News


ఎస్‌బీఐ టార్గెట్‌ రూ.350: మోతీలాల్‌ ఓస్వాల్‌

Saturday 19th October 2019
Markets_main1571480424.png-29011

స్థూల వ్యవస్థలో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ ఎస్‌బీఐ షేరు 32శాతం రాబడిని ఇస్తుందని మోతిలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. ఈ బ్రోకరేజ్‌ సంస్థ ఇప్పటికే ఎస్‌బీఐ షేర్లపై బుల్లిష్‌ రేటింగ్‌ను ఇచ్చింది. ‘‘గత మూడు నెలల్లో షేరు 29శాతం వరకు కరెక‌్షన్‌ గురైంది. ఇది అనుకూలమైన రిస్క్-రివార్డ్‌ను తెలియజేస్తుంది. ఆర్థిక సంవత్సరం 2021నాటికి ఆస్తులపై రాబడి (ఆర్‌ఓఏ) 0.7శాతం, ఈక్విటీలపై రాబడి (ఆర్‌ఓఈ) 12.7శాతం మెరుగుపడేందుకు అవకాశాలున్నాయి. కాబట్టి గతంలో తాము ఈ షేరు కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను, షేరు టార్గెట్‌ ధరను రూ.350లుగా  కొనసాగిస్తున్నాము’’ అని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఆస్తుల నాణ్యత, ఎస్‌బీఐలోకి ఇతర బ్యాంకుల విలీనం, ప్రతికూల రేటు వాతావరణానికి సంబంధించిన సమస్యలతో బ్యాంకు లాభాలు గతకొన్ని ఏళ్లుగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు కూడా, అధిక రేటింగ్ డౌన్‌గ్రేడ్‌లతో స్థూల వ్యవస్థలో తీవ్రమైన సవాళ్లను బ్యాంకు ఎదుర్కోంటుంది. అయినప్పటికీ, ఎస్‌బీఐ పరిమాణం దృష్ట్యా, కొత్త ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యం ఉందని మోతిలాల్‌ ఓస్వాల్‌ అభిప్రాయపడింది. ప్రీ-ప్రొవిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్‌ లెవల్‌లో స్థిరమైన ఆపరేటింగ్ పనితీరుతో లాభాల రికవరీకి ఎస్‌బీఐ సిద్ధంగా ఉందని బ్రోకరేజ్ భావిస్తోంది. ఎస్‌బీఐ అనుబంధ సంస్థలైన ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ కార్డులు, ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌ సంస్థలు గత కొన్నేళ్లుగా బలమైన పనితీరును ప్రదర్శించాయి. తన అనుబంధ సం‍స్థల్లో కొన్నింటికి మోనిటైజ్‌ చేయాలని ఎస్‌బీఐ యోచిస్తోంది. ఇది వాటాదారులకు మరింత విలువ అన్‌లాక్ చేయడానికి దోహదపడుతుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ వివరించింది.You may be interested

‘నాణ్యమైన స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చు’

Monday 21st October 2019

మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఉన్న అధిక వ్యాల్యూషన్లు పూర్తిగా ఆవిరైపోయాయని, ప్రస్తుత  స్థాయి నుంచి, వచ్చే రెండు మూడేళ్ల కాలం కోసం మంచి నాణ్యమైన, అధిక వృద్ధి అవకాశాలు కలిగిన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చన్నది తమ అభిప్రాయంగా కోటక్‌ మహీంద్రా ఏఎంసీ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ షిబాని కురియన్‌ పేర్కొన్నారు. మార్కెట్‌కు సంబంధించి వివిధ అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.   ‘‘కార్పొరేట్‌ పన్ను తగ్గింపు అన్నది

క్వాలిటీ స్టాకులు.. కనిపెట్టడమే కష్టం!

Saturday 19th October 2019

రామ్‌దేవ్‌ అగర్వాల్‌ ప్రతిఒక్కరూ మార్కెట్లో నాణ్యమైన స్టాకుల్లో పెట్టుబడులు పెట్టాలని సలహా ఇస్తుంటారు. అయితే నాణ్యమైనవి అనుకున్న చాలా షేర్లు చాలా సందర్భాల్లో ఇన్వెస్టర్ల చేతులు కాల్చిన సంఘటనలున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ ఇన్వెస్టర్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘నాణ్యత అంటే ఎంటో మార్కెట్లో అందరికీ నిర్వచనం తెలిసిపోయింది, కానీ కేవలం నాణ్యమైన స్టాకులను ఎంచుకొని పోర్టుఫోలియో నిర్మించడమే అసలు సవాలు.’’ అని అగర్వాల్‌ వ్యాఖ్యానించారు. చాలా సార్లు

Most from this category