News


ఈక్వీటి మార్కెట్ల రేటింగ్‌ను తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ

Monday 8th July 2019
Markets_main1562570281.png-26896

అంతర్జాతీయ ఆర్థిక మందగమనం కారణంగా ప్రపంచ ఈక్వీటి మార్కెట్ల రేటింగ్‌ను ‘ఈక్వల్‌ వెయిట్‌’ నుంచి ‘అండర్‌ వెయిట్‌’కు  మోర్గాన్‌ స్టాన్లీ తన తాజా నివేదికలో తగ్గించింది. అం‍తేకాకుండా ప్రస్తుత స్థాయిల నుంచి పైకి పెరగడానికి ఈ మార్కెట్లకు పరిమితులున్నాయని పేర్కొంది. ఎస్‌ అండ్‌ పీ 500, ఎంసీఐ యూరోప్‌, ఎంఎస్‌సీఐ ఈఎం, టోపిక్స్‌ జపాన్‌ మార్కెట్లు వచ్చే 12 నెలలో మోర్గాన్‌ స్టాన్లీ ధర లక్ష్యాని కన్నా సరాసరి 1 శాతం పెరుగుదలను నమోదు చేయగలవని తెలిపింది.  ‘ వీటి టార్గెట్‌లను, లాభాలపై అంచనాలను ప్రస్తుత వాల్యుషన్ల ఆధారంగా విస్మరించిన, ప్రస్తుత ఆర్థిక డేటా ప్రకారం రాబడి బాగుందా లేక అధ్వాన్నమా వంటి విషయాలను సర్దుబాటు చేసినప్పటికి 3 శాతం మాత్రమే పైకి వెళ్లగలవు’ అని నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థను పరుగు పెట్టించేందుకు ఈ నెల చివరిలో జరగనున్న ఫెడ్‌ సమావేశంలో వడ్డి రేట్ల తగ్గింపు ఉండవచ్చని ఆర్థిక నిపుణలంటున్నారు. దీనితో పాటు యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకులు కూడా పరిమాణత్మక సడలింపులు చేయాడానికి సిధ్దపడుతున్నాయని తెలిపారు. 
      ‘అధ్వాన్నంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు సులభమైన వాణిజ్య విధానాలు తోడయినప్పుడు అధిక లాభాలకు ఎక్కువగా అవకాశం ఉంది. ఈ విషయం గత 30 ఏళ్ల  మార్కెట్ల సరళిని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆర్థిక డేటాను మెరుగుపరుచుకుంటేనే సడలింపులు చక్కగా పనిచేస్తాయి’ అని మోర్గాన్‌ స్టాన్లీ వివరించింది. గత నెలలో మార్కెట్లు ర్యాలీ చేసినప్పటికి అంతర్జాతీయ వాణిజ్యం, పీఎంఐ డేటా అధ్వాన్నంగానే కొనసాగింది. అంతర్జాతీయ ద్రవ్యోల్బణ అంచనాలు, కమోడిటీ ధరలు, దీర్ఘకాల బాండులు వలన వృద్ధి పునరుద్ధరణ జరగగలదని నివేదిక తెలిపింది. మోర్గాన్‌ స్టాన్లీ ఆర్థిక వేత్తులు కూడా ఫెడ్‌, ఈసీబీ తీసుకోనున్న  చర్యల వలన అంతర్జాతీయ వృద్థి అంచనాలను తగ్గించారు. సంపాదనలలో భాగంగా కంపెనీలు పూర్తి ఏడాదికి గాను మార్గదర్శకాలను తగ్గించుకోవడంతో మార్కెట్‌ తక్కువ ధరలలో ట్రేడవ్వచ్చని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. అమెరికా-చైనా దేశాల మధ్య సంధి కుదరడంతో అమెరికా కొత్తగా చైనా ఉత్పత్తులపై విధించవలసిన సుంకాలను నిలిపివేసింది. అయినప్పటకి అంతర్జాతీయ పీఎంఐలు పడిపోయాయి. ఈక్విటీ ఇన్వెస్టర్లు తమ కం‍పనీల గురించి ఏవిధం‍గా ఆలోచిస్తున్నారో అంచనావేసే మోర్గాన్‌ స్టాన్లీ వ్యాపార పరిస్థితుల నివేదిక కూడా జూన్‌లో పడిపోయింది. ‘ఈ పరిణామాలు ఈక్విటీ మార్కెట్లకు ప్రమాదమే. జులై చివరి నుంచి లిక్విడిటీ, సరాసరి లాభాలు తగ్గనున్నాయి. సెంట్రల్‌ బ్యాంకుల సడలింపులపై అధికంగా అంచనాలు పెట్టుకోవడంతో పాటు, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల అనిశ్చితి కూడా లిక్విడిటీ సమస్యను పెద్దది చేసే ప్రమాదం ఉంది’ అని నివేదికలో పేర్కొంది. You may be interested

మైండ్‌ ట్రీ షేర్లకు రాజీనామా మంట

Monday 8th July 2019

12శాతం పతనమైన షేర్లు నిర్వాహణ విభాగం నుంచి ముగ్గురు కీలక అధికారులు రాజీనామాలు సమర్పించడంతో ఐటీ సేవల సంస్థ మైండ్‌ ట్రీ షేర్లు సోమవారం 12శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.861.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మైండ్‌ ట్రీ కంపెనీలో ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్ణయాత్మక వాటాను దక్కించుకున్న అనంతరం ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవికి కృష్ణకుమారన్‌ నటరాజన్‌, వైస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవికి ఎన్‌ఎస్‌ పార్థసారథి, సీఎఫ్‌ఓ

రికవరి బాటలో యస్‌ బ్యాంకు షేర్లు

Monday 8th July 2019

ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్‌ యస్‌ బ్యాంకు షేర్లు సోమవారం 5ఏళ్ల కనిష్టస్థాయి నుంచి రికవరీ అయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.87.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ పతనంలో భాగంగా ఆరంభంలోనే 3శాతం నష్టపోయి రూ.85.70ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఈ ధర షేరుకు 5ఏళ్ల కనిష్టస్థాయి కావడం గమనార్హం. స్థిరమైన పాలన వ్యవస్థతో పాటు ఇద్దరు మేనేజ్‌మెంట్‌ అధికారుల నియామకం గురించి బ్యాంకు అధికారులు

Most from this category