News


ఫలితాల ఎఫెక్ట్‌:ముత్తూట్‌ ఫైనాన్స్‌ 10శాతం అప్‌

Thursday 14th November 2019
Markets_main1573724801.png-29592

రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో ముత్తూట్‌ షేరు 10శాతం లాభపడింది. కంపెనీ నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం క్యూ2 ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ నికర లాభం 77 శాతం ఎగసి రూ. 900 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 41 శాతం బలపడి రూ. 1047 కోట్లను తాకింది. కంపెనీ నికర వడ్డీ ఆదాయం 32 శాతం పెరిగి రూ.1,467  కోట్లకు చేరింది. రెండో త్రైమాసికంలో అనుబంధ సంస్థ వ్యాపారాలైన  త్రైమాసికంలో మైక్రో ఫైనాన్స్‌ ఇన్‌స్టిస్యూషన్‌, హౌసింగ్‌, కమర్షియల్‌ వెహికల్‌, ఇన్సూరెన్స్‌ పనితీరు బాగుంది. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ద్రవ్య కొరత సైతం వెంటాడింది. దీంతో వినియోగదారులకు నిధుల సమీకరణకు బంగారంపై ఆధారపడటంతో  బంగారంపై రుణాల వృద్ధి ఈ త్రైమాసికంలోనూ కొనసాగింది. రెండో త్రైమాసిక చివరి నాటికి గోల్డ్‌ లోన్‌ బుక్‌ గోత్ర్‌ 15శాతానికి ఎగిసే అవకాశం ఉంది. అందుకు తగిన మార్గాలను ఎంపిక చేసుకున్నామని మూత్తూట్‌ ఫైనాన్స్‌ యాజమాన్యం తెలిపింది.  ఫలితాల నేపథ్యంలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ షేరు ఇంట్రాడేలో 10.50శాతం లాభపడి రూ.717.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు క్రితం ముగింపు(రూ.650.10)తో పోలిస్తే 10శాతం లాభంతో రూ.712.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.389.30లు రూ.718.65లుగా నమోదయ్యాయి. 



You may be interested

జీడీపీ వృద్ధి అంచనాల్ని తగ్గించిన మూడీస్‌

Thursday 14th November 2019

  విదేశీ రేటింగ్‌ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌, 2019కి గాను ఇండియాపై తన జీడీపీ వృద్ధి రేటు అంచనాలను  5.6 శాతానికి గురువారం తగ్గించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినియోగ రంగంలోని మందగమనంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపడం లేదని ఈ బ్రోకరేజి తెలిపింది. ‘ఇండియా జీడీపీ వృద్ధి రేటును సవరిస్తున్నాం. గతేడాది 7.4 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది 5.6 శాతానికి తగ్గుతుందని అంచనావేస్తున్నాం’

రఫేల్‌ కేసులో మోదీ ప్రభుత్వానికి సుప్రీం క్లీన్‌చిట్‌

Thursday 14th November 2019

రివ్యూ పిటీషన్ల కొట్టివేత రాఫెల్ కుంభకోణ ఆరోపణలపై ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలయిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్ పై కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈమేరకు సమీక్ష కోరుతూ వచ్చిన పిటిషన్లన్నింటిని కోర్టు తిరస్కరించింది. సుమారు రూ.59,000 కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై 2018లో

Most from this category