News


ఈ బ్యాంకు స్టాక్స్‌లో బంపర్‌ లాభాలు

Wednesday 30th October 2019
Markets_main1572376915.png-29214

రానున్న ఏడాది కాలంలో డీసీబీ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాకు, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మంచి రాబడులకు అవకాశం ఉందన్నారు ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌. పలు మార్కెట్‌ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు.

 

మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో నెలకొన్న నిరాశావాదాన్ని గత 30 ఏళ్లలో తాను ఎప్పుడూ చూడలేదన్నారు. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైన రాబడులు పొందొచ్చని అభిప్రాయపడ్డారు. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ మంచి విలువను తెచ్చిపెట్టగలదని, మంచి డివిడెండ్‌ ఈల్డ్‌కు తోడు, ఇప్పటి వరకు మార్కెట్‌ విలువ పరంగా జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఉందని వివరించారు. బ్యాంకింగ్‌ రంగంలో అంచనాలకు మించి ఫలితాలు ఉంటాయని భాసిన్‌ చెప్పారు. కార్పొరేట్‌ బ్యాంకుల్లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకు సైతం మంచి పనితీరు చూపించినట్టు చెప్పారు. అయితే, తాను మాత్రం మిడ్‌క్యాప్‌ బ్యాంకుల్లో, మంచి ఆర్థిక ఫలితాలు చూపించే బ్యాంకుల పట్ల సానుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఏడాది కాలంలో డీసీబీ, ఫెడరల్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకుతోపాటు ప్రభుత్వరంగ బ్యాంకులైన పీఎన్‌బీ, బ్యాంకు ఆఫ్‌ బరోడాలో మంచి రాబడులకు అవకాశం ఉందన్నారు. ఇవి మంచి ఫలితాలను ప్రదర్శించగలవనని, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభంతో ఈ బ్యాంకుల రుణ వితరణ పెరగగలదన్నారు. ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లో తాము ఇన్వెస్ట్‌ చేసి ఉన్నప్పటికీ ఈ మిడ్‌క్యాప్‌ బ్యాంకుల పట్ల ఎంతో బుల్లిష్‌గా ఉన్నట్టు భాసిన్‌ తెలిపారు.  

 

మార్కెట్‌ మొత్తం పూర్తి ఆకర్షణీయంగా ఉందన్నారు భాసిన్‌. వచ్చే మూడు, ఆరు నెలల కాలాన్ని చూడొద్దని, ఎంపిక చేసిన స్టాక్స్‌ లేదా రంగాల్లో కనీసం 50 శాతం నుంచి 100 శాతం రాబడులు వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. మన దగ్గర తక్కువ వడ్డీ రేట్లు, బాండ్‌ ఈల్డ్స్‌ ఆకర్షణీయంగా లేకపోవడం వంటివి ఈక్విటీలకు అనుకూలమని పేర్కొన్నారు. సిప్‌‍, మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు 2020లో మిడ్‌క్యాప్‌లోకి పెద్ద ఎత్తున రాగలవని అంచనా వేశారు. ఎంపిక చేసిన మిడ్‌క్యాప్‌ షేర్ల విషయంలో 2017 తరహా ర్యాలీ మరలా పునరావృతం అవడాన్ని తాను తోసిపుచ్చలేనని చెప్పారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో ఉచిత తాయిలాలు కంపెనీలకు బలమైన వృద్ధి అవకాశాలుగా అభివర్ణించారు. మూలధన వ్యయాలు, నిర్మాణం అన్నవి ముఖచిత్రాన్ని మార్చేవిగా పేర్కొన్నారు. You may be interested

భారత్‌లో అమెజాన్‌ భారీ పెట్టుబడి

Wednesday 30th October 2019

మార్కెట్‌ ప్లేస్‌, రిటైల్‌, అమెజాన్‌ పేలో   నూతనంగా రూ. 4,400 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌ న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. భారత మార్కెట్లో తన వ్యాపార కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా రూ. 4,400 కోట్లను ఇక్కడి మార్కెట్లో పెట్టుబడిగా పెట్టనుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించిన తాజా సమాచారం మేరకు.. అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్ డాట్‌ కామ్ ఇంక్‌ సంస్థలు

ఐదు కంపెనీల్లో వాటాలు పెంచుకున్న కచోలియా

Wednesday 30th October 2019

ప్రముఖ సీనియర్‌ ఇన్వెస్టర్‌ ఆశిష్‌ కచోలియా సెప్టెంబర్‌ త్రైమాసికంలో తన పోర్ట్‌ఫోలియో పరంగా పలు మార్పులు, చేర్పులు చేశారు. ముఖ్యంగా ఐదు కంపెనీల్లో ఆయన వాటాలు పెంచుకున్నట్టు డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ విభాగంలో దాగి ఉన్న ఆణిముత్యాల్లాంటి షేర్లను గుర్తించడంలో కచోలియాకు మంచి పేరుంది. కనుక ఆయన పోర్ట్‌ఫోలియోను గమనించడం ద్వారా రిటైల్‌ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడికి సంబంధించి కొన్ని సంకేతాలను అర్థం చేసుకోవడానికి వీలుంటుంది.    మాజెస్కో, కేపీఐటీ

Most from this category