News


లిక్విడీటీ సంక్షోభం ముగుస్తుంది!

Thursday 19th September 2019
Markets_main1568876419.png-28432

-ఎడల్వీస్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ రాషేస్‌ షా
  ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌) అల్టికో క్యాపిటల్‌ ఇండియా కంపెనీ, గత వారం డీఫాల్ట్‌ను ఎదుర్కొంది. ఫలితంగా ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ కొరత ఆందోళనలు తిరిగి పెరిగాయి. అయినప్పటికి దేశంలో లిక్విడిటీ సంక్షోభం ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ముగుస్తుందని ఎడల్వీస్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ రాషేస్‌ షా అభిప్రాయపడ్డారు. ‘ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం, ప్రభుత్వానికి తన అదనపు నిధులను అందించడం వంటి చర్యలు, బాండ్‌ మార్కెట్‌లు తిరిగి పుంజుకోడానికి సహాయపడుతున్నాయి. ఫలితంగా క్రెడిట్‌ మార్కెట్‌ కూడా ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి తిరిగి సాధారణ స్థాయికి వస్తుంది’ అని ఆయన అన్నారు. ‘ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బ్యాంకింగేతర రుణ దాతల ఆందోళనలను తగ్గించాయి’ అని తెలిపారు. ప్రభుత్వం ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభాన్ని తొలగించేందుకు, ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచిందని, ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో డీఫాల్ట్‌ వార్తాలు వినిపిస్తున్నప్పటికి లిక్విడిటీ సంక్షోభం‍ ముగుస్తుందని షా అభిప్రాయపడ్డారు. 
అల్టికో డీఫాల్ట్‌..లిక్విడీటీ సమస్య?
   రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు రుణాలనిచ్చే అల్టికో క్యాపిటల్‌ ఇండియా, గత వారం రుణ దాతలకు వడ్డీ చెల్లింపులు చేయలేకపోవడంతో ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ కొరత ఆందోళనలు తిరిగి పెరిగాయి. నిధుల సమస్యలు, దేశీయ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడంతో ఎన్‌బీఎఫ్‌సీల వృద్ధి అంచనాలను ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ రేటింగ్‌ సంస్థ తగ్గించింది. కాగా అగ్రశ్రేణి బ్యాంకింగేతర రుణదాతలు, రుణాలు తీసుకోవడానికి సావరిన్ రుణాలపై చెల్లించే ప్రీమియం గత వారంలో కనిష్టానికి పడిపోవడంతో ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకున్న పాలిసీలు ఫలితాలను ఇస్తున్నట్లు అనిపిస్తోందని విశ్లేషకులు తెలిపారు. 
   రుణాలు చెల్లించలేకపోవడంతో గత ఏడాది ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ డీఫాల్ట్‌ గురయ్యింది. అప్పటి నుంచి అనేక ఎన్‌బీఎఫ్‌సీలు రుణాల విషయంలో​ ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. అంతేకాకుండా ఇప్పటికి కూడా ఈ కంపెనీలు రుణాలను పొం‍దడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీర్ఘకాలంగా కొనసాగిన ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వచ్చే కొన్ని త్రైమాసికాలలో ముగుస్తుందనే ఆశాభావాన్ని యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా వ్యక్తపరిచింది.
రిటైల్‌ రుణాలకు మారుతున్నాం: షా
    లిక్విడిటీ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఎడల్వీస్‌ తన రుణ పుస్తకంలోని రూ. 350 బిలియన్ల రుణాలను హోల్‌ సేల్‌ రుణాల నుంచి రిటైల్‌ రుణాలకు మార్చుకుంటుంది. ప్రస్తుతం 50 శాతంగా ఉన్న వ్యక్తిగత రుణాలు వచ్చే మూడేళ్లలో 75 శాతానికి చేరుకునే విధంగా ప్రణాళికలు వేస్తున్నామని షా తెలిపారు. కాగా హోల్‌ సేల్‌ ఎక్స్‌పోజర్‌ ఆందోళనలు పెరగడంతో గత ఏడాది కాలంలో ఎడల్వీస్‌ షేరు విలువ 60 శాతం పడిపోవడం గమనార్హం. తన 30 ఏళ్ల వ్యాపార జీవితంలో ఆర్ధిక మందగమనం.. నిధుల కొరత, తీవ్రమైన రిస్క్‌ విరక్తి వంటి అంశాలతో జత కట్టి రావడం మొదటి సారిగా చూస్తున్నానని షా అన్నారు. వినియోగం తగ్గడంతో పాటు నిధుల కొరత దీర్ఘకాలంగా కొనసాగుతుండడంతో దేశీయ ఆర్థిక వృద్ధి వరుసగా ఐదవ త్రైమాసికంలో కూడా తగ్గింది. ఇది ప్రస్తుతం 2013 ప్రారంభంలో ఉన్న బలహీన స్థాయిలకు చేరుకోవడం గమనార్హం. ‘ఇది చాలా అధ్వాన్నమైన కలయిక, కానీ ఇది ఒక ముగింపుకు వచ్చేసినట్టే’ అని షా అభిప్రాయపడ్డారు.You may be interested

26800 దిగువకు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Thursday 19th September 2019

బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 26800 స్థాయిని కోల్పోయింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ నేడు 27,175.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల బాట పట్టాయి. ప్రైవేట్‌ రంగ షేర్ల క్షీణత ఇండెక్స్‌ను భారీ నష్టాలపాలు చేసింది. ఫలితంగా ఇండెక్స్‌ 400 పాయింట్లు నష్టపోయి 26,767.90

యస్‌బ్యాంక్‌ 8 శాతం క్రాష్‌

Thursday 19th September 2019

ప్రైవేట్‌రంగ యస్‌ బ్యాంక్‌ షేర్లు వరుసగా 4వరోజూ నష్టాల బాట పట్టాయి. నేడు బ్యాంక్‌ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో రూ.64.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. యస్‌బ్యాంక్‌ ప్రమోటర్లలో ఒకరైన రాణాకపూర్‌కు చెందిన మోర్గాన్‌ క్రెడిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎంసీపీఎల్‌) నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లపై రేటింగ్‌ను కేర్‌ రేటింగ్‌ సంస్థ ఎ(-) రేటింగ్‌ నుంచి బిబిబి(-)కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. అలాగే రియల్టీ ఫైనాన్సింగ్‌ కంపెనీ అల్టికో డిఫాల్ట్‌ అయిన ఫలితంగా నేటి ఉదయం సెషన్‌లో యస్‌

Most from this category