ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఫండ్స్ కొనుగోళ్ల జోరు
By Sakshi

దేశీయ మ్యూచువల్ ఫండ్లు ప్రైవేట్‌రంగ బ్యాంకు షేర్ల కొనుగోళ్లకు ఆస్తకి చూపుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి మ్యూచువల్ ఫండ్ల ఫోర్ట్‌ఫోలియోలో ప్రైవేట్‌రంగ బ్యాంకుల హోల్డింగ్ వాటా రికార్డు స్థాయిలో 20.8శాతానికి పెరిగినట్లు మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ తెలిపింది. గతేడాది ఇదే సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 470 బేసిస్ పాయింట్ల అధికమని గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడిదారులు రక్షణాత్మక ధోరణి అవలంభిస్తుండం, కంపెనీ ఆదాయాల తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఆర్థిక మందగమన భయాలు దేశీయ మ్యూచువల్ ఫండ్లను ప్రైవేట్ బ్యాంకింగ్, కన్జూ్యమర్ షేర్ల కొనుగోళ్లకు ప్రేరేపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 20 ప్రముఖ మ్యూచువల్ ఫండ్ హవుస్ల్లో 14 సంస్థలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్ల కొనుగోళ్లకు అధిక ప్రాముఖ్యతనిచ్చాయి. ప్రధాన మ్యూచువల్ ఫండ్ల మొత్తం ఈక్విటీ ఆస్తులలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ హోల్డింగ్ వాటా 5 నుంచి 11శాతం వరకు ఉంది. పెట్టుబడిదారుల నుండి పెరుగుతున్న డిమాండ్‌తో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఏడాది 25 బిలియన్ డాలర్ల పెరుగుదలతో ప్రపంచ బ్యాంకులలో అతిపెద్ద మార్కెట్ క్యాప్ గెయినర్‌గా నిలిచింది. ఎన్ఎస్ఈలో ప్రధాన ఇండెక్స్‌లైన నిఫ్టీ-50 మొత్తం వెయిటేజీలో ప్రైవేట్ బ్యాంకుల వెయిటేజీ 26.8శాతంగానూ, బీఎస్ఈ 200 ఇండెక్స్ మొత్తం వెయిటేజీలో 21.6 శాతం ఉంది. ఇక కన్జూమర్ స్టాక్స్ విషయానికొస్తే... దేశీయ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ వాటా 8.4 శాతానికి పెరిగింది. ఇటీవల నెస్లే కంపెనీ షేర్లను నిఫ్టీలోకి చేర్చడంతో అధిక కేటాయింపుకు దోహదపడింది.
You may be interested
ఆటో, బ్యాంక్, మెటల్స్‌పై పాజిటివ్!
Thursday 17th October 2019రిలయన్స్ సెక్యూరిటీస్ రెండో త్రైమాసిక సీజన్ ఆరంభం కావడంతో మార్కెట్లు క్రమంగా రికవరీ చూపుతున్నాయి. ప్రస్తుత రేంజ్లో మార్కెట్ రాబోయే వారాల్లో కన్సాలిడేట్ అవుతుందని రిలయన్స్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. ఈ స్థితిలో నిర్ధిష్టస్టాకుల్లోనే కదలికలుంటాయని, ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన స్టాకుల్లో పెట్టుబడులు పెడతారని, ముఖ్యంగా ఫలితాలు వస్తున్న కంపెనీల స్టాకుల్లో కదలికలుంటాయని తెలిపింది. బ్యాంకు నిఫ్టీ తన 200 రోజుల డీఎంఏను బలంగా దాటి క్లోజయితే ర్యాలీ జరుపుతుందని అంచనా
నష్టాల్లో మెటల్ షేర్లు
Thursday 17th October 2019స్వల్పలాభంతో ట్రేడ్ అవుతున్న మార్కెట్లో మెటల్ షేర్లు అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్ఎస్ఈలో మెటల్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ నేటి ఉదయం సెషన్లో 1.50శాతానికి పైగా నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్ 2,369.55 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ ప్రారంభం నుంచి మెటల్ షేర్లలో అమ్మకాలు నెలకొనడంతో ఇండెక్స్ ఒకదశలో 1.50శాతం నష్టపోయి 2,352.10 స్థాయికి పతనమైంది. ఉదయం గం.10:45ని.లకు ఇండెక్స్ క్రితం ముగింపు(2352.1)తో పోలిస్తే