News


మూడు స్టాకులపై మోర్గాన్‌స్టాన్లీ బుల్లిష్‌

Tuesday 17th December 2019
Markets_main1576575590.png-30274

టెక్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు ప్రముఖ బ్రోకరేజ్‌ మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. వచ్చే ఏడాదిలో ఈ స్టాకులు దాదాపు 20 శాతం వరకు రాబడినిస్తాయని అంచనా వేసింది. 
- టెక్‌ మహీంద్రా: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 850. కమ్యూనికేషన్‌ వ్యాపారం విభాగంలో కొత్త డీల్స్‌లో మెరుగుదల కనిపిస్తుంది. వచ్చే ఏడాది రెవెన్యూ గ్రోత్‌ 8-10 శాతం ఉండొచ్చు. మార్జిన్ల మెరుగుదలతో ఎర్నింగ్స్‌ గ్రోత్‌ మరికొంత ఎక్కువైనా ఉండొచ్చు. ప్రస్తుత స్థాయిల వద్ద వాల్యూషన్లపరంగా చౌకగా ఉంది. 
- కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1900. వచ్చే నెల రోజులు బ్యాంకింగ్‌ సూచీకి అనుగుణంగా కదలికలుంటాయి. ఎఫ్‌పీఐ పరిమితి పెంచుకునే అనుమతి లభించినందున త్వరలో ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌లో చోటు దక్కించుకోవచ్చు. త్వరలో ఈ సూచీలో ఇండియా వెయిటేజ్‌ పెరగనుంది, ఆ తరుణంలో మరిన్ని విదేశీ నిధులు సూచీలోని దేశీయ స్టాక్‌ కౌంటర్లలోకి వస్తాయి.
- ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1800. బ్యాంకుకు బలమైన మూలధన సంపద ఉంది. డిపాజిట్లపై ఎక్కువ ఫోకస్‌ పెడుతోంది. భవిష్యత్‌లో పీఓపీ మరింత పెరగవచ్చు, ఆర్‌ఓఈ 17.5 శాతానికి పెరగవచ్చు. స్వల్పకాలానికి కార్పొరేట్‌ ఎన్‌పీఏలకు అనుగుణంగా కదలికలుంటాయి. 



You may be interested

కొత్త శిఖరాలపై ముగిసిన సూచీలు

Tuesday 17th December 2019

ఇంట్రాడే, ముగింపులోనూ రికార్డులే... కలిసొచ్చిన జాతీయ, అంతర్జాతీయ అంశాలు  మెటల్‌, ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు  జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం భారీ లాభాలను కూడగట్టుకుంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి  మెటల్‌, ఐటీ, బ్యాంకింగ్‌, అటో రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఫలితంగా ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలతో పాటు బ్యాంక్‌ సైతం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 463 పాయింట్లు పెరిగి

లాభాల్లో మెటల్‌ షేర్లు

Tuesday 17th December 2019

మార్కెట్‌ రికార్డు ర్యాలీలో మంగళవారం భాగంగా మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి. ఫలితంగా మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 3.50శాతం ర్యాలీ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు 2,603.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రేపు జరిగే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో మెటల్‌ ఉత్పత్తులను సుంకాలను సవరించవచ్చని అంచనాలతో నేడు మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.77శాతం పెరిగి 2,662.50

Most from this category