News


ముకేశ్‌ అంబానీ@రూ.5లక్షల కోట్ల అధిపతి.

Thursday 28th November 2019
Markets_main1574921065.png-29922

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధితి ముకేశ్‌ అంబానీ మరో ఘనత సాధించారు. దేశంలోనే రూ.5లక్షల కోట్లను ఆర్జించిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కారు. తనసొంత కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం ట్రేడింగ్‌లో రూ.10లక్షల కోట్లను అందుకున్న నేపథ్యంలో ముకేశ్‌ సంపాదన రూ.5లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంల రెండో త్రైమాసిక ఫలితాల అనంతరం కంపెనీలో అదనంగా 2.76శాతం ప్రమోటర్ల వాటాను దక్కించుకోవడంతో కంపెనీలో ముకేశ్‌ మొత్తం వాటా 50.50శాతానికి చేరుకుంది. గత కొంతకాలంగా రిలయన్స్‌ షేరు ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో చివరి 15వారాల్లో ముకేశ్‌, అతని కుటుంబ సభ్యుల సంపాదన 45శాతం పెరిగింది. రిలయన్స్‌ షేరు 0.73శాతం పెరిగి రూ.1581.25 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకోవడంతో కంపెనీ రూ.10లక్షల కోట్లను అందుకుంది. ఐక ఐదేళ్లలో ఈ షేరు 217 శాతం ర్యాలీ చేసింది. రెండోస్థానంలో ఉన్న ఐటీ దిగ్గజ కంపెనీ టీసీఎస్‌ షేరు ఇదే ఐదేళ్ల కాలంలో కేవలం 55శాతం మాత్రమే పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ బుధవారం ముగింపు నాటికి రూ.7.81 లక్షల కోట్లు కోట్లుగా ఉంది. అంటే రెండు కంపెనీల మధ్య వ్యత్యాసం రూ.2.19లక్షల కోట్ల అన్నమాట. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.7లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో మూడోస్థానంలో కొనసాగుతుండగా, ఎంఫ్‌ఎంజీసీ రంగంలోని హెచ్‌యూఎల్‌ రూ.4.60లక్షల కోట్లతో నాలుగో స్థానంలో ఉంది.

తాజాగా బ్లూమ్‌బర్గ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం... అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెప్ఫారిస్‌ 112 బిలియన్‌ డాలర్ల సంపాదనతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా ప్రసిద్ధికెక్కారు. మైక్రోసాఫ్ట్‌ స్థాపకుడు బిలిగేట్స్‌ 111 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. మూడోస్థానంలో 104 బిలియన్‌ డాలర్ల సంపాదనతో ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నాండ్‌ అర్నాల్డ్‌, ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ 86 బిలియన్‌ డాలర్ల సంపాదనతో నాలుగో స్థానంలో, 86 బిలియన్‌ డాలర్ల సంపాదనతో ఫేస్‌బుక్‌ సృష్టికర్త మార్క్‌ జుకెన్‌బర్గ్‌ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. 



You may be interested

పాజిటివ్‌గా టెల్కోలు..వొడా-ఐడియా 11% అప్‌

Thursday 28th November 2019

టెలికాం కంపెనీల టారిఫ్‌ల పెంపుపై ప్రభుత్వం జోక్యం చేసుకోదని ప్రభుత్వం అధికారులు గురువారం ప్రకటించారు. ఫలితంగా ఈ పెంపు వచ్చే నెల నుంచి అనివార్యం కానుంది. కాగా ప్రభుత్వం నుంచి ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో గురువారం సెషన్‌లో టెలికాం కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. వొడాఫోన్‌-ఐడియా ఉదయం 11.23 సమయానికి ఏకంగా 11.03 శాతం పెరిగి రూ. 6.55 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 5.90 వద్ద ముగిసిన ఈ

మీ మొబైల్‌ బిల్లు మోత ఖాయం

Thursday 28th November 2019

టెలికాం కంపెనీలు ఫ్లోర్‌ ప్రైస్‌(కంపెనీలన్ని కలిసి నిర్ణయించిన ధర)ను ఏర్పరిచేందుకు టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌), టెలికాం డిపార్ట్‌మెంట్‌ అంగీకరించలేదు. అయినప్పటికి టెలికాం కంపెనీలయిన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా, రిలయన్స్‌ జియో, భారత్‌ సంచార్‌ నిగమ్‌ వచ్చే నెల నుంచి టారిఫ్‌లను పెంచేందుకు సిద్ధపడుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదలుచుకోలేదని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ‘ఫ్లోర్‌ ప్రైస్‌ను ఏర్పరచడంపై ఇంకా ఎటువంటి చర్చ అవసరం లేదు’ అని టెలికాం

Most from this category