News


నిఫ్టీ-50లో సగానికి పైగా చౌకగానే..!

Tuesday 26th November 2019
Markets_main1574707603.png-29844

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ తన చరిత్రలోనే నూతన గరిష్టాల వద్ద సోమవారం ముగిసింది. నిఫ్టీ కూడా నూతన గరిష్టాలకు దగ్గర్లోనే ఉంది. కానీ, తరచి చూస్తే నిఫ్టీ-50 సూచీలోని 50 కంపెనీల్లో సగానికి పైనే స్టాక్స్‌ తక్కువ వ్యాల్యూషన్ల వద్దే ట్రేడవుతున్నాయి. అంటే కొన్ని స్టాక్స్‌లోనే ర్యాలీ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలన్న సంశయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కాకపోయినా, ఆర్థిక రంగం రికవరీ సంకేతాలు వెలువడిన తర్వాత అయినా మిగిలిన స్టాక్స్‌లో ర్యాలీని చూడొచ్చు. కాకపోతే మనం చేయాల్సిందల్లా వ్యాల్యూషన్ల పరంగా ఆకర్షణీయంగా లభిస్తున్న వాటిల్లో నుంచి ఆణిముత్యాలను ఎంచుకోవడం ద్వారా మధ్య కాలానికి మంచి రాబడులు అందుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

కంపెనీల అంతర్గత విలువ కంటే తక్కువకు ట్రేడ్‌ అవుతున్న స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం మంచి లాభదాయకమన్నది ఈక్విటీ మార్కెట్లకు అనుసరించతగిన బంగారం లాంటి సూత్రం. అయితే, ఇలా తక్కువలో ట్రేడ్‌ అవుతున్న వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయాలా..? లేక మార్కెట్లను ముందుకు తీసుకెళుతున్న విజేతల్లాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలా..? అన్న సందేహం ఎదురు కావచ్చు. పైగా పదేళ్ల సగటు పీఈ కంటే తక్కువకు లభిస్తున్న అన్ని స్టాక్స్‌ కూడా వ్యాల్యూ బై కావన్నది నిపుణుల మాట. అధిక వ్యాల్యూషన్లలో ఉన్న వాటిల్లోకే పెట్టుబడులు అధికంగా వెళుతుండడం, భవిష్యత్తులో వాటి వృద్ది అవకాశాలను చూసేనంటున్నారు విశ్లేషకులు. 

 

నిఫ్టీ-50లో సగానికి పైగా స్టాక్స్‌ 10 ఏళ్ల సగటు పీఈ కంటే తక్కువకు ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ స్టాక్స్‌లో సిప్లా (28 శాతం తక్కువ), డాక్టర్‌ రెడ్డీస్‌ (13శాతం), సన్‌ఫార్మా (27 శాతం), జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (55శాతం), హిందాల్కో (11 శాతం), జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ (33శాతం), టాటా స్టీల్‌ (63 శాతం), గెయిల్‌ (39 శాతం), ఐవోసీ (10 శాతం), ఓఎన్‌జీసీ (52 శాతం), ఇన్ఫోసిస్‌ (5శాతం), భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ (55శాతం), కోల్‌ ఇండియా (46 శాతం), ఎన్‌టీపీసీ (40 శాతం), పవర్‌గ్రిడ్‌ (26 శాతం) ఉన్నట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ డేటా ఆధారంగా తెలుస్తోంది. వీటిల్లో చాలా కంపెనీలు ఆయా రంగాల్లో మందగమనం కారణంగా తక్కువకు ట్రేడ్‌ అవుతున్నాయని, రికవరీకి కొంత సమయం పడుతుందన్నది విశ్లేషకుల అంచనా. ప్రీమియం వ్యాల్యూషన్లు ఉన్న వాటిల్లో పెట్టుబడులను కొంత మేర కొనసాగిస్తూ, అదే సమయంలో తక్కువ విలువ వద్ద లభిస్తున్న వాటిల్లోకి కొన్ని పెట్టుబడులు మళ్లించుకోవడం మంచి ఆలోచనగా ట్రేడింగ్‌బెల్స్‌ సీఈవో అమిత్‌ గుప్తా సూచించారు. బేర్‌ మార్కెట్లో, అనిశ్చిత మార్కెట్లలో సంపద తుడిచిపెట్టుకుపోయే అవకాశం లేని వాటిని పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నట్టు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. 
 



You may be interested

ఫండ్స్‌లో వేటిల్లోకి అధిక పెట్టుబడులు?

Tuesday 26th November 2019

పనితీరే గీటురాయి.. మ్యూచువల్‌ ఫండ్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. పథకాల రాబడుల పనితీరును ఇన్వెస్టర్లు పరిశీలించి, సంతృప్తి చెందిన తర్వాతే ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. గతంలో అయితే ఏజెంట్లు, బ్రోకర్లు చెప్పిన వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసే వారు. యాక్టివ్‌ నిర్వహణతో కూడిన ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకాల్లోకి వస్తున్న పెట్టుబడుల ప్రవాహాన్ని పరిశీలించినట్టయితే.. నిలకడైన రాబడుల చరిత్ర ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు.    39 అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు

దివాలా చట్టం పరిధిలోకి ఎన్‌బీఎఫ్‌సీలు.... బ్యాంకులకు మంచిదే: మూడీస్‌

Monday 25th November 2019

డీఫాల్ట్‌ను ఎదుర్కొంటున్న ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీలు)లను దివాలా చట్టం పరిధిలోకి తీసుకురావడం బ్యాంకులపై పాజిటివ్‌ ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ మూడిస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ ఓ నివేదికలో పేర్కొంది. దివాలా చట్టంలోని సెక్షన్‌ 227తో, రూ. 500 కోట్ల ఆస్తి విలువ కలిగిన ఒత్తిడిలోని ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీ(హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు)లను దివాలా కోర్టుకు సిఫార్సు చేసే అధికారాన్ని ప్రభుత్వం తాజాగా ఆర్‌బీఐకి ఇచ్చింది. దీని ఆధారంగా ఒత్తిడిలోని

Most from this category