News


హెచ్‌డీఎఫ్‌సీ టార్గెట్‌ ధరను పెంచిన మోర్గాన్‌ స్టాన్లీ

Wednesday 27th November 2019
Markets_main1574833394.png-29895

అం‍తర్జాతీయ బ్రోకరేజి సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌, ఫైనాన్స్‌ కార్పోరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ) షేరుపై ఓవర్‌వెయిట్‌ను కొనసాగించడంతో పాటు, షేరు టార్గెట్‌ ధరను రూ. 2,600 స్థాయి నుంచి రూ. 2,900 స్థాయికి పెంచింది. ఫలితంగా ఈ కంపెనీ షేరు విలువ బుధవారం సెషన్లో 1 శాతానికి పైగా లాభపడి ట్రేడవుతోంది. ‘ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు) సెక్టార్‌లో వ్యవస్తీకృతంగా బలంగా ఉండడంతో, కంపెనీ ఆర్‌ఓఈ(రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ), ఈపీఎస్‌(షేరుపై లాభం) వృద్ధి కొనేళ్ల రికవరి స్థాయిలో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ప్రధాన రుణ వ్యాపారం ఆర్థిక సంవత్సరం 2020-25 ఈపీఎస్‌ సీఏజీఆర్‌ 22 శాతం ఉంటుందని అంచనావేస్తున్నాం. అదే విధంగా కంపెనీ ఆర్‌ఓఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 13 శాతం నుంచి ఆర్థిక సంవత్సరం  22లో 15.5 శాతానికి, ఆర్థిక సంవత్సరం 2025లో 18.5 శాతానికి మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాం. వచ్చే 12 నెలల్లో కంపెనీ రుణ వృద్ధి పుంజుకుంటుందని ఆశిస్తున్నాం. అందువలన హెచ్‌డీఎఫ్‌సీ వాల్యుషన్‌ ఆకర్షిణియంగా ఉంది’ అని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. ఉదయం 11.10 సమయానికి హెచ్‌డీఎఫ్‌సీ షేరు 1.29 శాతం లాభపడి రూ. 2,334.00 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

ఐసీఐసీఐ టార్గెట్‌ రూ.775: మోర్గాన్‌ స్టాన్లీ

Wednesday 27th November 2019

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ ఐసీఐసీఐ బ్యాంక్‌  షేరు టార్గెట్‌ ధరను పెంచింది. ఈ మేరకు బ్రోకరేజ్‌ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో షేరుకు తాము కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అలాగే షేరు టార్గెట్‌ ధరను రూ.665ల నుంచి రూ.775లకు పెంచుతున్నట్లు తెలిపింది. గత మూడేళ్లలో ఈ షేరు ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేసింది. ఈ బ్యాంకులో ఒక సూపర్‌ నార్మల్‌ ప్రాఫిట్‌ సైకిల్‌ తయారుకానుంది.

2020లో మార్కెట్‌ ర్యాలీ పరిమితం!

Wednesday 27th November 2019

రాయిటర్స్‌ పోల్‌లో అంచనాలు దేశీయ మార్కెట్లు వచ్చే ఏడాది కూడా అప్‌మూవ్‌ చూస్తాయని, కాకపోతే పరుగులు చాలా పరిమితంగా ఉంటాయని రాయిటర్స్‌పోల్‌లో పాల్గొన్న ఈక్విటీ నిపుణులు అత్యధికులు అంచనా వేశారు. విత్త ఉద్దీపనలు, ఆర్‌బీఐ సరళీకృత మానిటరీ పాలసీలు దేశ ఆర్థిక మందగమనాన్ని నిరోధించలేకపోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల ఈ ప్రభావంతో ఈక్విటీ జోరు కొంత మేరే ఉంటుందని తెలిపారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం తీసుకునే చర్యలు క్రమానుగత రికవరీకి దోహదం చేస్తాయని,

Most from this category