STOCKS

News


ఎంఎస్‌సీఐ సూచీలో కీలక మార్పులు, చేర్పులు

Wednesday 27th November 2019
Markets_main1574844600.png-29900

ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌స్టాన్లీ కాపిటల్‌  ఇంటర్నేషనల్‌) ఇండియా సూచీలో కొత్తగా కొన్ని షేర్లను కలపడం, ఉన్నవాటిలో కొన్నింటిని తీసివేయడం జరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ అసెట్‌మేనేజ్‌మెట్‌ కంపెనీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఇన్ఫో ఎడ్జ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బర్గర్‌ పెయింట్స్‌ ఇండియా, కాల్గేట్‌ పాలిమాలివ్‌, డీఎల్‌ఎఫ్‌, సిమెన్స్‌ షేర్లను ఎమ్‌ఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌లో చేర్చాయి. మరోవైపు గ్లెన్‌మార్క్‌ ఫార్మా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, వోడాఫోన్‌ ఐడియా, యస్‌ బ్యాంక్‌ షేర్లను తొలగించింది. 

ఎంఎస్‌సీఐ ఇండియా డోమెస్టిక్‌ ఇండెక్స్‌లో ఎనిమిదింటి కొత్తగా చేర్చారు. ఉన్నవాటిలో ఐదింటిని తొలగించారు. బెర్గర్‌ పెయింట్స్‌, డీఎల్‌ఎఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, ఇన్ఫీ ఎడ్జ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, సిమెన్స్‌ ఇండియా షేర్లను జతచేశారు. భెల్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌, వోడాఫోన్‌ ఐడియా, యస్‌బ్యాంక్‌ షేర్లు తొలగించిన వాటిలో ఉన్నాయి. 

ఎంఎస్‌సీఐ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లో 13 షేర్లను జతచేశారు. 21 షేర్లకు తొలగించారు. 



You may be interested

టాటా స్టీల్‌పై విశ్లేషకులు బుల్లిష్‌

Wednesday 27th November 2019

యూరప్‌లో వున్న అనుబంధ కంపెనీలను పునరుద్ధరించడంతో పాటు, కంపెనీ ఉత్పత్తిని మెరుగుపరచడం, చౌక స్టీల్‌ దిగుమతులను ఇండియా నిషేదించడం వంటి అంశాల వలన టాటా స్టీల్‌ షేరు భవిష్యత్తులో మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాటా స్టీల్‌ గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సగానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం ఈ షేరు పీఈ(ప్రైస్‌ టూ ఎర్నింగ్స్‌ రేషియో) రేషియో 4.7 వద్ద ట్రేడవుతోంది. ఇది ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ

2వారాల కనిష్టం వద్ద పసిడి

Wednesday 27th November 2019

అమెరికా చైనాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం దిశగా సాగుతున్నాయని ట్రంప్‌ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర బుధవారం రెండువారాల కనిష్టం వద్ద కదలాడుతోంది. నేడు ఆసియాలో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు నష్టపోయి 1,458 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అలాగే ఆసియాలో ప్రధాన మార్కెట్లు పాజిటివ్‌ ట్రేడింగ్‌, నిన్నరాత్రి అమెరికా మార్కెట్ల రికార్డు ముగింపు, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌

Most from this category