News


రెండు స్టాకులపై మోర్గాన్‌స్టాన్లీ బుల్లిష్‌

Thursday 12th December 2019
Markets_main1576128198.png-30188

గెయిల్‌ ఇండియా, గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్ షేర్లపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు అంతర్జాతీయ బ్రోకరేజ్‌ మోర్గాన్‌స్టాన్లీ వెల్లడించింది. ఈ షేర్లలో 26-67 శాతం అప్‌సైడ్‌ ఉండొచ్చని అంచనా వేసింది. గోద్రేజ్‌ కన్జూమర్‌ షేరుకు రూ. 845 టార్గెట్‌గా నిర్ణయించింది. గెయిల్‌ ఇండియాకు రూ. 188 టార్గెట్‌గా పేర్కొంది. గోద్రేజ్‌ కన్జూమర​ దేశీయ వాల్యూం వృద్ధిలో వేగాన్ని నమోదు చేయగలదని, ఆపరేటింగ్‌ మార్జిన్లలో విస్తరణ చూపుతుందని అంచనా వేసింది. గెయిల్‌ ఇండియా తన ఫైబర్‌ ఆపరేషన్స్‌ నుంచి అధికాదాయాలు పొందుతుందని తెలిపింది. గెయిల్‌ అనుబంధ సంస్థ గెయిల్‌టెల్‌ ఈ ఫైబర్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. దీని ఆదాయ వాటా మాతృ కంపెనీలో చాలా తక్కువ. కానీ ఇకపై ఇది పెరుగుతుందని అంచనా.



You may be interested

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బంపర్‌ లిస్టింగ్‌

Thursday 12th December 2019

గురువారం ఉజ్జీవన్‌ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేర్లు స్టాక్‌ ఎక్చేంజ్‌లో లిస్టయ్యాయి. ఇష్యూధర కన్నా 56.76 శాతం అధిక ప్రీమియంతో బీఎస్‌ఈలో ఈ షేర్లు రూ. 58 వద్ద లిస్టయ్యాయి. షేరు ఇష్యూధర రూ. 37. ఎన్‌ఎస్‌ఈలో షేరు 58.78 శాతం ప్రీమియంతో రూ. 58.75 వద్ద లిస్టయింది. అనంతరం గరిష్ఠంగా రూ. 62.80 వరకు దూసుకుపోయింది. ఐపీఓ ద్వారా బ్యాంకు రూ. 750 కోట్లు సమీకరించింది. గత రెండేళ్లలో వచ్చిన

పసిడికి ఫెడ్‌ మద్దతు

Thursday 12th December 2019

ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర పెరిగింది. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు బలపడి 1,480 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అలాగే అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చల సఫలవంతపై కొనసాగుతున్న అనిశ్చితి, నేడు బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత తదితర అంశాలు పసిడి బలపడేందుకు కారణమవుతున్నాయి. రెండురోజుల పాటు జరిగిన ఫెడ్‌ రిజర్వ్‌

Most from this category