News


ముత్తూట్‌ ఫైనాన్స్‌ షేరు రికార్డ్‌

Monday 17th February 2020
Markets_main1581914318.png-31845

7 శాతం జంప్‌చేసిన షేరు
క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌

బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే ఎన్‌బీఎఫ్‌సీ.. ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ ఈ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. దీంతో ఉదయం 9.50 ప్రాంతంలో ఈ షేరు 7.2 శాతం జంప్‌చేసి రూ. 800 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 801ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకావడం గమనార్హం!

క్యూ3 ఇలా
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ నికర లాభం 64 శాతం ఎగసి రూ. 841 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 36 శాతం పెరిగి రూ. 2587 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం 36 శాతం పుంజుకుని రూ.  1137 కోట్లకు చేరింది. డిసెంబర్‌కల్లా కంపెనీ నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 43,436 కోట్లను తాకినట్లు ముత్తూట్‌ ఫైనాన్స్‌ పేర్కొంది. 



You may be interested

ఈ పెట్టుబడులు అందరికీ తగవు..!

Monday 17th February 2020

ఎండోమెంట్‌ పాలసీల్లో ప్రయోజనం తక్కువే యులిప్‌ ప్లాన్లలో చార్జీల భారం స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో రిస్క్‌ పాళ్లు అపరిమితం డెట్‌ ఫండ్స్‌లోనూ కొన్నింటిలో హై రిస్క్‌  సెక్టోరల్‌ ఫండ్స్‌ అన్ని కాలాలకూ తగవు  పీఎంఎస్‌ సేవలు ధనిక ఇన్వెస్టర్లకే పెట్టుబడికి ముందు తగినంత అవగాహన అవసరం పెట్టుబడుల కోసం ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అందరికీ అన్నీ సరిపోలవు. ఆయా ఉత్పత్తుల్లో సానుకూల, ప్రతికూలతలు ఉంటాయి. రిస్క్‌ కూడా ఉత్పత్తిని బట్టి మారిపోతుంది. రాబడులు కూడా అన్నింటిలోనూ ఒకే మాదిరిగా

స్వల్పంగా తగ్గిన పసిడి

Monday 17th February 2020

 సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో ఉదయం 10 గంటల సమయంలో గత ముగింపు ధరతో పోలిస్తే రూ.115 తగ్గి 10 గ్రాముల పసిడి ధర రూ. 40,865.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో  గత ముగింపు ధరతో పోలిస్తే స్వల్పంగా ఒక డాలరు​ తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,585.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  (శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా

Most from this category