News


50,000 పాయింట్ల స్థాయికి సెన్సెక్స్‌: మోతిలాల్‌ ఓస్వాల్‌

Thursday 4th July 2019
Markets_main1562220659.png-26783

  • ప్రాథమిక సమస్యగా ఉన్నది రియల్‌ ఎస్టేట్‌ రంగమే
  • ప్రభుత్వ పాలసీకి  చిహ్నంగా బడ్జెట్‌: మోతిలాల్‌ ఓస్వాల్‌ 

బీజేపీ అధిక మెజార్టీతో రెండవసారి అధికారంలోకి వచ్చింది. ఇలాంటి సమయంలో విదేశి పెట్టుబడులను ఆకర్షించడానికి కార్పోరేట్‌ సంపాదన వృధ్ది చాలా అవసరమని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ సీఎండీ మోతిలాల్‌ ఓస్వాల్‌ అన్నారు. రియల్‌ ఎస్టేట్‌​రంగంలోని కొన్ని కంపెనీలకు ప్రమాదకర రుణాలను ఇవ్వడం వలనే ఎన్‌బీఎఫ్‌సీలు సమస్యల్లో చిక్కుకున్నాయని ఆయన ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే....

విదేశి పెట్టుబడుల ప్రవాహం..
ఎన్‌డీయే 2 పాలనపై ప్రజలు ఆశావాదంగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన మెరుగ్గా ఉంటుందని నమ్ముతున్నారు. అంతేకాకుండా విదేశి పెట్టుబడులు వస్తున్నాయి. ఇండియాలో ఇప్పుడు స్థిరప్రభుత్వం ఉండడంతో విదేశి మదుపర్లు మన మార్కెట్‌పై ఆశావాద దృక్పథంతో ఉన్నారు. కానీ కార్పోరేట్‌ ఫలితాలు నిరుత్సాహపరుస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ప్రైవేట్‌ లిస్టెడ్‌ కంపెనీల పనితీరు జీడీపీపై ప్రభావం చూపుతోంది. ఆర్థిక మందగమనం కార్పోరేట్‌ సంపాదనను ప్రభావితం చేస్తుంది. ఈ అంశాలు సానుకూలంగా పరిణమించడంతో పాటు మన కరెన్సీ నిలకడగా ఉంటే విదేశి పెట్టుడులు ప్రవాహంలా వెల్లువెత్తుతాయి. ఇది ఏడాదికేడాదికి పెరుగుతుంది కూడా. అంతేకాకుండా యూఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ ప్రభావం వలన ఇండియా లాభపడింది.  సంపాదన వృద్ధి రేటు బాగుంటే మార్కెట్‌లు వేగంగా లాభపడతాయి.  లేకుంటే మార్కెట్లు నెమ్మదిగా, నెమ్మదిగా పెరుగుతాయి. నా అంచనా ప్రకారం వచ్చే 18-24 నెలల కాలంలో సెన్సెక్స్‌ 50,000 పాయింట్ల మార్కును ఖచ్చితంగా దాటుతుంది. 

 రియల్‌ ఎస్టేట్‌ రుణాలతోనే ఎన్‌బీఎఫ్‌సీలు కుదేలు...
 ప్రాథమిక సమస్యగా ఉన్నది  రియల్‌ ఎస్టేట్‌ రంగమే. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని కొన్ని కంపెనీలకు ప్రమాదకర రుణాలివ్వడం వలన ఎన్‌బీఎఫ్‌సీ రంగం​ కుదేలయ్యింది. వీటితో పాటు నగదు కొరత, రెరా(రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ సంస్థ) కారణాన ఆర్థిక మందగమనం రియల్‌ ఎస్టెట్‌ రంగంపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఇప్పుడా రంగం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఎన్‌బీఎఫ్‌సీల రుణాలను  డెవలపర్‌లు తిరిగి చెల్లించలేకపోతే ఎన్‌బీఎఫ్‌సీలు మూచ్యువల్‌ ఫండ్‌లు, బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుంటాయి. ఫలితంగా ఈ బాధ మనకి తెలుస్తోంది. ఇదాంతా ఒక వలయం లాంటింది.
 
సాల్వన్సీ సమస్య కాదు...

లిక్విడిటి సమస్య కన్నా సాల్వన్సీ పెద్ద సమస్య కాదు. ఎందుకంటే కొన్ని కంపెనీలు మాత్రమే పూర్తిగా రుణాలను చెల్లించలేకపోతున్నాయి. చాలా వరకు కంపెనీల పుస్తకపు విలువ నాణ్యత, ఆస్తీ నాణ్యత బాగున్నాయి. దీంతో పాటు నియంత్రణ సంస్థ నిబంధనలను కఠినతరం చేసింది. ఇదంతా డోమినో ప్రభావంలా కనిపిస్తోంది.  
   ప్రభుత్వం ఏ విధంగా ఆదాయాలు పెంచుకుంటుంది. ఏ విధంగా పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఏ విధంగా ఆస్తులను ఉపయోగించుకుంటుందనే అంశాలపై ప్రభుత్వ పాలసీలు బడ్జెట్‌ ద్వారా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.  ఆర్బీఐ  ప్రభుత్వానికి పూర్తి మద్ధతుగా ఉంది కానీ ఈ మొత్తం పక్రియ అంతటిని ప్రభావం చేయడం లేదు. వడ్డిరేట్ల పూర్తిగా వినియోగదారులకు బదిలి కావడం చాలా అవసరం. 

