News


మార్కెట్‌ నుంచి బయటపడండి.. ఇదే సరైన సమయం!

Wednesday 19th June 2019
Markets_main1560934590.png-26418

ఎస్‌బీఐ లైఫ్‌ సీఐఓ గోపీకృష్ణ షెనాయ్‌
ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో లాభాల స్వీకరణ జరిపి బయటపడడం మంచిదని ఎస్‌బీఐ లైఫ్‌ సీఐఓ గోపీకృష్ణ షెనాయ్‌ సూచిస్తున్నారు. వాల్యూషన్లు బాగా వ్యాకోచించాయని, ఈ నేపథ్యంలో ఈక్విటీల నుంచి బయటకు రావడం ఉత్తమమని ఆయన చెప్పారు. గతేడాది దేశీయ సూచీలు పదిశాతం ర్యాలీ జరిపాయి. ఈ ఏడాది కూడా జోరు చూపుతున్నాయి. అయితే ఎర్నింగ్స్‌ గ్రోత్‌ బాగుంటుందని చెప్పే సరైన తక్షణ సూచికలేమీ లేవని, ఎర్నింగ్స్‌ వృద్దికి మరింత సమయం పడుతుందని షెనాయ్‌ చెప్పారు. గతకొన్ని నెలలుగా ఎన్నికల ఫలితాలపై అనిశ్చితితో ఇన్వెస్టర్లు చిన్న కంపెనీల నుంచి లార్జ్‌క్యాప్స్‌కు పెట్టుబడులు మరలించారని చెప్పారు. దీంతో ప్రధాన సూచీలు మంచి వృద్ధి నమోదు చేసినా, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు మాత్రం నష్టాలనే చవిచూశాయని తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఇన్వెస్టర్లు కొత్త ప్రభుత్వం ప్రకటించే చర్యల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. మందగమనంలో ఉన్న ఎకానమీని ఎలా ఉత్తేజపరుస్తారు? నగదు కొరతను ఎలా తీరుస్తారు? అనే అంశాలపై అంతా ఆతృతగా చూస్తున్నారన్నారు. 
ఆటో,  సిమెంట్‌ షేర్లపై అండర్‌వెయిట్‌
తమ పోర్టుఫోలియోలో సిమెంట్‌, ఆటో, కన్జూమర్‌ స్టేపిల్స్‌ రంగాల షేర్లను తగ్గించుకున్నామని షెనాయ్‌ చెప్పారు. ఐటీలో టాప్‌2 కంపెనీలు తప్ప మిగిలిన కంపెనీల్లో వాటాలను తగ్గించుకున్నామన్నారు. మిడ్‌క్యాప్‌ల్లో సైతం వాటాలను తగ్గించుకున్నట్లు చెప్పారు. బ్యాంకింగ్‌ స్టాకుల్లో వాటాలను కొనసాగిస్తున్నామన్నారు. తాజా పతనం అనంతరం ఆటో, కన్జూమర్‌ రంగాల్లో తిరిగి ఎంటర్‌ కావాలని యోచిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి డిమాండ్‌లో రికవరీ ఉండొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ టాప్‌50 కంపెనీల ఎర్నింగ్స్‌లో సరాసరిన 14 శాతం పెరుగుదల ఉంటుందని ఆయన చెప్పారు. ప్రధానంగా బ్యాంకుల పురోగతి కారణంగా ఎర్నింగ్స్‌ మెరుగుదల ఉంటుందన్నారు. మిడ్‌క్యాప్స్‌లో మంచి వాల్యూ ఉందని, కానీ ఇప్పటికిప్పుడు వాటి జోలికి పోయే ఆలోచన లేదని తెలిపారు. You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కొనేందుకిదే సమయం!

Wednesday 19th June 2019

నిపుణుల సలహా హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ షేరు మంగళ, బుధవారాల్లో దాదాపు 8 శాతం మేర పతనమైంది. మంగళవారం షేరు తొమి‍్మదినెలల్లో ఎన్నడూ లేని ఇంట్రాడే పతనాన్ని నమోదు చేసింది. ఎస్సెల్‌ గ్రూప్‌ డెట్‌ సెక్యూరిటీస్‌ను తన పథకాల్లోకి తీసుకోవాలన్న ఏఎంసీ నిర్ణయం మదుపరులకు రుచించలేదు. దీంతో కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అయితే ఈ పతనాన్ని కొనుగోళ్లకు అవకాశంగా మలచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశీయ ప్రజలు బంగారం, రియల్టీలో పొదుపు

2.50శాతం ర్యాలీ చేసిన టైటాన్‌ షేర్లు

Wednesday 19th June 2019

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ యూబీఎస్‌ రేటింగ్‌ పెంచడంతో టైటాన్‌ కంపెనీ షేర్లు బుధవారం 2.50శాతం ర్యాలీ చేశాయి. నేడు టైటాన్‌ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో రూ.1280ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒకదశలో 1288 రూపాయలకు చేరాయి. ‘‘టైటాన్‌ కంపెనీ వ్యూహాత్మక ప్రణాళికలు, మేనేజ్‌మెంట్‌ పారదర్శకమై పనితీరుతో మేము సంతృప్తికరంగా ఉన్నాము. షేరు ప్రస్తుత స్థాయిల నుంచి 28శాతం అప్‌ట్రెండ్‌కు కొనసాగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో గతంలో  షేరకు కేటాయించిన అవుట్‌

Most from this category