STOCKS

News


ఫండ్స్‌ ఏం కొన్నాయి...ఏం విక్రయించాయ్‌?

Saturday 14th September 2019
Markets_main1568447204.png-28376

 జులై నెలలో కంటే దేశియ ఈక్విటీ మార్కెట్లు అగష్టులో కొంత సానుకూలంగా కదిలాయి. విదేశి సంస్థాగత ఇన్వెస్టర్లు అగష్టులో కూడా అధికంగా అమ్మకాలకు పాల్పడగా, దేశియ సంస్థాగత ఇన్వెస్టర్లు నికర కొనుగోలు దారులయ్యారు. బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ జూన్‌, జూలై నెలలో భారీగా దిద్దుబాటుకు గురవ్వగా, అగష్టులో మాత్రం కొంత కోలుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు జూన్‌లో 8 శాతం, జులైలో 11 శాతం పతనంకాగా, అగష్టులో మాత్రం 1 శాతం చొప్పున మాత్రమే క్షీణింంచడం పతనమవ్వడం గమనార్హం. ప్రభుత్వం అగష్టు నెలలో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ సానుకూలంగా మారిందని విశ్లేషకులు తెలిపారు. కాగా ప్రభుత్వం ఆటో, ఎన్‌బీఎఫ్‌సీలతో సహా వివిధ రంగాలకు సంబంధించిన ఆర్థిక చర్యలను ప్రకటించిన విషయం తెలిసిందే. 
   ఈ చర్యల ఫలితంగా, ఆగస్టు 2019 లో ఈక్విటీ ఫండ్లలోకి ఇన్‌ఫ్లో రూ .9,152 కోట్లకు పెరిగింది. కాగా ఈ విలువ జులై నెలలో రూ.8,113 కోట్లుగా ఉంది. దీనితో పాటు సిప్‌ ఇన్‌ఫ్లో  జులై నెలలో రూ .8,324 కోట్లుండగా, అగష్టు నాటికి రూ .8,231 కోట్లకు స్వల్పంగా తగ్గి చేరుకుంది. అయినప్పటికి సిప్‌లలో ఇన్‌ఫ్లో బలంగా ఉందని విశ్లేషకులు తెలిపారు.

అన్ని రకాల ఫండ్లలలోకి ఇన్‌ఫ్లో..
‘ఆర్థిక పరిస్థితి, మార్కెట్‌ పరిస్థితి అనిశ్చితిగా ఉన్నప్పటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లపై రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి, వరుసగా నాలుగవ నెలలో కూడా స్థిరంగా కొనసాగుతోంది’ అని ఏఎంఎఫ్‌ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎన్ ఎస్ వెంకటేష్ అన్నారు. అన్ని రకాల ఈక్విటీ ఫండ్లలోకి, ముఖ్యంగా స్మాల్‌, మిడ్-క్యాప్ ఫండ్స్‌లోకి, ఈక్విటి లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఫండ్లలోకి నగదు ఇన్‌ఫ్లో పెరగడం, అభివృద్ధి చెందుతున్న వ్యాపారుల ఆసక్తిని సూచిస్తోందని అన్నారు. 
    లార్జ్‌క్యాప్‌లకు సంబంధించి, అశోక్ లేలాండ్, ఐషర్ మోటార్స్, అవెన్యూ సూపర్‌మార్ట్స్, అదానీ పోర్ట్స్, యెస్ బ్యాంక్‌ వంటి షేర్లను ఆగస్టులో మ్యూచువల్ ఫండ్స్ అత్యధికంగా కొనుగోలు చేశాయని ఐసీఐసీఐ డైరెక్ట్ తెలిపింది. కానీ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ, హావెల్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్ షేర్లను మ్యూచువల్‌ ఫండ్స్‌ అధికంగా విక్రయించాయని ఈ బ్రోకరేజి పేర్కొంది. 
    మిడ్‌క్యాప్ విభాగంలో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఆల్కమ్ లాబొరేటరీస్, జీఎఫ్‌ఎల్‌, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ, గ్రుహ్ ఫైనాన్స్ వంటి స్టాక్లలను అగష్టు నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ అత్యధికంగా కొనుగోలు చేయగా, రిలయన్స్ నిప్పన్ ఏఎంసీ, ఎన్‌బీసీసీ, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, జిందాల్ స్టీల్ అండ్‌ పవర్, అదానీ పవర్ షేర్లను అత్యధికంగా విక్రయించాయని ఐసిఐసిఐ డైరెక్ట్ పేర్కొ‍ంది. మొత్తంమీద, మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు (డెట్ + ఈక్విటీ) ఆగస్టు నెలలో రూ .1,02,538 కోట్లకు చేరుకున్నాయి. ఇది జూలై నెలలో(రూ. 87,087.71 కోట్లు) కంటే అధికం కావడం గమనార్హం. అంతేకాకుండా వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ నెల ప్రాతిపదికన రూ. 24.53 లక్షల కోట్ల నుంచి అగష్టు నాటికి రూ. 25.47 లక్షల కోట్లకు చేరుకుంది.
    స్మాల్‌క్యాప్ స్టాక్‌లలో, మహానగర్ గ్యాస్, డెల్టా కార్ప్, సియట్‌,  వి-మార్ట్, లెమన్ ట్రీ హోటళ్ల షేర్లను మ్యూచువల్‌ ఫండ్స్‌ అత్యధికంగా కొనుగోలు చేయగా, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, వండర్లా హాలిడేస్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సుప్రజిత్ ఇంజనీరింగ్, బీఎస్‌ఈ లిమిటెడ్ షేర్లను అగష్టులో అధికంగా విక్రయించాయి. జూలైలో బాగా నష్టపోయిన నిఫ్టీ ఆటో ఇండెక్స్‌, అగష్టులో 2 శాతానికి పైగా లాభడింది. అగష్టులో ఐటీ రంగం 2.5 శాతం, ఫార్మా 1 శాతం లాభపడగా, బ్యాంకింగ్‌ సెక్టార్‌ 5 శాతం పడిపోయి నష్టాలను కొనసాగిస్తోంది.You may be interested

1500డాలర్ల దిగువకు పసిడి

Saturday 14th September 2019

అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ బలపడటంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 1500డాలర్ల దిగువన ముగిసింది. శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 11.40డాలర్లు క్షీణించి 1,496.00డాలర్ల వద్ద స్థిరపడింది. వచ్చేవారంలో మంగళ, బుధవారాల్లో ఫెడ్‌రిజర్వ్‌ ఓపెన్‌ పాలసీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ వైఖరి పసిడి ఫ్యూచర్ల తదుపరి గమనానికి కీలకం కానుంది. ఒకవేళ వడ్డీరేట్లను తగ్గిస్తే పసిడికి కలిసొస్తుంది. అయితే కామెక్స్‌ పోజిషన్లు

వివిధ రంగాలకు ఉద్దీపన....2.30 గంటలకు ఆర్థిక మంత్రి ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌!

Saturday 14th September 2019

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు(సెప్టెంబర్‌ 14) మధ్యాహ్నాం 2.30 సమయానికి జాతియ మిడియా కేంద్రం, ఢిల్లీ నుంచి ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడనున్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక మందగమనాన్ని తగ్గించేందుకు  వివిధ రంగాల వారిగా మరికొన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు తెలిపారు. కాగా ఈ రోజు మధ్యాహ్నాం 2.30కి ఆర్థిక మంత్రి ఢిల్లీ నుంచి ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడనున్నారని

Most from this category