STOCKS

News


బేర్‌ మార్కెట్లో నేనొక బుల్‌ని

Friday 16th August 2019
Markets_main1565937643.png-27807

‘నేను బేర్‌ మార్కెట్లో బుల్‌ని. నేను ఇప్పటికీ కూడా బుల్లిష్‌గానే ఉన్నాను. అంతేకాకుండా పూర్తిగా పెట్టుబడులు కూడా పెట్టాను. నా స్థితి మారలేదు కానీ మార్కెట్‌లోని పరిస్థితులు స్పష్టంగా మార్పు చెందాయి’ అని మోతీలాల్ ఓస్వాల్, ఎండి సహ వ్యవస్థాపకుడు, రామ్‌దేవ్‌ అగర్వాల్ ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...

దీర్ఘకాల బేర్‌ మార్కెట్‌..
దేశియ మార్కెట్లు బుధవారం భారీ నష్టాన్ని చూశాయి. ప్రస్తుతం మార్కెట్లు దీర్ఘకాల బేర్‌ దృక్పథంలో చిక్కుకున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా స్టాకును కొనుగోలు చేసేటప్పుడు ఆ స్టాకుకు సంబంధించిన మొత్తం విషయాలను తెలుసుకోవాలి. ఆ విషయాలను విశ్లేషించుకోవాలి. ప్రస్తుతం ఉన్న మార్కెట్లను గతేడాది మార్కెట్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. గత 30-35 ఏళ్ల మధ్య కాలాన్ని గమనిస్తే అతి పెద్ద నాలుగు బేర్‌ మార్కెట్‌ ఫేజ్‌లను గమనించవచ్చు. నేను నా కెరీర్‌ను 1987లో ప్రారంభించగా, 87, 88, 89 టైంలో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అలాంటి సమయంలోనే అతి పెద్ద బుల్‌ ర్యాలీ కూడా జరిగింది. హర్షద్‌ మెహతా నేతృత్వంలో 1991, 92 టైంలో సెన్సెక్స్‌ 600-700 స్థాయి నుంచి 4,500 స్థాయికి చేరుకుంది. అటుతర్వాత అది బేర్‌ మార్కెట్‌గా రూపాంతరం చెంది, తదుపరి  బుల్‌ మార్కెట్‌తో ముగిసిన విషయాన్ని గమనించాలి. తర్వాత ఏడెనిమిదేళ్లలో మార్కెట్లలో భారీ సరళికరణ చోటుచేసుకుంది.

నెగిటివిటే పెద్ద సమస్య..
ఆర్థిక వ్యవస్థలో, సమస్యల కంటే ప్రతికూల దృక్పథం ఎక్కువగా కనిపిస్తోంది. దీనికో ఉదాహరణ చెప్పాలి. నేను జబల్‌ పూర్‌ డీలర్‌తో మాట్లాడాను. ‘ఎలా నడుస్తోంది?’ అని అతన్ని అడిగితే, అతను సార్‌ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పాడు. నీ బుక్‌ విలువ ఎలా ఉంది? అని అడగగా నా పుస్తకం విలువ ఇతర కంపెనీల కంటే బాగానే పెరిగింది సార్‌ కానీ సమస్యంతా చానెల్‌లు, న్యూస్‌ పేపర్లు, సోషల్‌ మీడియాల ద్వారా నెగిటివిటీ బాగా విస్తరించిందని అన్నాడు.  ఇలాంటి పరిస్థితి వ్యవస్థలో ఉంటే ప్రతి ఒక్కరు నా ఉద్యోగం సురక్షితంగా ఉం‍దా? అనే భయాల మధ్య జీవిస్తారు. వినియోగదారుడు కూడా ఒక కారు కొనాలనుకున్న, ఈఎంఐకి కట్టుబడాలనుకున్న ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాడు. ఇలాంటి భయాలు వ్యవస్థకు మంచిది కాదు.

