News


మంచి వర్షాలతో లాభపడే కంపెనీలు!

Tuesday 8th October 2019
Markets_main1570473981.png-28761

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రానున్న రోజుల్లో పుంజుకుంటుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. మంచి వర్షాలతో రబీ పంటల సాగు బలంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతం 25 ఏళ్లలోనే కనిష్ట స్థాయికి ఈ ఏడాది చేరిన విషయం తెలిసిందే. 1994 తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. పంట ఉత్పాదకత అధికం కావడం, గ్రామీణ ‍ప్రాంతాల్లో ప్రభుత్వ అధిక వ్యయాలు రానున్న రోజుల్లో మంచి ఫలితాలకు దారితీస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది మార్కెట్లకు కూడా సానుకూలించేదే. ఈ పరిస్థితులతో లాభపడే కంపెనీలను పలు ‍బ్రోకరేజీ సంస్థలు సిఫారసు చేశాయి. 

 

ర్యాలీస్‌ ఇండియా 
ఎపిక్‌ రీసెర్చ్‌ రూ.206 టార్గెట్‌ ధరకు ర్యాలీస్‌ ఇండియా స్టాక్‌ను సిఫారసు చేసింది. ఈ కంపెనీ టాటా కెమికల్స్‌ సబ్సిడరీ. దేశంలో 80 శాతం జిల్లాలను కవర్‌ చేస్తోంది. పెస్టిసైడ్స్‌, సీడ్ ట్రీట్‌మెంట్‌, ఇతర అగ్రి ఉత్పత్తులు, సేవల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘‘అంచనాలకు మించిన వర్షాలు ఈ కంపెనీపై సానుకూల ఫలితం చూపిస్తుంది. ప్రస్తుత ధరల వద్ద ఈ స్టాక్‌ ఆకర్షణీయంగా కనిపిస్తోంది’’ అని ఎపిక్‌ రీసెర్చ్‌ తెలిపింది. 

 

ఎంఅండ్‌ఎం
రూ.715 టార్గెట్‌తో ఈ స్టాక్‌ కొనుగోలుకు ఎపిక్‌ రీసెర్చ్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ పుంజుకుంటుందని, అదే సమయంలో కిసాన్‌ సమ్మాన్‌ నిధి, రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న విధానాలు దీర్ఘకాలంలో డిమాండ్‌ మెరుగుపడేందుకు దారితీస్తాయని ఈ సంస్థ పేర్కొంది. తక్కువ వడ్డీ రేట్ల వాతావరణం కూడా డిమాండ్‌ పెరిగేందుకు దారితీస్తుందని అంచనా వేస్తోంది. ఎంఅండ్‌ఎం దేశంలో అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ సంస్థ. వ్యవసాయ యంత్ర పరికరాల వ్యాపారంలోకీ అడుగుపెట్టింది. ప్రస్తుత ధర రిస్క్‌-రాబడుల పరంగా ఆకర్షణీయంగా ఉందని ఎపిక్‌ రీసెర్చ్‌ తెలిపింది. 

 

యూపీఎల్‌
రూ.740 లక్ష్యంతో యూపీఎల్‌ కొనుగోలు చేసుకోవచ్చని ఎపిక్‌ రీసెర్చ్‌ సూచించింది. సమగ్ర పంట రక్షణ ఉత్పత్తులతో ఈ రంగంలో అగ్ర స్థాయి కంపెనీల్లో ఒకటిగా ఉందని, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని వివరించింది. అరిస్టా లైఫ్‌ను కొనుగోలు చేయడం, అధిక ముడిసరుకుల వ్యయాలు కంపెనీ లాభాలపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. 

 

ఐటీసీ
రూ.352 టార్గెట్‌తో ఐటీసీ కొనుగోలుకు ఆనంద్‌ రాఠి సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ఆపరేటింగ్‌ క్యాష్‌ ఫో బలంగా ఉండడం, అన్ని విభాగాల్లోనూ సామర్థ్య విస్తరణ కొనసాగిస్తుండడం, బ్యాలన్స్‌ షీటు పటిష్టంగా ఉండడం సానుకూలతలుగా పేర్కొంది. 

 

ఫినోలెక్స్‌ కేబుల్‌
రూ.478 టార్గెట్‌తో ఈ స్టాక్‌ కొనుగోలుకు ఆనంద్‌రాఠి సిఫారసు చేసింది. ఎలక్ట్రిక్‌ కేబుల్స్‌ రంగంలో అగ్రగామిగా ఉండడం, రుణ రహిత కంపెనీ కావడం ఆకర్షణీయమని పేర్కొంది. అయితే, ఎఫ్‌ఎంఈజీ విభాగం విజయవంతం కావడం, జాయింట్‌ వెంచర్‌లో మెరుగుదల అన్నవి గమనించాల్సిన అంశాలుగా పేర్కొంది. 

 

స్వరాజ్‌ ఇంజన్స్‌
రూ.2,139 లక్ష్యంతో కొనుగోలుకు ఆనంద్‌రాఠి బై కాల్‌ ఇచ్చింది. ప్రభుత్వ సబ్సిడీలతో 2019-20లోనూ ట్రాక్టర్‌ పరిశ్రమలో మంచి వృద్ధి అంచనా వేస్తున్నట్టు, రాష్ట్రాల సబ్సిడీతోనూ స్వరాజ్‌ ఇంజన్స్‌ లాభపడుతుందని ఆనంద్‌రాఠి తెలిపింది. స్వరాజ్‌ ఇంజన్స్‌ విక్రయాల్లో 10 శాతం వృద్ధిని అంచనా వేసింది. You may be interested

నిఫ్టీ చార్టులో సెల్‌ సిగ్నల్‌!

Tuesday 8th October 2019

నిఫ్టీ సోమవారం తీవ్ర అస్థిరతల మధ్య పై స్థాయిలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా కానీ సఫలం కాలేదు. చివర్లో అమ్మకాల కారణంగా సూచీలు నష్టపోయాయి. ముఖ్యంగా సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాలపై ఆందోళనలు తాజా అమ్మకాలకు కారణమయ్యాయి. అయితే, నిఫ్టీ వరుసగా ఆరో రోజూ తక్కువ స్థాయిల్లో క్లోజయింది. తద్వారా డైలీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పాటు చేసిందని నిపుణులు చెబుతున్నారు.    నిఫ్టీ 11,196 వద్ద ప్రారంభమై 200 రోజుల సగటు ఈఎంఏ(11,218)ను అధిగమించేందుకు

ఆరో రోజూ ఆగని నష్టాలు..!

Monday 7th October 2019

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్‌ వరుసగా ఆరోరోజూ నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి అరగంట అమ్మకాలతో సూచీలు మరింత నష్టపోయాయి. ఫార్మా, మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక, రియల్టీ షేర్లలో అమ్మకాలు జరగడంతో సెన్సెక్స్‌ 141 పాయింట్లు నష్టపోయి 37,531.98 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు క్షీణించి 11,126.40 వద్ద స్థిరపడ్డాయి. మరోవైపు ప్రైవేట్‌

Most from this category