News


మిశ్రమంగా ఐటీ షేర్లు

Friday 12th April 2019
Markets_main1555054180.png-25093

మార్కెట్‌ ముగింపు అనంతరం ఐటీ దిగ్గజకంపెనీలైన టీసీఎస్‌, ఐటీ కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తునున్న నేపథ్యంలో ఐటీ రంగ షేర్లు శుక్రవారం మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 0.10శాతం స్వల్ప నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఇన్ఫీభీమ్‌ 4శాతం పెరిగింది. విప్రో, ఇన్ఫోసిస్‌, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌, ఎన్‌ఐఐటీటెక్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు ఇదే రంగానికి చెందిన హెచ్‌సీఎల్‌ టెక్‌ అధికంగా 1శాతం నష్టపోయింది. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, టాటా ఎలాక్సీ, మైండ్‌ ట్రీ షేర్లు అరశాతం నష్టపోయాయి. మధ్యాహ్నం గం.12:20లకు ఇండెక్స్‌ గత ముగింపు(15,874.75)తో పోలిస్తే 0.05శాతం నష్టంతో 15,867.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ఇదే సమయానికి దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ నిఫ్టీలు కూడా రేంజ్‌ బౌండ్‌ శ్రేణిలో కదలాడుతున్నాయి. సెన్సెక్స్‌ 5 పాయింట్ల లాభంతో 38,612.25 వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు స్వల్ప లాభంతో 11,598 వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

9నెలల గరిష్టానికి పీసీ జ్యువెల్లర్స్‌

Friday 12th April 2019

పీసీ జ్యువెల్లర్స్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 9నెలల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.96.15ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో ఒకే బ్లాక్‌డీల్‌ ద్వారా 17లక్షల ఈక్విటీ షేర్లు చేతులు మారినట్లు ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. ఈ బ్లాక్‌డీల్‌ వివరాలు పూర్తిగా తెలియరాలేదు. అలాగే ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపడం కూడా పీసీ జ్యువెల్లర్స్‌ షేర్లు లాభపడేందుకు తోడ్పాటును అందించాయి. ఫలితంగా

టీసీఎస్‌ ఫలితాలు.. ఏం చూడొచ్చు!

Friday 12th April 2019

శుక్రవారం దేశీయ టాప్‌ ఐటీ కంపెనీ టీసీఎస్‌ క్యు4 ఫలితాలు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఫలితాలపై అనలిస్టుల పాజిటివ్‌గా ఉన్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్‌ రంగాల వృద్ధి, కొత్త సంవత్సరం అంచనాలు, ఐటీ బడ్జెట్‌ ట్రెండ్స్‌, డిజిటల్‌ రంగ వృద్ధి, యూరప్‌ అవుట్‌సోర్సింగ్‌, కొత్త ఆర్డర్లు తదితర అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని చెబుతున్నారు. మార్చిలో కంపెనీ స్టాకు దాదాపు 5.6 శాతం ర్యాలీ జరిపింది. గతేడాది స్టాకు దాదాపు 38

Most from this category