News


ఇన్వెస్టర్లకు రిస్క్‌ ఫండ్‌లపై ఆసక్తి!

Friday 9th August 2019
Markets_main1565331723.png-27663

ధీరేంద్ర కుమార్ 

మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు, ప్రమాదకర ఫండ్‌లలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని వాల్యు రిసెర్చ్‌, వ్యవస్థాపకుడు, సీఈఓ ధీరేంద్ర కుమార్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

ఎంఎఫ్‌ ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకుంటున్నారు..
లిక్విడ్ ఫండ్స్‌తో పాటు, ఈక్విటీ ఫండ్స్ కూడా మంచి స్థితిలోనే ఉన్నాయి. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్‌) ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోడానికి ఆత్రుతగా ఉన్నారు. ఒకసారి ఫోకస్ ఫండ్లలోకి వచ్చే నగదును పరిశీలిస్తే, మిడ్‌క్యాప్ ఫండ్లలోకి వచ్చే నగదు స్థాయి గణనీయంగా పెరిగిందని అర్థమవుతుంది. చాలామంది మ్యూచువల్ ఫండ్లలోకి వచ్చిన కొత్త ఇన్వెస్టర్లు పారిపోతారని, ఎక్కువకాలం అందులో ఉండలేరని అభిప్రాయపడతారు. కానీ ఎంఎఫ్‌ ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ప్రమాదకర నిధుల కేటగిరీలోకి ప్రవేశిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫండ్‌లలో నగదు ప్రవాహం కూడా బాగుంది.

ఇన్వెస్టర్లు అలా ఉన్నారు..
చాలా మంది ఎస్‌ఐపీ(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లు పాటించేవాళ్లు గత రెండు, మూడేళ్ల కాలం నుం‍చి చాలా నిరాశలో ఉన్నారు. ఇన్వెస్టర్లు నిరాశలో ఉన్నప్పటికి, సెంటిమెంట్ తక్కువగా ఉన్నప్పటికి, ఆర్థిక మందగమన వార్తలు జూలైలో పెరిగినప్పటికి ఎస్‌ఐపీ ప్రవాహాలు జూన్‌ నెలలో రూ. 8,000 కోట్లకు పై మాటగానే ఉంది. ఇది కేవలం ఇన్వెస్టర్ల పరిపక్వతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది గత కొం‍త కాలం నుంచి అలా రూపుదిద్దుకుంది. గతంలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేవారు కాలానుగుణమైన రీతిలో వచ్చేవారు.  ఇన్వెస్టర్లు  స్థిరమైన పద్ధతిలో వస్తున్నప్పుడు ఈ సమస్యలకు దూరంగా పారిపోవడం లేదు. కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితిని అవకాశంగా ఉపయోగించుకొని స్టాకులను చౌక ధరకే కొంటున్నారు. రిస్క్‌ ఫండ్స్‌లలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫోకస్డ్ ఫండ్స్‌లలో, మిడ్ క్యాప్ ఫండ్లలోకి నగదు ప్రవాహాం బాగుంది. వాస్తవానికి, ఇన్వెస్టర్లు స్థిరంగా కదిలే మల్టీక్యాప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా లేకపోవడం ఒకింతా ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే.

దీర్ఘకాలానికి ఎస్‌ఐపీలు..అధిక రిటర్నులు
ఏ విభాగంలోనైనా దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టిన వాళ్లు  ప్రశాంతంగా ఉండండి. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మల్టీక్యాప్ లేదా మిడ్‌క్యాప్ లేదా స్మాల్ క్యాప్ ఫండ్‌ల రిటర్నల మధ్య తేడాను, 10 ఏళ్ల ప్రాతిపదికన గమనిస్తే, స్మాల్‌క్యాప్ 2-3 శాతం అధిక ఈల్డ్‌ను ఇవ్వనున్నాయి. పదేళ్ల ప్రాతిపదికన ఎస్‌ఐపీలో 20 శాతం లేదా 22.5 శాతం రిటర్న్స్‌ వస్తే అర్ధవంతంగా ఉంటుంది. 20 శాతం లేదా 18 శాతం, 16 శాతం రిటర్న్‌​‍్స కూడా మిమ్మల్ని మెప్పించవచ్చు.



You may be interested

13శాతం లాభపడ్డ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

Friday 9th August 2019

ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో 13శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈ ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు రూ.446.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో షేరు ఒకదశలో 13.31శాతం పెరిగి రూ.503.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఉదయం గం. 11:00లకు షేరు కిత్రం ముగింపు ధర(రూ.444.35)తో పోలిస్తే 11.30శాతం పెరిగి రూ.494.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట

నగరాల్లో దూసుకెళ్తున్న క్విక్‌ రైడ్‌..

Friday 9th August 2019

యూజర్ల సంఖ్య 20 లక్షలకు చేరిక కంపెనీ కో-ఫౌండర్‌ కేఎన్‌ఎం రావు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- కార్‌, బైక్‌ పూలింగ్‌ సంస్థ క్విక్‌ రైడ్‌ తొమ్మిది నగరాల్లో 20 లక్షల యూజర్లతో దూసుకెళ్తోంది. ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే కంపెనీకి 3 లక్షల మంది వినియోగదార్లున్నారు. రోజుకు 90,000లకుపైగా కార్‌ పూల్స్‌ నమోదవుతున్నాయి. దీనిని 2020 చివరికల్లా 10 లక్షల స్థాయికి తీసుకెళ్లాలన్నది లక్ష్యమని క్విక్‌ రైడ్‌ కో-ఫౌండర్‌ కేఎన్‌ఎం రావు గురువారమిక్కడ మీడియాకు

Most from this category