News


ఇంకో వారంలో ఎఫ్‌ఐఐల ఇన్‌ఫ్లో!

Wednesday 14th August 2019
Markets_main1565767643.png-27762

‘గత నెల నుంచి ఇప్పటి వరకు గమనిస్తే విదేశి నిధుల ఔట్‌ ఫ్లో అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలో కొనసాగుతుందనే విషయం అర్థమవుతుంది. ముందు, బడ్జెట్‌ పన్ను ప్రతిపాదనలు విదేశి నిధుల ఔట్‌ ఫ్లోకి కారణమయితే ఇప్పుడు ఎమెర్జింగ్‌ మార్కెట్ల నుంచి నిధుల ప్రవాహాం జరగడం, కారణంగా ఉంది’ అని సుందరం మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎండీ, సీఈఓ, సునిల్‌ సుబ్రమణ్యిం ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

ఎమెర్జింగ్‌ మార్కెట్ల నుంచి ఔట్‌ ఫ్లో..
సూపర్‌ రిచ్‌ సర్‌చార్జీ, ఆర్థిక మంత్రితో సమావేశాలు ఎఫ్‌పీఐ(విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్లు)లను ఆందోళనకు గురిచేశాయి. గత కొన్ని వారాల నుంచి చూసుకుంటే అధికంగా విదేశి నిధుల ఔట్‌ ఫ్లో కనిపిస్తోంది. ఇది పీఎంఓ(ప్రధానమంత్రి కార్యలయం) ను తాకినట్టు అనిపిస్తోంది. ఎఫ్‌పీఐల సర్‌చార్జీలపై వెనక్కి తగ్గడమో లేదా ఎఫ్‌పీఐలకు అనుకూలంగా కొన్ని మార్పులు చేయడమో ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తున్నాం. 
   ఇది కాకుండా, అన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐల నిధుల ఔట్‌ఫ్లో కొనసాగుతుందనే విషయాన్ని గత నెల నుంచి ఇప్పటి వరకు  గమనిస్తే అర్థమవుతుంది. మొదట్లో బడ్జెట్లో ప్రతిపాదించిన పన్నుల వలను ఎఫ్‌ఐఐల ఔట్‌ ఫ్లో కొనసాగగా, ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల నుంచి నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగడం కారణంగా ఉంది. ఇది కేవలం ఇండియాలోనే జరగడం లేదనే విషయాన్ని గమనించాలి. ట్యాక్స్‌ రిజల్యూషన్‌ చర్యలు ఉండడంతో, పరిస్థితి మెరుగుపడి ఎఫ్‌ఐఐలు పది రోజుల్లో లేదా ఒక వారంలో తిరిగి ఇండియా మార్కెట్లలోకి వచ్చే అవకాశం ఉంది.

నిఫ్టీని బ్యాంక్‌ సెక్టార్‌ నడపనుంది..
ఫలితాల సీజన్‌కు చివరి దశలో ఉన్నాం. బ్యాంకింగ్‌ సెక్టార్‌ ఫలితాలు పర్వాలేదనిపించాయి. బ్యాంక్‌ రుణాలు పెరగడంతో పాటు చాలా వరకు బ్యాంక్‌ల ఎన్‌పీఏ(నాన్‌ ప్రాఫిట్‌బుల్‌ ఎసెట్‌)లు తగ్గుముఖం పట్టాయి. ఇవి బ్యాంక్‌ల లాభనష్టాలపై ప్రబావం చూపడం గమనించాం. ఈ ఏడాది నిఫ్టీని బ్యాంక్‌ సెక్టార్‌ నడిపించవచ్చు. ఇంకోవైపు ఆటో సెక్టార్‌ మందగమనంలోనే ఉంది. గత ఏడాది జీఎస్‌టీ, బీఎస్‌ 6 నిబంధనలతో కుదేలయిన ఆటో రంగం, ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వలన పూర్తిగా దెబ్బతింది. ఈ అంశాలన్ని ఆటో సెక్టార్‌ను తీవ్రంగా ప్రభావం చేశాయి.

మల్టీక్యాప్‌ ఫండ్స్‌ బెటర్‌!
మల్టీక్యాప్‌ ఫండ్‌ అన్ని సమయాలలో పరిశీలించవచ్చని నా అభిప్రాయం. మల్టీ క్యాప్‌ విభాగంలో  ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు పెట్టుకోమని సలహా ఇస్తాము. మల్టీ క్యాప్‌ ఫండ్స్‌లో పరిస్థితిని అర్థం చేసుకొని మారేందుకు ఫండ్‌ మేనేజర్లకు ఒక ప్లెక్సిబులిటి ఉంటుంది. లార్జ్‌ క్యాప్‌ లేదా స్మాల్‌ క్యాప్‌ వంటి సింగిల్ క్యాప్ ఫండ్స్‌ను తీసుకుంటే ఇవి సాధారణంగా ‘బై’, ‘హోల్డ్‌’ లేదా టాప్ డౌన్ సెక్టార్ విధానాన్ని అనుసరించి, ఆ తర్వాత స్టాక్‌లను ‘బై’ చేయడానికి వీలుంటుంది. కానీ మల్టీక్యాప్ ఏదో ఒక విభాగానికి పరిమితమయి ఉండదు.  ఈ ఫండ్‌ ఫ్లెక్సిబుల్‌ గుణం మా పోర్టుపోలియో పథకాలలో దీనిని చేర్చుకోడానికి కారణమయ్యింది. ప్రస్తుతం మార్కెట్ దిద్దుబాట్లను ఎదుర్కొంటున్న సమయంలో స్పష్టమైన దిశ లేకపోవడంతో మల్టీక్యాప్ విభాగం వచ్చే మూడు నుంచి ఐదేళ్ల కాలానికి గాను మంచి రిటర్న్‌లు ఇచ్చే అవకాశం ఉంది.You may be interested

పతనం నుంచి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ రికవరీ

Wednesday 14th August 2019

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ షేర్లు బుధవారం 7.50శాతం పతనం నుంచి రివకరి అయ్యాయి. స్టాండర్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ వాటాను విక్రయించడంతో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 7.50శాతం క్షీణించాయి. నేడు ఈ కంపెనీ షేర్లు రూ.489.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ కంపెనీకి చెందిన ప్రతి షేరు ధర రూ.486 చొప్పున 3.2శాతానికి సమానమైన 6.4 కోట్ల ఈక్విటీ షేర్లు బ్లాక్‌డీల్‌ ద్వారా చేతులు

రెండేళ్ల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

Wednesday 14th August 2019

టోకు ధరల ద్రవ్యోల్బణం జూలైలో 26 నెలల కనిష్టస్థాయికి దిగివచ్చింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం జూలై టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) గణాంకాలను విడుదల చేసింది. ఇంధన, విద్యుత్‌ ధరలు దిగిరావడంతో ఈ జూలైలో టోకు ద్రవ్యోల్బణం 1.08శాతానికి పరిమితమైంది. అంతకు ముందు జూన్‌ మాసంలో ఇది 2.02శాతంగా నమోదైంది. వరుసగా రెండో నెలలో కూడా తగ్గిన  టోకు ధరల సూచీ ఆధారిత(డబ్ల్యూపీఐ) గణాంకాలు వివరాలు ఇలా ఉన్నాయి. 1. ప్రైమరీ ఆర్టికల్స్‌ ద్రవ్యోల్బణం

Most from this category