News


మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ కొంటున్నాం...కొటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌

Monday 4th November 2019
Markets_main1572864587.png-29339

‘సెంటిమెంట్‌, లిక్విడిటీ సానుకూలంగా ఉండడంతో మార్కెట్‌లు కదులుతుంటే, ఇన్వెస్టర్లు కొన్ని స్టాకులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ప్రాథమిక అంశాలు వీటిపై ఎటువంటి ప్రభావం చూపనప్పటికి, మార్కెట్‌ కదలికల్లో భాగంగా ఇవి కదులుతుంటాయి’ అని కోటక్‌ ఏఎంసీ, సీఐఓ ఈక్విటీ, హర్ష ఉపాధ్యాయ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..
స్వల్ప కాలం కోసం వద్దు..
కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గడంతో మార్కెట్‌లో లిక్విడిటీ, సెంటిమెంట్‌ మెరుగుపడింది. ప్రాథమిక అంశాలు మెరుగుపడడంతో కార్పోరేట్‌ ఫలితాలు బాగుండడం చూస్తున్నాం. ఇది కన్సాలిడేషన్‌ దశ. సెంటిమెంట్‌, లిక్విడిటీ సానుకూలంగా ఉండడంతో మార్కెట్‌లు కదులుతుంటే, ఇన్వెస్టర్లు కొన్ని స్టాకులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ఫండమెంటల్స్‌ వీటిపై ఎటువంటి ప్రభావం చూపనప్పటికి, మార్కెట్‌ కదలికలో భాగంగా ఇవి కదులుతుంటాయి. అంతేకాకుండా కార్పొరేట్‌ రాబడులు మెరుగుపడడానికి మరి కొంత సమయం అవసరమనే విషయాన్ని ఇన్వెస్టర్లు  గమనించాలి. ప్రస్తుతం ఉన్న దశను ఇన్వెస్ట్‌మెంట్‌ దశగా చూడాలే తప్ప, రిస్క్‌లు తీసుకొని, స్వల్ప కాలంలో లాభాల కోసం ప్రయత్నించకూడదు.
లార్జ్‌ క్యాప్‌ల కంటే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లు బెటర్‌.. 
లార్జ్‌ క్యాప్‌ల కంటే మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌లు వాల్యుషన్ల పరంగా ఆకర్షిస్తున్నాయి. మధ్యస్థ దీర్ఘకాలానికి గాను లార్జ్‌క్యాప్‌ల కంటే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లలో అధికంగా డబ్బులను సంపాదించవచ్చు. మిడ్‌,స్మాల్‌ క్యాప్‌ల కేటాయింపులను ఇన్వెస్టర్లు పెంచుకోవాలని సలహాయిస్తున్నాం. మేము కూడా మా పోర్టుపోలియోలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లను, వివిధ రంగాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. గత రెండేళ్ల నుంచి దిద్దుబాటు గురయిన, ప్రాథమిక అంశాలు బాగున్న వివిధ రంగాలకు చెందిన మిడ్‌, స్మాల్‌ క్యాప్ స్టాకులు మంచి ప్రదర్శన చేస్తున్నాయి. 
ఆటో రం‍గంలో ద్విచక్ర వాహనాలే..
మార్కెట్‌ అంచనాల  కంటే హోల్‌సేల్‌ అమ్మకాలు స్వల్పంగా పెరగడం లేదా తగ్గడం గమనించినప్పటికి, రిటైల్‌ అమ్మకాలు మాత్రం పండుగ సీజన్‌ తర్వాత గాడిలో పడ్డాయి. చాలా వరకు ఆటో రంగానికి చెందిన స్టాకులు గత రెండు నెలల కిందట ఏర్పరిచిన కనిష్ఠాల నుంచి గణనీయంగా పెరగడం చూడవచ్చు. అయిననప్పటికి ఈ రంగంలోని కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఈ స్టాకులు ఏ వాల్యుషన్‌ వద్ద ట్రేడవుతున్నాయో, ప్రస్తుతం చూస్తున్న రిటైల్‌ అమ్మకాలు వచ్చే త్రైమాసికంలో కూడా కొనసాగుతాయో లేదో అనే అంశాలను పరిశీలించాలి. వాల్యుషన్‌ల పరంగా వాణిజ్య వాహనాలు లేదా పాసింజర్‌ వాహనాల కంటే ద్విచక్రవాహనాలు బాగుండడంతో వీటిపై సానుకూలంగా ఉన్నాం.
ఎన్‌బీఎఫ్‌సీలో 2-3 ​కంపెనీలే..
ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్లో కీలకమైన 2-3 కంపెనీలు అధ్వాన్న పరిస్థితులలో కూడా మంచి ప్రదర్శన చేశాయి. ఈ కంపెనీలు అధిక మొత్తంలో నగదు లభ్యత కలిగివుండడం వలన లాభపడడంతో పాటు, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుండడంతో కూడా మంచి ప్రయోజనాన్ని పొందుతున్నాయి. వృద్ధి పరంగా చూసిన  ఈ సెక్టార్‌లో ఈ కంపెనీలకు పోటినిచ్చే కంపెనీలు తక్కువగా ఉండడం కూడా వీటికి కలిసోచ్చేదే. మొత్తంగా ఎన్‌బీఎఫ్‌సీని చూస్తే ఈ రంగం వృద్ధి చాలా నెమ్మదిగా ఉంది. ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్లో ఇబ్బందులు పడుతున్న కంపెనీలు తిరిగి గాడిలోకి రావాలంటే అధిక మొత్తంలో అస్తిని విక్రయించి నిధుల లభ్యతనైనా పెంచుకోవాలి లేదా వ్యూహాత్మక భాగస్వామిని వెతుక్కొవాలి. వీటితో పాటు ఈ రంగానికి సంబంధించి ప్రతికూల వార్తలు తగ్గడం చాల ముఖ్యం . వచ్చే రెండు మూడు త్రైమాసికాల నాటికి ఈ సెక్టార్‌లో ప్రతికూల వార్తలు తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. 
కార్పోరేట్‌ లాభాలు అంచనాల కంటే బాగున్నాయి..
ప్రభుత్వం పన్నురేటును తగ్గించడంతో సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో చాలా కంపెనీల ఫలితాలు అంచనాల కంటే బాగున్నాయి. కానీ వాస్తవంగా కంపెనీల వ్యాపారాలు మెరుగుపడలేదు. వచ్చే రెండు మూడు త్రైమాసికాల నాటికి ఈ కంపెనీల వ్యాపారాలు మెరుగుపడతాయని అంచనా వేస్తున్నా.



