News


దొంగ కంపెనీలు ఎప్పటికీ మారవు: పొరింజు

Monday 7th October 2019
Markets_main1570433517.png-28756

  నమ్మదగిన కంపెనీలలో మాత్రమే ఇన్వెస్ట్‌ చేయాలని, ఇంటెగ్రిటీ ఉన్న కంపెనీలు మాత్రమే నిలకడగా రాణిస్తాయని దలాల్‌స్ట్రీట్‌ సీనియర్‌ ఇన్వెస్టర్‌ పొరింజు వెలియత్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘చాలా వరకు దొంగ కంపెనీలు ఎప్పటికి మారవు! నన్ను నమ్మండి, చేంజ్‌ ఇండియా థీమ్‌లో భాగంగా ఇన్వెస్ట్‌ చేసి నా చేతులు కాల్చుకున్నాను’ అని పొరింజు వెలియత్‌ ట్వీట్‌ చేశారు. ‘హిస్టోరిక్‌ డిటాక్సిఫికేషన్‌ డ్రై’ లో భాగంగా ఈ దొంగ కంపెనీలు నాశనమవుతాయని అన్నారు. అంతేకాకుండా చిన్న కంపెనీ లేదా పెద్ద కంపెనీ ఏదైనా ఇంటిగ్రిటితో ఉన్న కంపెనీలు మాత్రమే నిలబడగలవని, అవి మాత్రమే విజేతలుగా ఎదుగుతాయని అభిప్రాయపడ్డారు. 
  పొరింజు వెలియత్‌కు చెందిన పీఎంఎస్‌ స్కీము ఈక్విటీ ఇంటెలిజెన్స్‌, సెప్టెంబర్‌ నాటికి 2,338 మంది ఇన్వెస్టర్లను కలిగి ఉంది.  ఈ కంపెనీ రూ. 894 కోట్ల ఏయూఎం(అసెట్‌ అండర్‌ మానేజ్‌మెంట్‌)ను నిర్వహిస్తోంది. సెబీ నెలవారీ పోర్టుపోలియో మేనేజర్‌ నివేదిక ప్రకారం..గత నెలలో పొరింజు పీఎంఎస్‌(పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌) 5.60 శాతం రిటర్న్‌లివ్వగా, అగష్టులో 2.69 శాతం పతనమయ్యింది. అదేవిధంగా జులై 13.20 శాతం, జూన్‌లో 6.15 శాతం నష్టపోయింది. కాగా ఈ ఏడాది జనవరి మొదట్లో ఎల్‌ఈఈఎల్‌(లాయిడ్ ఎలక్ట్రిక్‌ అండ్‌ ఇంజనీరింగ్‌)లో ఇన్వెస్ట్‌ చేసి చాలా పెద్ద తప్పు చేశానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. 
  జనవరి 1, 2018 నుంచి ఇప్పటి వరకు, బీఎస్‌ఈలో మొత్తంగా 1,250 స్టాకులు, 50 శాతానికి పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరవ్వడానికి కారణమయ్యాయి. గత 21 నెలలో 126 స్టాకులు 90 శాతంకి పైగా పడిపోవడం గమనార్హం. మొత్తంగా 2,100 స్టాకులు 2018 జనవరి తర్వాత నుంచి పాజిటివ్‌ రిటర్న్‌లను ఇవ్వలేకపోయాయి. కాగా ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 11 శాతం పెరగగా, బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 34 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 23 శాతం పతనమవ్వడం గమనార్హం.



You may be interested

మా ఫలితాలు మార్కెట్‌ అంచనాల్ని మించుతాయ్‌: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎండీ పునిత్ గోయెంకా

Monday 7th October 2019

ప్రమోటర్ల తనఖా షేర్ల విక్రయంతో గతకొంతకాలంగా తీవ్ర అనిశ్చితిని ఎదుర్కోంటున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మరో మూడు నెలల్లో మార్కెట్‌ అంచనాలు తలకిందులు చేస్తూ మెరుగైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో పునిత్ గోయెంకా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలో వ్యాపార అనిశ్చితిని అరికట్టడానికి రాబోయే మూడు నెలల్లో రుణాన్ని తిరిగి చెల్లించాలని జీ  ప్రమోటర్లు కోరుకుంటున్నారని  పునిత్ గోయెంకా అన్నారు. మీడియా సంస్థలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 22శాతానికి సమానమైన

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు

Monday 7th October 2019

లాభాల మార్కెట్లోనూ ప్రభుత్వరంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ 1శాతం నష్టంతో 2156.20 వద్ద ట్రేడ్‌ అవుతోం‍ది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ప్రధాన షేరైన సిండికేట్‌ బ్యాంక్‌ 3.50శాతం నష్టపోయింది. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ 2.50శాతం క్షీణించాయి. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

Most from this category