News


బడ్జెట్‌ నచ్చకపోతే మార్కెట్లో మహా పతనమే!

Saturday 25th January 2020
Markets_main1579942535.png-31203

నిపుణుల అంచనా
వచ్చే వారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై మార్కెట్‌ వర్గాల్లో చాలా ఆశలున్నాయి. ఈ ఆశలతో నిఫ్టీ 12వేల పాయింట్ల పైన కొనసాగుతూ వస్తోంది. చిన్న, మధ్యతరహా స్టాకుల్లో బడ్జెట్‌ ఆశలతో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. దీంతో నిఫ్టీ ఈ వారం 12400 పైన గరిష్ఠాలను తాకగలిగింది. అయితే అధిక వాల్యూషన్ల కారణంగా పైన నిలదొక్కుకోలేక వెనక్కు వచ్చింది. మరోవైపు ఐఎంఎఫ్‌ తాజాగా భారత వృద్ధి అంచనాలను 4.8 శాతానికి తగ్గించింది. అయితే మార్కెట్‌ ఈ విషయాన్ని పట్టించుకోకుండా స్థిరంగా బడ్జెట్‌ ఆశలతో కదులుతోంది. ఎకానమీలో టర్నెరౌండ్‌ తెచ్చే పలు చర్యలు ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రవేశపెడతారని మార్కెట్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ అంచనాలను ఏమాత్రం బడ్జెట్‌ అందుకోలేకపోయినా సూచీల్లో భారీ పతనం తప్పదని ప్రముఖ అనలిస్టు జిమిత్‌ మోదీ హెచ్చరించారు. సాధారణంగా బడ్జెట్‌ ఎంత బాగున్నా, మార్కెట్లకు ఏదో ఒక రుచించని అంశం కనిపిస్తుందని చెప్పారు. ఈ దఫా కూడా మార్కెట్‌కు పూర్తిగా నచ్చే బడ్జెట్‌ వస్తుందన్న నమ్మకం లేదన్నారు.
ఒకపక్క ఇప్పటివరకు ఫలితాలు ప్రకటించిన కంపెనీలేవీ నష్టాలు చూపకున్నా, టర్నెరౌండ్‌ సంకేతాలు మాత్రం ఇవ్వలేదు. ఆర్థిక మందగమనానికి తగ్గట్లే కంపెనీల ఫలితాలున్నాయి. ఇంతవరకు ఏ కంపెనీ కూడా అత్యంత పాజిటివ్‌ ఫలితాలతో ఆశ్చర్యపరచలేదు. కేవలం లిక్విడిటీ కారణంగానే మార్కెట్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోందని, ఇలాంటి హడావుడి మాయమయ్యేందుకు ఒక్క కారణం చాలని జిమిత్‌ చెప్పారు. కరోనా వైరస్‌ భయాలు కూడా ఇలాంటి మార్కెట్లను పడదోయగలవన్నారు.

యూఎస్‌, చైనా మార్కెట్లు ఇలాంటి స్థితిలో ఉండి ప్రస్తుతం కరోనా భయాలతో పతనమవుతున్నాయని గుర్తు చేశారు. టెక్నికల్స్‌ చూస్తే నిఫ్టీ పైకి చేరినప్పుడల్లా వేగం తగ్గుతోంది. 12050 పాయింట్లు నిఫ్టీకి అత్యంత కీలకమైన స్థాయి. దీన్ని కోల్పోతే తప్పకుండా భారీ పతనం వస్తుందని జిమిత్‌ అంచనా వేశారు. ట్రేడర్లు అప్పటివరకు వీక్లీ కనిష్ఠాలను స్టాప్‌లాస్‌గా ఉంచుకొని అప్రమత్తతతో లాంగ్స్‌ కొనసాగించవచ్చన్నారు. You may be interested

ఇన్‌ఫ్రా, రియల్టీ రంగాలపై బడ్జెట్‌ దృష్టి?!

Saturday 25th January 2020

ద్రవ్యలోటు అదుపు కష్టమే 3.5 శాతంలోపు కట్టడి చేస్తే మార్కెట్లకు జోష్‌ - అనిల్‌ సరీన్‌, సీఈవో, సెంట్రమ్‌ పీఎంఎస్‌ బడ్జెట్‌లో ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రియల్టీ రంగాలపై దృష్టి పెట్టేవీలున్నట్లు చెబుతున్నారు అనిల్‌ సరీన్‌. ఆదాయాలు తగ్గుతున్న నేపథ్యంలో ద్రవ్యలోటు కట్టడి కష్టమేనని, అయితే 3.5 శాతం లక్ష్యాన్ని నిలుపుకుంటే మార్కెట్లకు జోష్‌ లభిస్తుందని సెంట్రమ్‌ పీఎంఎస్‌ విభాగ సీఈవో సరీన్‌ పేర్కొంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఇంకా పలు విషయాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఆధార్‌ లేదా పాన్‌ ఇవ్వకుంటే..టీడీఎస్‌ 20 శాతం -ఐటీ శాఖ

Saturday 25th January 2020

ఇకపై ఉద్యోగులు తప్పనిసరిగా పాన్‌ నెంబర్‌ లేదా ఆధార్‌ను ఆదాయ పన్ను శాఖకు తెలియజేయవలసి ఉంటుంది. లేదంటే వేతనం పొం‍దే సంస్థ వద్ద విధించే పన్ను(టీడీఎస్‌) 20 శాతం చెల్లించవలసి ఉంటుంది.  ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం ఇకపై ఉద్యోగులు పాన్‌ నంబర్‌ లేనిపక్షంలో కనీసం ఆధార్‌ సంఖ్యనైనా వెల్లడించవలసి ఉంటుంది. పాన్‌ నంబర్‌ ఇవ్వని పక్షంలో కంపెనీ(ఎంప్లాయర్‌) లేదా బ్యాంకు పన్నును వసూలు

Most from this category