You may be interested

మెటల్‌ స్టాక్స్‌పై బుల్స్‌ పట్టు!

Monday 4th November 2019

నిఫ్టీ మెటల్‌ సూచీ గరిష్ట స్థాయిని చేరొచ్చని, గత గరిష్ట స్థాయి రూ.2,576ను అధిగమించొచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ సీనియర్‌ వీపీ శ్రీకాంత్‌ చౌహాన్‌ అంచనా వేశారు. ‘‘ఆటో సూచీ మార్గంలోనే మెటల్‌ సూచీ కూడా కొనసాగుతుంటుంది. 2018లో గరిష్ట ‍స్థాయి నుంచి ఆటో ఇండెక్స్‌ 50 శాతం పడిపోయింది. అలాగే మెటల్‌ ఇండెక్స్‌ 4,200 నుంచి 2,100 స్థాయికి 50 శాతం పడిపోయింది. ఇటీవలి కనిష్ట స్థాయి

బంగారం ఎందుకంత ఖరీదు?!

Monday 4th November 2019

నానాటికీ పెరుగుతున్న ధర చిన్నపాటి విరామాలతో అప్‌ట్రెండే శాశ్వతం నిపుణుల అంచనా     పసిడి... ,,  పురాతన కాలం నుంచి ప్రస్తుతకాలం వరకు ఏమాత్రం వన్నె తగ్గని, ఆకర్షణ కోల్పోని లోహం... వ్యక్తి లేదా దేశ ఆర్థిక సంపన్నతకు చిహ్నం... బంగారం కన్నా విలువైన లోహాలు అనేకం కనుగొనొచ్చు కానీ సామాన్య ప్రజానీకానికి సైతం తెలిసిన, అందుబాటులో ఉండే విలువైన లోహం మాత్రం పసిడే! అసలెందుకు ఈ పుత్తడికి ఇంత ఆకర్షణ.. ఎందుకీ లోహం ఇంత ఖరీదు...?

Most from this category