News


ఈ స్టాక్స్‌లో రాబడుల ‘వర్షం’...!

Wednesday 3rd July 2019
Markets_main1562176097.png-26773

ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లు బడ్జెట్‌, రుతుపవనాల ప్రభావం, అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం అంశాలపైనే ఆధారపడి కొనసాగుతున్నాయి. ప్రధానంగా బడ్జెట్‌లో ప్రకటనలు, రుతుపవనాల విస్తరణ, వాటి ప్రభావం మార్కెట్ల గమనాన్ని స్వల్ప కాలానికి నిర్దేశిస్తాయని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రుతుపవనాలు, ప్రభుత్వ సానుకూల ప్రకటనలతో లాభపడే స్టాక్స్‌ను నిపుణులు సూచిస్తున్నారు. 

 

జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా 33 శాతం వర్షపాతలోటు నెలకొంది. మధ్య భారతంలో అత్యధికంగా 43.9 శాతం లోటు ఉంటే, ఈశాన్య భారంలో 41.3 శాతంగా ఉందని ఎలారా క్యాపిటల్‌ తన నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా 44 శాతం ప్రాంతంలో కరవు పరిస్థితులు నెలకొన్న సమయంలోనే జూన్‌ వర్షపాతలోటు గణాంకాలు వచ్చాయని, గతేడాదితో పోలిస్తే 11 శాతం ఎక్కువని ఈ నివేదిక గుర్తు చేసింది. ‘‘రుతుపవనాల ఆలస్యం వల్ల ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌లో విత్తుపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సాగు రంగానికి సంబంధించి కీలక ప్రకటనలు ఉంటాయని ఎక్కువ మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదాయ మద్దతు పథకం, మద్దతు ధరల పెంపు, వ్యవసాయానికి నిధుల సాయం పెంపు అగ్రి ముడి సరుకుల వినియోగాన్ని పెంచుతుందని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. దేశీయ ఫార్ములేషన్‌ కంపెనీలు ధనుకా అగ్రిటెక్‌, ర్యాలీస్‌, కోరమాండల్‌ పట్ల తాము ఇప్పటికీ సానుకూలంగా ఉన్నాం’’ అని ఎలారా క్యాపిటల్‌ తెలిపింది. 

 

జూలై తదుపరి నెలల్లో రుతుపవనాలు బలాన్ని పుంజుకుంటాయని నిపుణులు అంచనా కడుతున్నారు. ‘‘గత ఐదారు రోజుల్లో దేశవ్యాప్తంగా వర్షాలు విస్తరించాయి. ఇది విత్తనాల నాటును పెంచి, వ్యవసాయ ముడి పదార్థాల అమ్మకాలను పెంచుతుంది’’ అని ప్రభుదాస్‌ లీలాధర్‌ తన నివేదికలో వివరించింది. రానున్న మూడు నెలలు అగ్రో కెమికల్‌ కంపెనీలైన బేయర్‌ క్రాప్‌ సైన్సెస్‌, ధునుకా అగ్రిటెక్‌, ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా, ర్యాలీస్‌ ఇండియాలకు కీలకమని అభిప్రాయపడింది. పీఐ ఇండస్ట్రీస్‌కు రూ.1,276, ర్యాలీస్‌ ఇండియా రూ.156, ధునుకా అగ్రిటెక్‌ రూ.469, యూపీఎల్‌ రూ.960, శారదా క్రాప్‌కెమ్‌ రూ.354, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ రూ.544, దీపక్‌ ఫర్టిలైజర్స్‌ రూ.174 టార్గెట్‌ ధరతో కొనుగోలు, హోల్డ్‌ రేటింగ్‌లను పలు బ్రోకరేజీ సంస్థలు ఇచ్చాయి. 



You may be interested

ఈ కంపెనీలను నమ్ముకుంటే.. లాభాలు గ్యారంటీ?

Wednesday 3rd July 2019

ప్రధాన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిల సమీపానికి మరోసారి చేరువ అవుతున్నాయి. ఎంపిక చేసిన బ్లూచిప్‌ కౌంటర్లలో కొనుగోళ్లు సూచీలను పరుగులు తీయిస్తున్నాయి. నిఫ్టీ ప్యాక్‌లో కేవలం 20 స్టాక్స్‌ 2018 జనవరి నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్టర్లకు 10 శాతం రాబడులను ఇచ్చాయి. కానీ, అదే సమయంలో నిఫ్టీలోని మరో 24 కంపెనీలు మాత్రం ఇప్పటి వరకు 67 శాతం పడిపోయాయి. కాగా, ఈ విధమైన పోలరైజేషన్‌

ఎఫ్‌అండ్‌ఓలో పాజిటివ్‌ సంకేతాలు!

Wednesday 3rd July 2019

జూన్‌ సీరిస్‌లో సూచీలు పెద్దగా పెను మార్పులు లేకుండా ముగిశాయి. జూన్‌ సీరిస్‌ చివరి వారంలో ఎఫ్‌అండ్‌ఓలో కొంత కదలికలు కనిపించాయి. ఈ వారం ఆరంభం కూడా సూచీలు మందకొడిగా ప్రారంభించాయి. గతంలో జరిగనట్లే ఈ వారం కూడా సూచీలు దిగువకు రాగానే కొనుగోళ్లు కనిపించాయి. దీంతో నిఫ్టీ మరోమారు 11900 పాయింట్ల పైకి చేరింది. ఈ ర్యాలీలో కొత్తగా లాంగ్స్‌ ఏర్పడినట్లు ఫ్యూచర్స్‌ గణాంకాలు చూపుతున్నాయి. బడ్జెట్‌ నేపథ్యంలో

Most from this category