాలర్ల వద్ద నిలిచింది. ఇక టాటా మోటార్స్‌(టీటీఎం) 15 శాతం దూసుకెళ్లి 6.1 డాలర్ల వద్ద స్థిరపడగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 9 శాతం ఎగసి 11.38 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో విప్రో లిమిటెడ్‌(విట్‌) 6.3 శాతం పురోగమించి 3.05 డాలర్లకు చేరగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) 6.5 శాతం పెరిగి 47.67 డాలర్ల వద్ద ముగిసింది. ఇక డాక్టర్‌ రెడ్డీస్‌(ఆర్‌డీవై) 3.6 శాతం లాభపడి 38.86 డాలర్ల వద్ద  స్థిరపడింది. You may be interested

మరో రూ.1800 తగ్గిన బంగారం!

Saturday 14th March 2020

గత కొన్నివారాలుగా గరిష్ట స్థాయిలో పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శుక్రవారం ఒక్కసారిగా పడిపోయాయి. కోవిడ్‌-19 ప్రభావంతో రక్షణాత్మక పెట్టుబడులవైపు పరుగులు పెట్టిన ఇన్వెస్టర్లు, తాజాగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో తమ పెట్టుబడులను సురక్షిత సాధనాల నుంచి  ఈక్విటీల్లోకి మళ్లించడంతో బంగారం ధర శుక్రవారం సాయంత్రం ఎంసీఎక్స్‌ ట్రేడింగ్‌లో రూ.1800 తగ్గి, 10 గ్రాముల బంగారం రూ.40.348.00 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ 61.20 డాలర్లు పతనమై ఔన్స్‌ బంగారం

భారత్‌ నుంచి రెట్టింపు కొనుగోళ్లు: బోయింగ్‌

Saturday 14th March 2020

త్వరలో 2 బిలియన్‌ డాలర్లకు సోర్సింగ్‌ బోయింగ్‌ వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత సరఫరాదారుల నుంచి కొనుగోళ్లను మరికొన్నాళ్లలో 2 బిలియన్‌ డాలర్లకు పెంచుకోనున్నట్లు విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌ కమర్షియల్‌ ఎయిర్‌ప్లేన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డరెన్‌ హస్ట్‌ తెలిపారు. ప్రస్తుతం ఇది ఏటా 1 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉందని ఆయన చెప్పారు. భారత్‌లోని 200 మంది పైగా సరఫరాదారులు బోయింగ్‌కు చెందిన అత్యాధునిక ఉత్పత్తులకు అవసరమైన విడిభాగాలు అందిస్తున్నారని

Most from this category