News


ఎంఎస్‌సీఐ నుంచి ఈ షేర్ల తొలగింపు?!

Tuesday 5th November 2019
Markets_main1572942355.png-29366

రుణభారం ఎక్కువ ఉన్న కంపెనీలే టార్గెట్‌...
బ్రోకరేజ్‌ల అంచనా
ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌స్టాన్లీ కాపిటల్‌  ఇంటర్నేషనల్‌) సూచీ నుంచి భారీ రుణభారంతో సతమతమవుతున్న దేశీయ కంపెనీల షేర్లను ఈ వారంలో తొలగిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. బాగా అప్పులపాలై ఉన్న వొడాఫోన్‌ ఇండియా, ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా లాంటి షేర్లకు ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌ నుంచి ఉద్వాసన తప్పదని బ్రోకరేజ్‌లు అభిప్రాయపడుతున్నాయి. ఇలా రుణభారంతో సతమతమయ్యే కంపెనీల షేర్లు చాలా వరకు ఇటీవల కాలంలో భారీగా పతనమయ్యాయి. దీంతో వీటి మార్కెట్‌ క్యాప్‌ గణనీయంగా దిగివచ్చింది. ఉదాహరణకు యస్‌బ్యాంకు షేరు ఈ ఏడాది 60 శాతం క్షీణించగా, ఐబీ హౌసింగ్‌ దాదాపు 50 శాతం పతనమైంది. ఇలాంటి పలు కంపెనీల షేర్లలో కొన్నింటిని దేశీయ ఎక్చేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ తన నిఫ్టీ 50 నుంచి తొలగించింది. మరోవైపు తొలగించే కంపెనీల స్థానంలో కొన్ని షేర్లను ఎంఎస్‌సీఐ తన ఇండియా ఇండెక్స్‌లో జత చేయనుంది. వీటిలో ఐసీఐసీఐ ప్రులైఫ్‌, సీమెన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇవి రెండు మంచి ప్రదర్శనే నమోదు చేశాయి. 
ఇండెక్స్‌లో తొలగించే, కలిపే షేర్లపై బ్రోకరేజ్‌ల అంచనాలు...

ఎంఎస్‌సీఐ తన అర్ధవార్షిక రివ్యూను ఈ నెల 7న ప్రకటించనుంది. ఇందులో ప్రకటించే మార్పులు ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తాయని గతంలోనే మోర్గాన్‌స్టాన్లీ వెల్లడించింది. You may be interested

ఆటోమొబైల్‌ షేర్లపై పాజిటివ్‌

Tuesday 5th November 2019

‘టాటా మోటర్స్‌, అశోక్‌ లేలాండ్‌, మారుతి సుజుకీ, ఐషర్‌ మోటర్స్‌ స్టాకులపై బై కాల్‌ ను కలిగివున్నాం. అదేవిధంగా ద్విచక్ర వాహనాలకు సంబంధించి హీరో, బజాజ్‌ ఆటోపై సానుకూలంగా ఉన్నాం’ అని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యురిటీస్‌, డైరక్టర​ సంజయ్‌ భాసిన్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు.  ప్ర: మార్కెట్లు గరిష్ఠ స్థాయిలకు చేరుతున్నాయి, సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఏం జరుగుతుంది? సంజయ్‌ భాసిన్‌: 10,700

లాభాల్లోంచి నష్టాల్లోకి మళ్లిన మార్కెట్‌

Tuesday 5th November 2019

300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 11900 దిగువకు నిఫ్టీ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఫార్మా, ఐటీ షేర్ల అ‍మ్మకాలు మొదలవడంతో మంగళవారం మిడ్‌సెషన్‌ మార్కెట్‌ నష్టాల్లోకి మళ్లింది. దీంతో ఏడు రోజుల లాభాలకు బ్రేక్‌ పడినట్లైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నేడే మార్కెట్‌ పాజిటివ్‌గానే ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో కిత్రం రోజు రికార్డు స్థాయిని నమోదు చేసిన సెన్సెక్స్‌ నేడు మరో 164 పాయింట్లు లాభపడి 40,466.55 వద్ద,

Most from this category