News


ప్లాస్టిక్‌పై నిషేధం ఈ షేర్లకు కనక వర్షం!

Wednesday 2nd October 2019
Markets_main1570039838.png-28680

ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను 2022 నాటికి దేశంలో పూర్తిగా నిషేధించాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నం. మహాత్ముడి 150వ జయంతికి దీన్ని బహుమతిగా ఇవ్వాలన్నది ఆకాంక్ష. ప్లాస్టిక్‌పై మోదీ మోగించిన విప్లవ భేరి, దలాల్‌ స్ట్రీట్‌లో పేపర్‌ స్టాక్స్‌ను పరుగులు పెట్టించాయి. కేవలం నెల రోజుల్లోనే పేపర్‌ షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలు కురిపించాయి. 

ఒక్కసారి వినియోగించే ప్లాస్ట్‌క్‌లో ఎక్కువ భాగం పాలిథీన్‌ క్యారీ బ్యాగులే ఉంటున్నాయి. షాపులు, వ్యాపార కేంద్రాల్లో ఈ నెల 2 నుంచి ప్లాస్టిక్‌ బ్యాగుల నిషేధానికి చర్యలు కూడా తీసుకున్నారు. ఈ చర్యలే పేపర్‌ తయారీ కంపెనీల షేర్లకు కలిసొచ్చాయి. మలు పేపర్‌ మిల్స్‌ ఆగస్ట్‌ 30న రూ.20 దగ్గర ఉంటే, సెప్టెంబర్‌ 30 నాటికి రూ.38.90కు పెరిగింది. నెలలో 95 శాతం పెరిగింది. స్టార్‌ పేపర్‌ మిల్స్‌, పద్మజీ పేపర్‌ ప్రొడక్ట్స్‌, బాలకృష్ణ పేపర్‌ మిల్స్, హైటెక్‌ వైండింగ్‌ సిస్టమ్స్‌, జీనస్‌ పేపర్‌ అండ్‌ బోర్డ్స్‌ షేర్లు ఇదే కాలంలో 50-85 శాతం మధ్య రాలీ చేశాయి. ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు ఇప్పటికే ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై నిషేధం విధించి కఠినంగా అమలు చేస్తున్నాయి కూడా. 

 

అయితే, ఏ స్టాక్‌ పడితే ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కాకుండా, ఎంపిక చేసిన కంపెనీలకే పరిమితం కావాలన్నది విశ్లేషకుల సూచన. ‘‘అక్టోబర్‌ 2 నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం అన్నది పేపర్‌ స్టాక్స్‌కు కలిసొచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది పేపర్‌ వినియోగాన్ని పెంచుతుంది’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ రస్మిక్‌ ఓజా అన్నారు. ప్లాస్టిక్‌పై నిషేధంతో నేరుగా లాభపడే స్టాక్స్‌ను ఎంచుకోవచ్చని సూచించారు. ‘‘స్వాతంత్రదినోత్సవం నాడు ప్లాస్టిక్‌పై నిషేధ ప్రకటన నాటికి పేపర్‌ స్టాక్స్‌ చాలా చౌకగా ఉన్నాయి. ఇప్పుడవి సహేతుక వ్యాల్యూషన్లకు చేరాయి. కనుక కరెక్షన్‌లో నాణ్యమైన పేపర్‌ స్టాక్స్‌ను ఎంచుకోవాలి. జేకే పేపర్‌ అయితే, ప్లాస్టిక్‌పై నిషేధంతో తాము ఎక్కువగా లాభపడబోమని, ఎందుకంటే తమది ఎక్కువగా సాధారణ వినయోగించే పేపర్‌ అని చెప్పింది’’ అని ఓజా వెల్లడించారు. జేకే పేపర్‌, ఇమామీ పేపర్‌, సౌత్‌ ఇండియా పేపర్‌ మిల్స్‌, తమిళనాడు న్యూస్‌ప్రింట్‌ షేర్లు మాత్రం గత నెల రోజుల్లో 10 శాతానికి పైగా లాభపడ్డాయి. ‘‘వచ్చే ఏడాది కాలంలో పేపర్‌ ధరల పట్ల మేము ఎంతో బుల్లిష్‌గా ఉన్నాం. ఐటీసీ, ట్రిడెంట్‌, జేకే పేపర్‌ టాప్‌ పిక్స్‌’’ అని ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. You may be interested

నేటి నుంచే 250 జిల్లాల్లో రుణ మేళాలు

Thursday 3rd October 2019

ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధ్వర్యంలో నిర్వహణ పాల్గొననున్న ఎన్‌బీఎఫ్‌సీలు రిటైలర్లు, ఎంఎస్‌ఎంఈలకు రుణాల మంజూరు న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రకటించిన రుణ మేళా కార్యక్రమాలు గురువారం నుంచి దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో ప్రారంభమవుతాయి. ‍బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలతో కలసి వీటిని నిర్వహిస్తాయి. రిటైల్‌ కస్టమర్లతోపాటు వ్యాపారస్థులకు కూడా రుణాలను అప్పటికప్పుడు మంజూరు చేయడమే వీటి నిర్వహణ ఉద్దేశ్యం. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, వ్యవసాయ రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా

వృద్ధి కోసమే క్యాపిటల్‌: రవనీత్‌ గిల్‌ 

Wednesday 2nd October 2019

డిపాజిటర్లు, రుణ గ్రహీతలు యస్‌ బ్యాంకు పట్ల నమ్మకంతోనే ఉన్నారని, వృద్ధి కోసమే బ్యాంకుకు నిధుల అవసరం ఉందని యస్‌ బ్యాంకు సీఈవో రవనీత్‌ గిల్‌ తెలిపారు. సెప్టెంబర్‌ త్రైమాసికం పనితీరు ఇటీవలి కాలంలో బ్యాంకుకు మెరుగైన పనితీరు అవుతుందన్నారు. పలు అంశాలపై ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.    బ్యాంకుపై ఇన్వెస్టర్లలో ఎంతో ఆందోళన ఉంది కదా..? జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్‌లో అంతకుముందు కాలంతో పోలిస్తే అధిక ఖాతాలు తెరిచాం. నూతన

Most from this category