News


ఇప్పటికీ టీసీఎస్‌ మా టాప్‌ బెట్‌!

Tuesday 16th July 2019
Markets_main1563272722.png-27105

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి అపూర్వ ప్రసాద్‌
టైర్‌ 1 ఐటీ షేర్లలో టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌పై బుల్లిష్‌గా ఉన్నామని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి అపూర్వ ప్రసాద్‌ చెప్పారు. ఇన్ఫీ ఫలితాలు బాగున్నా, ఇప్పటికీ టీసీఎస్‌ తమ టాప్‌ బెట్‌ అని చెప్పారు. మిడ్‌క్యాప్‌ ఐటీ షేర్లలో ఎంఫసిస్‌, హెక్సావేర్‌పై బుల్లిష్‌గా ఉన్నామన్నారు. ఈ రెండు షేర్ల వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయని, వీటి వ్యాపారాల్లో చురుకుదనం పెరిగిందని తెలిపారు.

ఇటీవలి ఫలితాల అనంతరం ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ మధ్య వాల్యూషన్‌ డిస్కౌంట్‌ అంతరం సన్నగిల్లిందని తెలిపారు. అయితే ఇన్ఫీసరాసరి వాల్యూషన్‌ కన్నా టీసీఎస్‌ సరాసరి వాల్యూషన్‌ ఇంకా తక్కువగానే ఉందన్నారు. ఇన్ఫీ విషయంలో జరుగుతున్న మార్జిన్‌ క్షీణత గమనించాలన్నారు. ఏడాది క్రితం రెండిటి మార్జిన్ల మధ్య తేడా 120 బీపీఎస్‌ ఉంటే ఇప్పుడు 350 బీపీఎస్‌కు చేరిందన్నారు. ఇన్ఫీ మార్జిన్లకు డౌన్‌సైడ్‌ రిస్కు ఇంకా ఉందని అభిప్రాయపడ్డారు. బైబ్యాక్‌ అంశంలో కూడా టీసీఎస్‌ వైపే తమ మొగ్గన్నారు. దీంతో పాటు ఫ్రీ క్యాష్‌ కన్వర్షన్‌ తదితర పారామీటర్లలో కూడా టీసీఎస్‌కే ఎక్కువ స్కోరుందన్నారు. అందువల్ల లార్జ్‌క్యాప్స్‌లో ఇంకా టీసీఎస్‌పైనే తాము పాజిటివ్‌గా ఉన్నామని వివరించారు.

త్వరలో ఫలితాలు ప్రకటించనున్న విప్రో టర్నెరౌండ్‌ చూపుతుందన్న నమ్మకం ఇప్పటికైతే లేదని చెప్పారు. 



You may be interested

రెండోరోజూ లాభాల ముగింపే...

Tuesday 16th July 2019

234 పాయింట్లు పెరిగి సెన్సెక్స్‌ రాణించిన ఫార్మా షేర్లు దేశీయ స్టాక్‌ మార్కె్‌ట్‌ వరుసగా రెండో రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 234 పాయింట్లు పెరిగి 39,131 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 11662 వద్ద స్థిరపడ్డాయి. జాతీయ, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నెలకొన్నప్పటికీ.., నేడు మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు ఎక్కువగా లభించింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ అరశాతానికి పైగా

ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం 46 శాతం అప్‌

Tuesday 16th July 2019

జూన్‌ త్రైమాసికానికి ఫెడరల్‌ బ్యాంకు నికరలాభం 46.2 శాతం పెరిగి రూ. 384 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో బ్యాంకురూ. 263 కోట్ల లాభం ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ప్రొవిజన్ల పెరుగుదల తగ్గకున్నా, ఆస్తుల నాణ్యత బలహీనపడినా లాభంలో మాత్రం మెరుగుదల కనిపించింది. ఇతర ఆదాయాల్లో పెరుగుదల, ఆపరేటింగ్‌ ప్రాఫిట్స్‌ కలిసి ఎర్నింగ్స్‌కు ఉత్తేజాన్నిచ్చాయి. సమీక్షాకాలంలో ఎన్‌ఐఐ 17.8 శాతం పెరిగి రూ. 1154 కోట్లకు చేరింది. స్థూల

Most from this category