News


మూడోసారి సెన్సెక్స్‌ టార్గెట్‌ను తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ

Wednesday 25th March 2020
Markets_main1585129815.png-32674

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ సెన్సెక్స్‌ టార్గెట్‌ను వరుసగా మూడోసారి తగ్గించింది. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తితో కారణంగా ఈ ఏడాది సెన్సెక్స్‌ టార్గెట్‌ను 32000గా నిర్ణయించింది. గతంలో ఇదే బ్రోకరేజ్‌ సంస్థ సెన్సెక్స్‌కు టార్గెట్‌ 36000గా కేటాయించిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం 2021లో సెన్సెక్స్‌ ఈపీస్‌ వృద్ధి అంచనాల ప్రకారం కేటాయించిన టార్గెట్‌ 10శాతం పరిధిలో ఉండొచ్చు. ఈ టార్గెట్‌ ధర ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 20శాతం అప్‌ట్రెండ్‌ను, బేర్‌ కేస్‌లో 6శాతం డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తుంది. 

మార్కెట్‌ విస్తృతస్థాయి కరెక‌్షన్‌ కారణంగా నాణ్యమైన షేర్లు తక్కువ ధరల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అలాగే ఆకర్షణీయమైన వాల్యూయేషన్లను కలిగి ఉండటంతో షేర్ల కొనుగోళ్లకు ఇది చక్కటి అవకాశమని మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బ్రోకరేజ్‌ సంస్థ 20 షేర్లను సిఫార్సు చేస్తుంది. భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ అటో, మారుతి సుజుకీ, మదర్‌ సుమీ, టైటాన్‌ కంపెనీ, గోద్రేజ్‌ కన్జూ‍్యమర్‌, ఐటీసీ షేర్లు సిఫార్సు చేసిన జాబితాలో ఉన్నాయి.

భారత మార్కెట్‌ గరిష్టస్థాయి నుంచి 40శాతం పతనమైంది. ఖచ్చితత్వంతో సంపూర్ణ బాటమ్‌కు ఇంకా దూరంగా ఉండవచ్చు. అయితే కొలమానాలకు మాత్రమే దగ్గరగా ఉంది. ఈ బేర్‌ మార్కెట్‌ కేవలం 2నెలలు మాత్రమే. అయితే బేర్‌మార్కెట్స్‌ సాదారణంగా కనీసం 6నెలలు ఉంటుంది. క్షీణత వేగాన్ని బట్టి, ఇది గత సగటు వ్యవధిని అనుసరించకపోవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 

మోర్గాన్‌ స్టాన్లీ టాప్‌-20 రికమెండేషన్లు
1. భారతీ ఎయిర్‌టెల్‌
2. బజాజ్‌ అటో
3. మారుతి సుజుకీ
4. మదర్‌సన్‌ సుమీ
5. టైటాన్‌
6. గోద్రేజ్‌ కన్జూ‍్యమర్‌
7. ఐటీసీ
8. బీపీసీఎల్‌
9. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
10. జజాజ్‌ ఫైనాన్స్‌
11. డీఎల్‌ఎఫ్‌
12. హెచ్‌డీఎఫ్‌సీ 
13. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
14. ఐసీఐసీఐ బ్యాంక్‌
15. ఐసీఐసీఐ ప్రూ లైఫ్‌
16. ఎంసీఎక్స్‌
17. శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్స్‌ ఫైనాన్స్‌
18. ఇండిగో
19. ఎల్‌అండ్‌టీ
20. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ You may be interested

కరోనా ఎఫెక్ట్‌: ఫ్లిప్‌కార్ట్‌ సేవలు నిరవధిక వాయిదా

Wednesday 25th March 2020

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన సేవల్ని నిరవధికంగా వాయిదా వేసింది. కరోనా వ్యాధి నివారణ చర్యలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా మంగళవారం అర్థరాత్రి నుంచి మరో 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఈయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ తమ కార్యాకలాపాలతో పాటు మంగళవారం రాత్రి నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్లను స్వీకరించడం కూడా నిలిపివేసింది. ఏప్రిల్‌2 వరకు

ఏడాది కనిష్టానికి 548 షేర్లు

Wednesday 25th March 2020

బుధవారం ఎన్‌ఎస్‌ఈలో 548 షేర్లు 52 వారాలకనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో 21 ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్, 3ఐ ఇన్ఫోటెక్, 3 ఎం ఇండియా, 63 మూన్స్‌ టెక్నాలజీస్, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్, ఆవాస్‌ ఫైనాన్సియర్స్, అబాన్‌ ఆఫ్‌షోర్స్, ఏబీబీ ఇండియా, ఏసీసీ, అదానీ గ్యాస్, ఆధునిక్‌ ఇండస్ట్రీస్, అడోర్‌ వెల్డింగ్, అద్వాని హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా, ఏజీస్‌ లాజిస్టిక్స్, అగ్రీటెక్‌ ఇండియా,ఆగ్రోఫోస్‌ ఇండియా,మొనెట్‌ఇస్పాట్‌ అండ్‌ ఎనర్జి, అశోక్‌

Most from this category