News


ఫార్మా షేర్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌

Monday 7th October 2019
Markets_main1570443259.png-28759

యూఎస్‌ఎఫ్‌డీఏ లేవనెత్తిన అభ్యంతరాల ప్రభావంతో సోమవారం ట్రేడింగ్‌లో దేశీయ ఫార్మా కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ నేడు దాదాపు 3.50శాతం నష్టపోయింది. అత్యధికంగా అరబిందో ఫార్మా షేర్లు 20 శాతంపైగా కుప్పకూలాయి. అదేబాటలో గ్లెన్‌మార్క్ షేర్లు 9శాతం పతనమయ్యాయి. పిరమిల్‌ఎంటర్‌ప్రైజెస్‌  షేర్లు 8శాతం, లుపిన్‌ 3.50శాతం, సిప్లా 2.50శాతం, కేడిల్లా హెల్త్‌కేర్‌ 2శాతం, బయోకాన్‌, సన్‌ఫార్మా షేర్లు 1.50శాతం క్షీణించాయి. మరోవైపు డాక్టర్‌ రెడ్డీస్‌ అరశాతం పెరగ్గా, దివీస్‌ ల్యాబ్స్‌ 1.56శాతం ర్యాలీ చేశాయి. 
అరబిందో ఫార్మా లిమిటెడ్‌ 20శాతం క్రాష్‌..!
అరబిందో ఫార్మా లిమిటెడ్‌ షేర్లు సోమవారం 20శాతం నష్టపోయాయి. తెలంగాణలోని యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఫామ్‌-483 జారీ చేయడం ఇందుకు కారణమైంది. సెప్టెంబర్‌ 19-27 మధ్య యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు చేపట్టింది. యూనిట్‌ ప్రమాణాలు, విధివిధానాలు రెగ్యులేటరీ నిబంధలకు విరుద్ధంగా ఉండటంతో పాటు ఫామ్‌-483 జారీ చేసింది. ఫలితంగా కంపెనీ షేర్లు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్కెట్‌ ముగిసే సరికి 20.50శాతం నష్టపోయి రూ.451.60 వద్ద స్థిరపడ్డాయి. 
అదేబాటలో గ్లెన్‌మార్క్‌..!
బద్దీలోగల తయారీ ప్లాంటు లోపాలను గుర్తించి యూఎస్‌ఎఫ్‌డీఏ ఓఏఐను జారీ చేయడంతో గ్లెన్‌మార్క్ షేర్లు ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్కెట్‌ ముగిసే సరికి 9 శాతం నష్టంతో రూ.286.80 వద్ద స్థిరపడ్డాయి.



You may be interested

ఆరో రోజూ ఆగని నష్టాలు..!

Monday 7th October 2019

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్‌ వరుసగా ఆరోరోజూ నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి అరగంట అమ్మకాలతో సూచీలు మరింత నష్టపోయాయి. ఫార్మా, మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక, రియల్టీ షేర్లలో అమ్మకాలు జరగడంతో సెన్సెక్స్‌ 141 పాయింట్లు నష్టపోయి 37,531.98 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు క్షీణించి 11,126.40 వద్ద స్థిరపడ్డాయి. మరోవైపు ప్రైవేట్‌

ఝున్‌ఝున్‌వాలా పోర్టుఫోలియోలో ఏ స్టాకులున్నాయ్‌!

Monday 7th October 2019

రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా..పరిచయం అక్కర్లేని పేరు. దలాల్‌ స్ట్రీట్‌లో 1985లో కేవలం రూ. 5,000తో మొదలైన ఆయన ప్రయాణం, బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం 2019 అగష్టు నాటికి  రూ. 17,500 కోట్లకు చేరుకుంది.ఇండియా వారెన్‌బఫెట్‌గా పిలుచుకునే ఈ సీనియర్‌ ఇన్వెస్టర్‌, 30 కి పైగా స్టాకులలో 1 శాతం కంటే అధిక వాటాను కలిగి ఉన్నారు. ఈయన పోర్టుఫోలియో విలువ సుమారుగా రూ. 13,000 కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ

Most from this category