News


ఎస్‌బీఐ టార్గెట్‌ ధరను 14 శాతం పెంచిన మోర్గాన్‌

Thursday 27th February 2020
Markets_main1582784436.png-32135

ఎస్‌బీఐ అనుబంధ సంస్థలైన మ్యూచువల్‌ ఫండ్‌, లైఫ్‌ ఇన్సురెన్స్‌, కార్డ్స్‌ బిజినెస్‌ మంచి పనితీరు కనబరుస్తుండడంతో ఎస్‌బీఐ టార్గెట్‌ ధరను మోర్గాన్‌ స్టాన్లీ బ్రోకరేజ్‌ సంస్థ 14 శాతం పెంచి రూ.375గా  నిర్ణయించింది. ఆస్తి నాణ్యత, అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని రేటింగ్‌ని నిలిపి ఉంచినట్లు తెలిపింది. ఎస్‌బీఐకు చెందిన ఏఎంసీ, కార్డ్స్‌, లైఫ్‌ఇన్సురెన్స్‌లు విలువ పెంచుకుని లాభాన్ని ఆర్జిస్తాయని మోర్గాన్‌స్టాన్లీ విశ్లేషకులు సుమీత్‌ కరివాల వెల్లడించారు.  అంతేగాక అనుబంధ సంస్థలన్నీ కలిసి ఎస్‌బీఐకి  ప్రస్తుత క్యాపిటల్‌  మార్కెట్‌లో 35 శాతం వాటాను ఇస్తున్నాయన్నారు.కాగా ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ ద్వారా రూ.9,500 కోట్లను సమీకరించనుంది. మార్చి 2వతేదీన ప్రారంభం కానున్న ఈ ఐపీఓ ద్వారా ఎస్‌బీఐకి రూ.2,800 కోట్లు సమకూరనున్నట్లు మోర్గాన్‌ అంచనా వేసింది. కాగా దీనిలో ఎస్‌బీఐకు 3.73 కోట్లు, కార్లే గ్రూపుకు 9.32 కోట్లు వాటా ఉందని సుమీత్‌ తెలిపారు. ఆర్థిక సంవత్సరం 2021లో అంచనావేసిన బుక్‌ విలువ కంటే ఎస్‌బీఐ షేరువిలు0.7 రెట్లు తక్కువ ఖరీదని, ఆస్తుల నాణ్యత తక్కువగా ఉండడంతో రీ రేటింగ్‌కు పరిమిత అవకాశం మాత్రమే ఉందని తెలిపారు. గురువారం 11:15 గంటల ప్రాంతంలో ఎస్‌బీఐ షేరు 1 శాతం తగ్గి 324.45వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
 



You may be interested

భారీ డివిడెండ్ల చెల్లింపునకు కంపెనీలు సిద్ధం!

Thursday 27th February 2020

కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు అమల్లోకి రాకమునుపే కంపెనీలు డివిడెండ్‌ను చెల్లించడానికి హడావిడి చేస్తున్నాయి. ఏప్రిల్ 1 తర్వాత వచ్చే డివిడెండ్లపై ప్రమోటర్లు దాదాపు 43 శాతం పన్ను చెల్లించాల్సి ఉండటం ఇందుకు కారణమైంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి(ఫిబ్రవరి 1) నుంచి ఇప్పటికి వరకు 204 కంపెనీలు డివిడెండ్లను ప్రకటించాయి. మరో 32 కంపెనీలు డివిడెండ్లపై నిర్ణయం తీసుకోనేందుకు రాబోయే మూడు రోజుల్లో బోర్డు సమావేశాలను నిర్వహించనున్నాయి. 2019లో 90కంపెనీలు,

ఇండియా సిమెంట్స్‌లో 12 శాతానికి పెరిగిన దమానీల వాటా

Thursday 27th February 2020

పెరిగిన రాధాకిషన్‌, గోపీకిషన్‌ దమానీ వాటా   దక్షిణాది కంపెనీ ఇండియా సిమెం‍ట్స్‌లో తాజాగా డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల ప్రమోటర్‌ రాధాకిషన్‌ దమానీ కుటుంబ సభ్యులు​వాటాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల ద్వారా ఈ నెల 25, 26లలో రాధాకిషన్‌​దమానీ  కుటుంబ సభ్యులు మొత్తం 2.25 కోట్ల షేర్లను సొంతం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా షేరుకి రూ. 104.16 ధరలో కొనుగోలు చేసిన ఈ వాటా ఇండియా సిమెం‍ట్స్‌

Most from this category