News


12200 వరకు నిఫ్టీ పరుగు!

Tuesday 26th November 2019
Markets_main1574742110.png-29856

టెక్నికల్స్‌ సంకేతాలు
దేశీయ మార్కెట్లు ఈవారాన్ని మంచి లాభాలతో ఆరంభించాయి. మంగళవారం ఆరంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ రికార్డు గరిష్ఠాలను చేరింది. ఇకపై నిఫ్టీకి 12140- 12150 పాయింట్ల రేంజ్‌లో చిన్న పాటి అవరోధం ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆ పైన 12200 పాయింట్లను చేరడం ఖాయంగా సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. ఇప్పటికే 12వేలు, 12100 పాయింట్ల కాల్‌రైటర్లు తమ షార్ట్స్‌ను కవర్‌ చేసుకోవడం ఆరంభించారు. నిఫ్టీ 12200- 12250పాయింట్లు చేరిన తర్వాత ప్రాఫిట్‌ బుకింగ్‌ ఉండొచ్చని నిపుణుల అంచనా. సోమవారం ట్రేడింగ్‌ చివరి దశలో 11900- 12100 మధ్య పుట్‌ ఆప్షన్‌ విక్రేతలు అమ్మకాలు పెంచడం సూచీల్లో అప్‌మూవ్‌ను సూచించింది. ముఖ్యంగా 12వేల పాయింట్ల వద్ద పుట్‌ రైటింగ్‌ భారీగాజరిగింది.

ఇకపై షార్ట్‌ పొజిషన్లు మరింత కుంచించుకుపోతాయని, షార్ట్‌కవరింగ్‌ మరింత వేగంగా జరుగుతుందని ఆప్షన్స్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 12140 పాయింట్లను నిఫ్టీ దాటితే ఈ షార్ట్‌ కవరింగ్‌ మరింత వేగంగా ఉంటుందన్నారు. నిఫ్టీ ఫ్యూచర్స్‌లో కూడా ఈ షార్ట్‌కవరింగ్‌ కనిపించింది. 12140పైన పెరిగే జోరుకు 12250 పాయింట్ల వద్ద బ్రేకులు పడవచ్చని, అక్కడ ప్రాఫిట్‌ బుకింగ్‌ ఛాన్సులు అధికమని డెరివేటివ్స్‌ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం ఇండియా వీఐఎక్స్‌ 14.84 వద్ద ఉంది. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డు!

Tuesday 26th November 2019

గత కొన్ని సెషన్‌ల నుంచి జీవిత కాల గరిష్ఠానికి చేరువలో ట్రేడయిన బ్యాంక్‌ నిఫ్టీ, కొనుగోలు మద్దతు లభించడంతో  మంగళవారం సెషన్‌లో కొత్త ఆల్‌టైం రికార్డును సృష్టించింది. గత సెషన్‌లో 31,555.90 పాయింట్ల వద్ద ముగిసిన ఈ ఇండెక్స్‌ మంగళవారం సెషన్‌లో 31,692.85 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. సెషన్‌ ప్రారంభమైన కొద్ది సమయంలోనే ఈ ఏడాది జూన్‌ 4 న ఏర్పరిచిన 31,752 రికార్డు స్థాయిని అధిగమించి 31,796.20 వద్ద కొత్త జీవిత కాల

ఆంధ్రప్రదేశ్‌లో జీపీఎస్‌ ట్రాకర్స్‌ తయారీ కేంద్రం

Tuesday 26th November 2019

ముందుకొచ్చిన వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్‌ ప్లాంటు కోసం రూ.50 కోట్ల దాకా వ్యయం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జీపీఎస్‌, ఐవోటీ పరికరాల తయారీ సంస్థ వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్‌... ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మంగళగిరి సమీపంలో రానున్న ఈ కేంద్రానికి కంపెనీ రూ.50 కోట్ల దాకా వెచ్చించనుంది. రోజుకు 2,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తామని, 2020 జూలై నాటికి తయారీ ప్రారంభమవుతుందని వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్‌ ఫౌండర్‌

Most from this category