News


మార్కెట్ల గమనం ఎటు..?

Monday 11th November 2019
Markets_main1573412726.png-29481

స్టాక్‌ మార్కెట్ల బుల్‌ ర్యాలీలో పాల్గొనకుండా వేచి చూసేందుకు ఇన్వెస్టర్లు ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఇన్వెస్టర్ల క్రమంగా కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్టు మార్కెట్‌ వ్యాప్తంగా పెరుగుదల తెలియజేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లలో ర్యాలీయే నడుస్తోంది. కాకపోతే నూతన గరిష్టాల వద్ద మార్కెట్లు తడబడుతున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినా లేక ఆర్థిక సంస్కరణల్లో ఏవైనా కేంద్రం అమ్ముల పొది నుంచి తీసినా చాలా పెద్ద సానుకూలమే అవుతుందని అనలిస్టుల విశ్లేషణ. కానీ, ఉన్నట్టుండి మూడిస్‌ మన రేటింగ్‌ తగ్గించడం గత శుక్రవారం మార్కెట్‌ నష్టాలకు కారణమైంది. అయితే, మూడిస్‌ ఎర్రజెండా ఊపడం చాలా ఆలస్యమైనట్టు అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇన్వెస్టర్లు, విశ్లేషకుల ట్వీట్లను గమనిస్తే.. 

 

మూడిస్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ను ఆస్క్‌సభర్వాల్‌ అధినేత సందీప్‌ సభర్వాల్‌ హాస్యాస్పదంగా తన ట్వీట్టర్‌ పేజీలో అభివర్ణించారు. ‘‘రేటింగ్‌ ఏజెన్సీలను సంతోష పెట్టేందుకు ప్రభుత్వం వృద్ధిపై రాజీపడింది. ప్రభుత్వం ద్రవ్యలోటుపై అధికంగా దృష్టి పెట్టడమే తక్కువ వృద్ధికి ఒకానొక కారణం. భారత ఔట్‌లుక్‌ను స్వల్పకాల వృద్ధి ఆందోళనలతో తగ్గించడం హాస్యాస్పదం’’ అని సందీప్‌సభర్వాల్‌ పేర్కొన్నారు. ‘‘అంతర్జాతీయ మార్కెట్లు రెండేళ్ల కన్సాలిడేషన్‌ తర్వాత చెప్పుకోతగ్గ బ్రేకవుట్‌ ఇచ్చాయి. ఇవి గణనీయమైన బ్రేకవుట్స్‌. సాధారణంగా ఈ విధమైన బ్రేకవుట్‌ తర్వాత పైకి వెళతాయి. కొన్ని వారాల కన్సాలిడేషన్‌ తర్వాత మన మార్కెట్లు కూడా దీన్ని అందుకుని భారీగా ముందుకు వెళతాయి’’ అని సభర్వాల్‌ మరో ట్వీట్‌ వదిలారు. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఇచ్చిన ప్యాకేజీతో సిమెంట్‌, స్టీల్‌, వైరింగ్‌, లైటింగ్‌, టైల్స్‌, శానిటరీ వేర్‌కూ ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఎఫ్‌పీఐలు గత వారం మన మార్కెట్లలో రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

 

‘‘ఆర్థిక రంగంలో రికవరీ సంకేతాలు ముందుగా స్టాక్‌ మార్కెట్‌ నుంచే కనిపిస్తాయి. రెండోది వినియోగ డేటా, ముఖ్యంగా ఆటో, వాణిజ్యవాహనాలు’’ అంటూ బసంత్‌మహేశ్వరి ట్వీట్‌ చేశారు. ‘మీరెంత స్మార్ట్‌ ఇన్వెస్టర్‌ అయినా సరే, రుణంతో, మార్జిన్లతో పొజిషన్లకు దూరంగా ఉండడమే మంచిది’ అంటూ ఆశిష్‌చుగ్‌ ట్వీట్‌ చేశారు. You may be interested

ఆర్థికాంశాలు, ఫలితాలే దిక్సూచీ..!

Monday 11th November 2019

సోమవారం పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగ ఉత్పత్తి వెల్లడి మంగళవారం సీపీఐ ద్రవ్యోల్బణం, గురువారం డబ్ల్యూపీఐ గణాంకాలు కోల్ ఇండియా, హిందాల్కో, బ్రిటానియా, అరబిందో ఫార్మా, భారతి ఎయిర్‌టెల్, కాడిలా హెల్త్‌కేర్, ఆయిల్ ఇండియా, నాల్కో ఫలితాలు ఈవారంలోనే.. గురునానక్ జయంతి సందర్భంగా మంగళవారం సెలవు న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్‌) ఫలితాల ప్రకటనలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–చైనా వాణిజ్య చర్చల వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం

మ్యూచువల్‌ ఫండ్స్‌లో మీ పథకాల పనితీరు?

Monday 11th November 2019

ఒక పక్క ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కొనసాగుతోంది. గత ఏడాదిన్నర కాలంగా ప్రతికూలంగా ఉన్న మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాల్లోనూ రికవరీ కనిపిస్తోంది. కొన్ని ‍స్టాక్స్‌ ఇప్పటికే 30 శాతం వరకు కనిష్టాల నుంచి పెరిగాయి. అంతెందుకు బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ 10 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 8 శాతం మేర గత రెండు నెలల్లో పెరిగాయి.    మిడ్‌క్యాప్‌ విభాగం 2018 సంవత్సరంలో 12 శాతం నష్టాలను మిగిల్చింది. కానీ, ఈ ఏడాది

Most from this category