STOCKS

News


ఈ స్టాక్స్‌ 50 శాతం చౌక...!

Friday 6th September 2019
Markets_main1567793898.png-28245

నిఫ్టీ ఈ ఏడాది జూన్‌ 3న నమోదు చేసిన 12,103 రికార్డు స్థాయి నుంచి 10 శాతం వరకు పడిపోయింది. కానీ, నిఫ్టీ 500 సూచీలోని 20 స్టాక్స్‌ మాత్రం 50 శాతం అంతకంటే ఎక్కువే వాటి గరిష్ట స్థాయిల నుంచి పడిపోయి చౌక ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి. మరి వీటిని కొనుగోలు చేసుకోవచ్చా..? అంటే నిపుణుల అభిప్రాయలను పరిశీలిద్దాం...

 

కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, సింటెక్స్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండియాబుల్స్‌ ఇంటెగ్రేటెడ్‌ సర్వీసెస్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌, యస్‌ బ్యాంకు, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పీసీ జ్యుయలర్‌, శ్రేయి ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌, జైప్రకాష్‌ అసోసియేట్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, ఐనాక్స్‌ విండ్‌, రిలయన్స్‌ పవర్‌, మ్యాగ్మా ఫిన్‌కార్ప్‌, ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌ ఇవన్నీ 51 శాతం నుంచి 95 శాతం మధ్య వాటి గరిష్ట స్థాయిల నుంచి తగ్గినవే. అయితే, ఇలా పడిపోవడానికి కారణాలు ఒక్కో కంపెనీకి సంబంధించి ఒక్కో విధంగా ఉన్నాయి. కొన్నింటి విషయంలో ఫండమెంటల్స్‌ దెబ్బతింటే, కొన్ని రుణాలు చెల్లించలేక చతికిల పడడం, నిధుల దారి మళ్లింపు ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. 

 

‘‘పడిపోయే కత్తిని పట్టుకోవచ్చు. కానీ, ఆ కత్తికి ఒకవైపు పదును లేదని మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి. రెండు వైపులా పదునుంటే గాయం చేస్తుంది. ఒకవైపే పదునుగా ఉంటే అప్పుడు మీకున్న అనుభవంతో దాన్ని సౌకర్యంగా పట్టుకోవచ్చు. మార్కెట్‌ను జాగ్రత్తగా అనుసరిస్తూ విలువ, వృద్ధి అవకాశాలు ఉన్నవాటిని ఎంపిక చేసుకోవాలి. మార్కెట్లు పడిపోయే సమయాల్లో ఏ రోజుకా రోజు స్టాక్‌ చౌకగా మారిపోవచ్చు. కానీ, ఇలా పడిపోయే ప్రతీ స్టాక్‌ ఒకే విధంగా విలువ పరంగా ఆకర్షణీయమైనవి కాదని తెలుసుకోవాలి’’ అని ఎమ్కే వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ జోసెఫ్‌ థామస్‌ అన్నారు. 

 

ఆర్థిక రంగ మందగమనం, అంతర్జాతీయంగా చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం వంటి పరిణామాలతో విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల అమ్మకాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఆర్థిక రంగం కుదుపడిన వెంటనే లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ ముందుగా ర్యాలీ చేస్తాయి. ఆ తర్వాత మిడ్‌, స్మాల్‌క్యాప్‌ వాటిని అనుసరిస్తాయి’’ అని ఎస్‌ఎస్‌జే ఫైనాన్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌కు చెందిన ఆతిష్‌ మత్లవాలా అన్నారు. ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన రంగాల కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయన్నారు. ‘‘ఎఫ్‌ఎంసీజీ, ఆటో, పీఎస్‌యూ బ్యాంకులు, ఇన్‌ఫ్రా కంపెనీలు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన చర్యలు, ఆర్‌బీఐ మిగులు నిధుల బదిలీతో లబ్ధి పొందుతాయి’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా అన్నారు. మిడ్‌, స్మాల్‌ ‍క్యాప్‌ కంపెనీలు కూడా లార్జ్‌క్యాప్‌తో పాటు ర్యాలీలో పాల్గొంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 

 

మన దేశ జీడీపీ జూన్‌ క్వార్టర్‌లో 5 శాతానికి పడిపోయింది. అయితే, కేవలం మన దగ్గర మాత్రమే కాదని, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లోనూ మందగమనం ఉందని, దీంతో భారత మార్కెట్‌ పెట్టుబడులకు ప్రాధాన్య దేశంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘ఇది చక్రీయ మందగమనే. స్థిరమైన ప్రభుత్వం, ఇటీవల ప్రకటించిన ప్రోత్సాహక చర్యలు, మిగులు నిధులు, ఎన్‌పీఏ, ఎన్‌బీఎఫ్‌సీ సమస్యల నుంచి క్రమంగా బయటకు వస్తుండడం... ఈ స్థాయి నుంచి మార్కెట్లు మంచి రాబడులను ఇవ్వగలవు’’ అని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో అరుణ్‌ తుక్రాల్‌ తెలిపారు.You may be interested

ఎగుమతులకు త్వరలోనే వరాలు

Saturday 7th September 2019

జెమ్స్‌, జ్యుయలరీకి సైతం ప్రభుత్వం ప్రకటించే అవకాశం న్యూఢిల్లీ: ఎగుమతులు పెంచుకునే దిశగా ప్రభుత్వం అతి త్వరలోనే పలు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశం నుంచి ఎగుమతులు స్తబ్దుగా ఉండడాన్ని చూస్తూనే ఉన్నాం. దీంతో ప్రోత్సాహక చర్యలపై కేంద్ర ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖల అధికారులు ఇప్పటికే పలు సార్లు భేటీ అయి చర్చలు కూడా నిర్వహించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) నుంచి పనిచేస్తున్న యూనిట్లకు పన్ను

30 శాతం పెరిగిన వీఐఎక్స్‌

Friday 6th September 2019

బడ్జెట్‌నాటి నుంచి చూస్తే వోలటాలిటీ ఇండెక్స్‌ అయిన ఇండియా వీఐఎక్స్‌ సూచీ 30 శాతానికి పైగా పెరిగింది. అంటే సమీప కాలంలో వొలటాలిటీ (అస్థిరతలు/ఆటుపోట్లు) ఉంటుందని మార్కెట్లు అంచనా వేస్తున్నట్టు సూచీ పెరుగుదల తెలియజేస్తోంది. ఇండియా వీఐఎక్స్‌ జూలై 5న (కేంద్ర బడ్జెట్‌ రోజు) 13.06గా ఉంటే, ఈ నెల 5 నాటికి అది 17.27 స్థాయికి పెరిగిపోయింది. రెండు నెలల్లోనే 32 శాతం పెరిగింది. కానీ, ఇదే కాలంలో

Most from this category