News


బజాజ్‌ హోల్డింగ్స్‌ అనుబంధ సంస్థగా ఎంఎస్‌ఎల్‌

Wednesday 19th June 2019
Markets_main1560927658.png-26414

- డబ్ల్యూఎండీసీ వాటాల బదిలీ ముంబై: ఒకప్పటి ప్రియా బ్రాండ్ స్కూటర్స్‌ తయారీ సంస్థ మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ (ఎంఎస్‌ఎల్‌)... తాజాగా బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ (బీహెచ్‌ఐఎల్‌) అనుబంధ సంస్థగా మారింది. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం వెస్టర్న్‌ మహారాష్ట్ర డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (డబ్ల్యూఎండీసీ) సంస్థ ఎంఎస్‌ఎల్‌లో తనకున్న 27 శాతం వాటాను బీహెచ్‌ఐఎల్‌కు బదలాయించడంతో ఇది సాధ్యపడింది. దీంతో ఎ౾ంఎస్‌ఎల్‌లో బీహెచ్‌ఐఎల్‌ వాటాలు 51 శాతానికి చేరాయి. 2003లోనే డబ్ల్యూఎండీసీ తన వాటాలను విక్రయించేందుకు సిద్ధపడినా.. రేటుపై అంగీకారం కుదరక విషయం కోర్టులకు చేరింది. కేసు ఇప్పటిదాకా సాగింది. గతంలో సూచించినట్లుగా రూ. 151.63 కాకుండా షేరు ఒక్కింటికి రూ.232 చొప్పున లెక్కకట్టి 2006 నుంచి 18 శాతం వడ్డీతో సహా డబ్ల్యూఎండీసీకి చెల్లించాలంటూ బీహెచ్‌ఐఎల్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనికి అనుగుణంగా తాజా డీల్ పూర్తయ్యింది. 1975 జూన్‌లో బజాజ్ ఆటో (బీఏఎల్‌), డబ్ల్యూఎండీసీ కలిసి గేర్డ్ స్కూటర్స్ తయారీ కోసం దీన్ని ఏర్పాటు చేశాయి. వినియోగదారులు క్రమంగా మోటార్‌సైకిళ్ల వైపు మళ్లడంతో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2006 ఏప్రిల్‌లో ఎంఎ౾స్‌ఎల్‌లో స్కూటర్స్ తయారీ నిల్చిపోయింది. ప్రస్తుతం ఇది ద్వి, త్రిచక్ర వాహనాల తయారీ రంగానికి అవసరమైన డై కాస్టింగ్‌, ఫిక్సర్స్‌ మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది. 



You may be interested

టాప్‌5లో మూడు ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు

Wednesday 19th June 2019

సెక్టార్‌తో సంబంధం లేకుండా ఉత్తమ ప్రదర్శన నమోదు గత కొంత కాలంగా లిక్విడిటీ సమస్యలతో అధ్వాన్నంగా ఉన్న నాన్‌ బాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) సెక్టార్‌ బుధవారం ఆకర్షించింది. ఆవాస్‌ ఫైనాన్స్‌, మనప్పురం ఫైనాన్స్‌ కంపెనీలు నిఫ్టీ500 సూచీలో మంచి ప్రదర్శన చేసిన మొదట ఐదు కంపెనీలలో ఉండడం గమనార్హం. ఈ రంగంలో సంక్షోభం ఉన్నప్పటికి నాణ్యమైన స్టాక్‌లకు మంచి ఈ రంగంలో అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు మైక్రో

ఎన్‌డీటీవీ ప్రమోటర్ల నిషేధంపై శాట్‌ స్టే

Wednesday 19th June 2019

సెప్టెంబర్‌ 16న తదుపరి విచారణ  న్యూఢిల్లీ: ఎన్‌డీటీవీ ప్రమోటర్లు క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీల్లో పాల్గొనకుండా నిషేధిస్తూ సెబీ ఇచ్చిన ఆదేశాలను శాట్‌ నిలిపేసింది. ఎన్‌డీటీవీ ప్రమోటర్లు- ప్రణయ్‌ రాయ్‌, రాధికా రాయ్‌, హోల్డింగ్‌ సంస్థ ఆర్‌ఆర్‌ఆర్‌ఆర్‌ హోల్డింగ్‌​‍ప్రైవేట్‌ లిమిటెడ్‌లు క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీల్లో రెండేళ్ల పాటు పాల్గొనకూడదంటూ సెబీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఎన్‌డీటీవీ ప్రమోటర్లు సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను (శాట్‌) ఆశ్రయించారు.

Most from this category