కార్పోరేట్‌ ఆదాయాల అనిశ్చితి..
కార్పోరేట్‌ ఆదాయాలలో అనిశ్చితి స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో సమస్యలు పెరగడం ప్రారంభమయ్యాయని అనుకున్నాం, కానీ డిసెంబర్ త్రైమాసికం నుంచి కార్పోరేట్‌ సమస్యలు పెరగడం మొదలయ్యాయి. మొదట్లో ఈ సమస్యలు తొందరగా ముగిసిపోతాయని, నూతన సంత్సరం మంచి సమయం వస్తుందని ఊహించాం. కానీ ఈ మందగమనం మార్చి త్రైమాసికంలో కూడా కొనసాగింది. అంతేకాకుండా ఆర్థిక సంవత్సరం 2019 మొదటి త్రైమాసికంలో తయారి దారులు ఉత్పత్తికి కోత కూడా విధించారు. హోల్‌ సేల్‌ అమ్మకాలు తగ్గడం చూశాం. ప్రస్తుతం మందగమనం రెట్టింపయ్యిందనే వార్తలు ప్రబలుతున్నాయి కూడా. ఖచ్చితంగా చెప్పాలంటే వ్యవస్థలో మందగమనం ఉంది. వ్యవస్థలో నెగిటివిటి కారణంగా కస్టమర్ల ఇన్‌ఫ్లో తగ్గుతుంది. డిమాండ్‌ భయాలు పెరిగాయి. అంతేకాకుండా వ్యవస్థలో ఒక రకమైన నిరాశావాదం కనిపిస్తోంది. 
     ప్రభుత్వం అధికంగా పన్నులు విధించడానికి ప్రయత్నిస్తోంది. అధిక రిజిస్ట్రేషన్ ఖర్చుల వలన ఇన్సూరెన్స్‌ ఖర్చులు పెరిగాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఈవీ) వచ్చాయి కాబట్టి పాత వ్యవస్థ తుడుచుపెట్టుకుపోతుందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటివన్ని ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించే చర్చలే. ఇలాంటి విషయాలు వ్యాపారాలకు సహాయం చేయవు ముఖ్యంగా మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు కీడునే ఎక్కువగా చేస్తాయి.  ఇలాంటి పరిస్థితులలోనే ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం కూడా వ్యవస్థను తాకింది. ప్రాథమికంగా ఎన్‌బీఎఫ్‌సీలు, నిధుల వ్యవస్థలో కీలకమైనవి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ లిక్విడిటీ సంక్షోభం వలన ఎన్‌బీఎఫ్‌సీలపై సందేహాలు ఏర్పడ్డాయి. ఎన్‌పీఏలు(నిరార్థక ఆస్తులు) పెరగడంతో బ్యాంకుల రేటింగ్‌లను రేటింగ్‌ సంస్థలు తగ్గిస్తున్నాయి. లిక్విడిటీ సంక్షోభం వలన మొత్తం ఈ నిర్మణ వ్యవస్థ దిగజారింది. కానీ ఇందులో మంచి కంపెనీలు తిరిగి పుంజుకునే అవకాశం కూడా ఉంది.

 You may be interested

దేశీ షేర్లపై విదేశీ బ్రోకరేజ్‌ల సిఫార్సులు

Friday 16th August 2019

జూన్‌ త్రైమాసికంలో ఇండియా కార్పొరేట్లు మిశ్రమ ఫలితాలు ప్రకటించాయి. దీంతో పలు అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు పలు కంపెనీల షేర్లపై ధృక్పథాలను మార్చుకున్నాయి. వీటి వివరాలు ఇలా ఉన్నాయి... 1. గ్లెన్‌మార్క్‌పై సీఎల్‌ఎస్‌ఏ: అమ్మొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 500 నుంచి 350కి తగ్గింపు. ఎర్నింగ్స్‌ గ్రోత్‌ ఒత్తిడిలో ఉందని వ్యాఖ్యానిస్తూ ఈపీఎస్‌ టార్గెట్‌ను 15- 18 శాతం మేర తగ్గించింది. 2. ఐబీరియల్‌ఏస్టేట్‌పై సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు రేటింగ్‌ కొనసాగింపు కానీ టార్గెట్‌ను రూ.

ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లకు రేటింగ్‌ షాక్‌

Friday 16th August 2019

10శాతం నష్టపోయిన షేర్లు గృహ, ఫైనాన్స్‌ రంగంలో సేవలు అందించే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌ (ఐబీహెచ్) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 10శాతం పతనమయ్యాయి. మూడీస్‌ రేటింగ్‌ ఏజెన్సీ కార్పోరేట్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. దేశీయంగా ఐబీహెచ్‌తో పాటు ఇతరత్రా ఫైనాన్స్ సంస్థలు నిధుల లభ్యత, నిధుల సమీకరణ వ్యయాలపరంగా ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల నేపథ్యంలో కంపెనీ దీర్ఘకాలిక కార్పొరేట్‌ రేటింగ్‌ను బీఏ1 నుంచి బీఏ2కి డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్

Most from this category