News


నెలలో భారీగా నష్టపోయిన షేర్లు

Tuesday 15th October 2019
Markets_main1571079204.png-28877

కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ ఈక్విటీ మార్కెట్లు భారీ ర్యాలీ చేశాయి. మార్కెట్లో సెంటిమెంట్‌ కూడా కుదుటపడింది. కానీ, గత నెల 20 నుంచి చూస్తే బీఎస్‌ఈ 500 సూచీలోని 121 ‍స్టాక్స్‌ నెల రోజుల్లోనే ఏకంగా 10 శాతం నుంచి 50 శాతం మధ్య నష్టపోయాయి. బాగా పడిపోయి, చౌక ధరల్లో ఉన్న వీటిల్లో పెట్టుబడులు పెట్టడం మంచిదేనా..? నిపుణుల అభిప్రాయాలు విందాం.  

 

సెప్టెంబర్‌ 20 నుంచి నష్టపోయిన స్టాక్స్‌ను చూస్తే.. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 55 శాతం వరకు పడిపోయింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 46 శాతం, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ 44 శాతం, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 42 శాతం, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 36 శాతం, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 36శాతం, కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ 35శాతం, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ 35శాతం, లక్ష్మీ విలాస్‌ బ్యాంకు 35 శాతం, ఐటీడీ సిమెంటేషన్‌ 33 శాతం, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ 30 శాతం, ఇండియన్‌ బ్యాంకు 27 శాతం, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా 27 శాతం, శ్రేయిఇన్‌ఫ్రా 26 శాతం, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 26 శాతం, యస్‌ బ్యాంకు 26 శాతం, సన్‌ఫార్మా అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ 25 శాతం, శంకర బిల్డింగ్‌ 25 శాతం, హెచ్‌ఈజీ 25 శాతం, అరబిందో ఫార్మా 25 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంకు 25 శాతం చొప్పున నష్టపోయాయి. నిజానికి 52 వారాల గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఈ స్టాక్స్‌ అన్నీ కూడా 44 శాతం నుంచి 94 శాతం వరకు నష్టపోవడం గమనార్హం. 

 

అయితే, ఇలా భారీగా పడిపోయిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ముందు కంపెనీల ఫండమెంటల్స్‌ను అధ్యయనం చేయాలని, స్టాక్స్‌ పడిపోవడం వెనుక ఫండమెంటల్‌ కారణాలు ఏవైనా ఉన్నాయోమో చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల గణనీయంగా పడిపోయిన స్టాక్స్‌ మూమెంటమ్‌ ట్రేడర్స్‌కు మంచి అవకాశం అవుతాయేమో కానీ, రిటైల్‌ ఇన్వెస్టర్లకు మాత్రం సూచనీయం కాదన్నారు క్యాపిటల్‌ ఎయిమ్‌ రీసెర్చ్‌ హెడ్‌ రొమేష్‌ తివారీ. మంచి విలువ, వృద్ధి అవకాశాలను ఆఫర్‌ చేసే స్టాక్స్‌నే ఇన్వెస్టర్లు పరిశీలించాలని సూచించారు. క్రమానుగత అధ్యయనం, ఓపిక, ఆర్థిక క్రమశిక్షణ అవసరమన్నారు. ప్రమోటర్లు, కంపెనీలో అంతర్గత చర్యలను (ప్రమోటర్లు షేర్లను కొనడం, విక్రయం, తనఖా) జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా భవిష్యత్తు కార్యాచరణపై ఏం చేయాలన్నది తెలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘కొన్ని మంచి కంపెనీలు ఆకర్షణీయమైన విలువల వద్ద లభిస్తున్నాయి. వీటిల్లో భద్రత పాళ్లు ఎక్కువ. మరోవైపు ఆర్థిక మూలాలు దెబ్బతింటున్న, అధిక రుణ భారం, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్యల్లో ఉన్న కంపెనీల నుంచి ఇన్వెస్టర్లు బయటకు రావడం మంచిది’’ రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా సూచించారు. You may be interested

మూడు, ఐదేళ్లలో స్మాల్‌క్యాప్‌ అద్భుత రాబడులు!

Tuesday 15th October 2019

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన కొన్ని పెద్ద కంపెనీల్లో నే ఇన్వెస్ట్‌ చేస్తుండడం భద్రత కోసం తప్పిస్తే రాబడుల కోసం కాదన్నారు కేర్‌ పీఎంఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ అమిత్‌దోషి. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.    మీ ట్రేడింగ్‌ వ్యూహం..? ఇన్వెస్ట్‌ చేయడమే మా వ్యూహం. దీన్నే పాటిస్తాం. ఈక్విటీ మార్కెట్ల చరిత్రను చూసినట్టయితే... మంచి వ్యాపారాలు ఈక్విటీ మార్కెట్ల కరెక్షన్‌

పసిడి పరుగులు కొనసాగేనా?!

Monday 14th October 2019

ట్రేడ్‌వార్‌ ముగింపుతో బుల్స్‌కు పగ్గాలు దీర్ఘకాలానికి పాజిటివ్‌ అంటున్న నిపుణులు అంతర్జాతీయ మందగమనం, ట్రేడ్‌వార్‌ భయాలతో ఇటీవల కాలంలో బంగారం అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో మంచి ర్యాలీ చేసింది. ఒక దశలో పసిడి అంతర్జాతీయ మార్కెట్లో 1600 డాలర్లకు చేరవచ్చని నిపుణులు అంచనాలు వేశారు. అయితే ఇటీవల కాలంలో పసిడి ధర 1500 డాలర్ల జోన్‌లో కన్సాలిడేట్‌ అవుతోంది. ట్రేడ్‌వార్‌పై చైనా, యూఎస్‌ మధ్య ఆశావహ వాతావరణం ఏర్పడుతుండడంతో ఇకపై ఈక్విటీల జోరు

Most from this category