News


యస్‌ బ్యాంక్‌ షేరు టార్గెట్‌ రూ. 25?

Friday 10th January 2020
Markets_main1578637756.png-30827

యస్‌ బ్యాంక్‌ షేరు రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌
రూ. 15-55 ధరలో నిధుల సమీకరణ?
పెద్ద ప్రయివేట్‌ రంగ బ్యాంకులు భేష్‌
ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌.. వీక్‌!
మోర్గాన్‌ స్టాన్లీ తాజా అంచనాలు 

నిధుల సమీకరణలో ఆలస్యం, రుణ నాణ్యత నీరసించడం వంటి అంశాల కారణంగా యస్‌ బ్యాంక్‌ షేరుని తాజాగా గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసుల దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ డౌన్‌గ్రేడ్‌ చేసింది. షేరుకి రూ. 25 టార్గెట్‌ ధరను ప్రకటించింది. ఈ ఏడాది(2020) సైతం​ ప్రధాన బ్యాంకులే పటిష్ట పనితీరును చూపగలవని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. రుణ నాణ్యతలో సమస్యలు ఎదుర్కొంటున్న మధ్య స్థాయి బ్యాంకులు 2019 తరహాలోనే మొండిబకాయిల ద్వారా సవాళ్లను ఎదుర్కొనున్నట్లు తెలియజేసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకులపట్ల ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను ప్రకటించింది. వెరసి ఐసీఐసీఐ షేరుకి రూ. 775, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రూ. 1700, కొటక్‌ మహీంద్రాకు రూ. 1925, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌కు రూ. 1800 టార్గెట్‌ ధరలను ప్రకటించింది. 

రూ. 15 ధరలో
యస్‌ బ్యాంక్‌ ప్రతిపాదించిన 2 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ అంశంపై నేడు బ్యాంకు బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తోంది. బేస్‌ కేస్‌ ప్రకారం చూస్తే యస్‌ బ్యాంకు షేరుకి రూ. 45 ధరలో నిధుల సమీకరణను చేపట్టే వీలున్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. బుల్‌ కేస్‌ ప్రకారం అయితే రూ. 55 ధరలోనూ.. బేర్‌ కేస్‌లో అయితే రూ. 15 ధరలోనూ ఇందుకు ఆస్కారం ఉన్నట్లు అభిప్రాయపడింది. మొత్తం పోర్ట్‌ఫోలియోలలో 30 శాతం వరకూ మొండి రుణాలకు అవకాశమున్నట్లు అంచనా వేసింది. ఫలితంగా యస్‌ బ్యాంక్‌ వీటిపై 70  శాతం ప్రొవిజనింగ్‌ చేపట్టవలసిరావచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ అంశంపై అంచనాలు ప్రకటించింది. బ్యాంకు బోర్డు నేడు సమావేశంకానున్న నేపథ్యంలో మోర్గాన్‌ స్టాన్లీ తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

అండర్‌వెయిట్‌ రేటింగ్‌
మధ్యతరహా బ్యాంకింగ్‌ విభాగంలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకులకు అండర్‌వెయిట్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ తెలియజేసింది. ఆర్‌బీఎల్‌ బ్యాంకు షేరుకి రూ. 240 టార్గెట్‌ ధరను ప్రకటించగా.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకుకు రూ. 24 లక్ష్యాన్ని అంచనా వేసింది. 



You may be interested

బ్యాంకుల్లో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బెటర్‌

Friday 10th January 2020

మోతీలాల్‌ ఓస్వాల్‌ సిఫార్సులు బడా బ్యాంకులు ఇకపై రికవరీ చెందుతాయని, ప్రాఫిట్స్‌లో బలమైన వృద్ధి నమోదు చేస్తాయని, దీంతో వీటి షేర్ల రీరేటింగ్‌ జరుగుతుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్లడించింది. బడా బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐలపై బుల్లిష్‌గా ఉన్నామని, మిడ్‌సైజ్‌ బ్యాంకుల్లో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంకులపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపింది. 1. ఐసీఐసీఐ బ్యాంకు: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 625. మేలైన వ్యాపార వ్యూహాలు, వైవిధ్యమైన ఉత్పత్తులు, ఏకీకృత

రూ.40 వేలకు దిగువకు బంగారం ధర

Friday 10th January 2020

బంగారం ధర గురువారం మరింత తగ్గింది. దేశీయ బులియన్‌ మార్కెట్లో రూ.40వేల దిగువకు చేరుకుంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 70స్థాయికి బలపడటం, అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గముఖం పట్టడం, ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ తదితర అంశాలు బంగారానికి డిమాండ్‌ను తగ్గించాయి. సోమవారం ఎంసీఎక్స్‌లో 10గ్రాముల బంగారం ధర మునుపటి ముగింపు రూ.39830తో పోలిస్తే రూ.153లు లాభపడి రూ.39677.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బంగారానికి ఇది వరుసగా మూడో రోజూ

Most from this category