News


సంవత్‌ 2076 శుభారంభం

Sunday 27th October 2019
Markets_main1572181919.png-29172

హిందూ సంప్రదాయ ఏడాది 'సంవత్‌ 2076 ను దేశీయ స్టాక్‌ సూచీలు శుభారంభం చేశాయి. దీపావళి రోజు గంటపాటు జరిగే ఈ ప్రత్యేక ముహురత్‌ ట్రేడింగ్‌ సందర్భంగా సెన్సెక్స్‌ 339 పాయింట్ల లాభంతో 39,397.37 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 11,646.15 వద్ద మొదలయ్యాయి. పండుగ సందర్భంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో అన్ని రంగాలకు చెందిన షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. అటోరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు ఎక్కువగా లభిస్తోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం పైగా పెరిగి 29,576.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్యూ2 ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి నమోదుకావడంతో నేడు  టాటామోటర్స్‌ 10శాతం లాభంతో ప్రారంభమైంది. షేరు భారీగా లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన నేపథ్యంలో అప్పర్‌ ఫ్రీజ్‌ చేశారు. 5నిమిషాల అనంతరం ప్రారంభమైన షేర్లు  ఒకదశలో 18శాతం వరకు పెరిగి రూ.150.70ల గరిష్టాన్నితాకాయి.

వేదాంత, ఐషర్‌మోటర్స్‌, ఇన్ఫోసిస్‌, యస్‌ బ్యాంక్‌, టాటా మోటర్స్‌ షేర్లు 1.13శాతం నుంచి 10శాతం లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫ్రాటెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, గ్రాసీం షేర్లు అరశాతం నుంచి 1.50శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

మురిపించిన ముహూరత్‌ ట్రేడింగ్‌..!

Sunday 27th October 2019

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం గంటసేపు పాటు జరిగిన ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్‌‌ మురిపించింది. పండుగ సందర్భంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు లాభాల పంట పండించాయి.  సెన్సెక్స్‌ 192.14 పాయింట్లు పెరిగి 39,250.20 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 11,628.00 వద్ద ముగిశాయి. యస్‌బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 5శాతం నుంచి అరశాతం వరకు పెరగడంతో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 103.60

బ్యాంకింగ్‌ షేర్లలో పెట్టుబడులా ..? అయితే ఇవి కీలకం

Saturday 26th October 2019

బ్యాంకులు ప్రధాన వ్యాపారం రుణాలను ఇవ్వడం, తీసుకోవడం. రుణాలు ఇచ్చే ప్రధాన కార్యకలాపాల కోసం బ్యాంకులు విరివిగా నిధులను అప్పుగా తీసుకుని, ఈ మొత్తాలను తమ వినియోగదారులకు రుణాలుగా ఇస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియా ద్వారా కూడా బ్యాంకులు ఆదాయాలను ఆర్జిస్తాయి. బ్యాంకు షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  నికర వడ్డీ ఆదాయం:- వడ్డీ మార్జిన్ లేదా రుణాలు, పెట్టుబడులు, నిధుల వ్యయం వంటి

Most from this category