తనఖా రుణ రంగంలో అవకాశాలు...
 తనఖా రుణాల రంగం‍లో అధికంగా అవకాశాలున్నాయి. ఇండియాలో వీటి వాటా 10 శాతం ఉంటే, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో 30-40 శాతం మాత్రమే ఉంది. అదే అభివృద్ధి చెందిన దేశాలలో 80-90 శాతంగా ఉన్న విషయాన్ని గమనించాలి. తనఖా రుణాలు  ఇండియాలో తక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న సమస్యల నుంచి గుణపాఠాలు నేర్చుకొని మన రుణాల రంగం వృద్ధి చెందుతుందని నమ్మకం ఉంది. దీనితో పాటు హౌసింగ్‌ సెక్టార్‌ అభివృద్ధికి అవకాశం ఉంది.  ప్రభుత్వ తీసుకొస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన్‌ పథకం వలన తక్కువ ఖర్చుగల ఇళ్ల నిర్మణం ఊపందుకుంటుంది. క్రెడిట్‌ రేటింగ్‌ల వలన రుణాల ఖర్చులు తగ్గాయి. క్రెడిట్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్అ‌వుతుండడంతో వచ్చే ఏడాదిలో రుణ వ్యయాలు 30-35 బేసిస్‌ పాయింట్లు తగ్గనున్నాయి.

ఆర్థిక వ్యవస్థకు ఇవి అవసరం...
     తయారి రంగం అధికంగా ఉద్యోగాలను సృస్టించే విధంగా, వినియోగదారుల సెంటిమెంట్‌ బలపడే విధంగా ఆర్ధిక వ్యవస్థను ప్రస్తుతం ఎలా ‍పరుగులు పెట్టించాలనే ప్రశ్న మొదలవుతుంది. పెద్ద నగరాలలో ప్రెవేటు పెట్టుబడులు పెరిగితే రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సరియైన మూలధనం అందాలి. మూలధనం లేకుండా రుణాల వ్యాపారాన్ని బ్యాంకులు నిర్వహించలేవు. ట్రేడ్‌ భయాల వలను సహజంగానే ఇండియా లాభపడుతోంది. చైనాకు వెళ్లే పెట్టుబడులలో చాలా వరకు ఇండియాకు వచ్చాయి.  ప్రస్తుతం ఉన్న కొత్త ప్రభుత్వం సంస్కరణలను తీసుకువస్తే చైనా కన్నా ఇండియా మంచి స్థానంలోనే ఉంటుంది. 

 You may be interested

ఇండియా మార్ట్‌ లిస్టింగ్‌ బంపర్‌ హిట్‌

Thursday 4th July 2019

గతవారంలో ఐపీఓ ఇష్యూను పూర్తి చేసుకున్న ఇండియామార్ట్‌ షేర్లు గురువారం ఎక్చ్సేంజీల్లో ఘనంగా లిస్ట్‌ అయ్యాయి. ఐపీఓ ఇష్యూకు అద్భుతమైన స్పందన లభించటం, మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొని ఉండటంతో ఇష్యూ ధర(రూ.973.00)తో పోలిస్తే 21శాతం ప్రీమియంతో రూ.1180.00 వద్ద లిస్ట్‌ అయ్యాయి. బీఎస్‌ఈలోని ఇంట్రాడేలో ఒక దశలో 37.61శాతం వరకు లాభపడి రూ.1339.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఉదయం గం.11:30ని.లకు షేరు ఇష్యూ ధర(రూ.973.00)తో పోలిస్తే 30శాతం

ఆర్థిక సర్వే.... 7% జీడీపీ వృద్ధి!

Thursday 4th July 2019

ఎకనమిక్‌ సర్వే అంచనా బడ్జెట్‌కు ముందస్తు పీఠికగా పేర్కొనే ఎకనమిక్‌ సర్వేను ప్రభుత్వం నేడు పార్లమెంట్‌ ముందుంచింది. రాబోయే రోజుల్లో ఎకానమీలో పాజిటివ్‌ సంకేతాలు కనిపిస్తాయని సర్వే అభిప్రాయపడింది. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి 7 శాతం ఉంటుందని అంచనా వేసింది. పెట్టుబడుల రేటులో తిరోగమనం పూర్తయిన సంకేతాలున్నాయని తెలిపింది. తీరైన ఎంపీసీ కారణంగా వడ్డీరేట్లు దిగివస్తున్నాయని పేర్కొంది. జనవరి- మార్చిలో ఎన్నికల కారణంగా ఎకానమీలో స్తబ్దత నమోదయిందని తెలిపింది. ఈ

Most from this category