News


ఎంఎన్‌సీ కంపెనీల డీలిస్టింగ్‌కు అవకాశం!

Wednesday 10th July 2019
Markets_main1562781967.png-26961

లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రజల కనీస వాటా 25 శాతం ఉండాలన్నది ప్రస్తుత నిబంధన. దీన్ని 35 శాతం పెంచేందుకు సెబీ చర్యలు తీసుకోవాలని తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు. అయితే, ఈ ప్రతిపాదన వల్ల 65 శాతానికి పైగా ప్రమోటర్ల వాటాలు ఉన్న కొన్ని బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సీలు) భారత స్టాక్‌ ఎక్సేంజ్‌ల నుంచి తమ షేర్లను డీలిస్ట్‌ చేసే అంశాన్ని పరిశీలించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

‘‘ప్రతీ ఎంఎన్‌సీ అవసరాలను విడిగా పరిశీలించాల్సి ఉంది. కొన్ని ఎంఎన్‌సీల్లో ‍ప్రమోటర్ల వాటా 65 శాతానికి సమీపంలోనే ఉంది. కనుక వాటిల్లో ఏ మార్పులు ఉండవు. అయితే, ప్రమోటర్ల వాటా 75 శాతానికి పైగా ఉన్న కంపెనీలు డిలిస్టింగ్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా కంపెనీల్లో మాతృ సంస్థలు అధిక వాటాలు ఉంచుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. ముఖ్యంగా బీ2బీ వ్యాపారంలో ఉన్న ఎంఎన్‌సీల్లో ఈ అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే తమ వ్యాపారాలు మెరుగ్గా నడిచేందుకు అతిపెద్ద ప్రజల బ్రాండ్‌గా గుర్తింపు వాటికి అవసరం లేదు’’ అని నర్నోలియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సీఐవో శైలేంద్రకుమార్‌ తెలిపారు. 2010-13 మధ్య ప్రజల కనీస వాటాను 25 శాతానికి పెంచిన సమయంలో కొన్ని ఎంఎన్‌సీలు డీలిస్టింగ్‌ ఆప్షన్‌ ఎంచుకున్నట్టుగానే, ఇప్పుడు కూడా కొన్ని ఇదే బాట పట్టొచ్చని శైలేంద్ర కుమార్‌ అంచనా వేశారు. 

 

అయితే, ఆర్థిక మంత్రి తాజా ప్రతిపాదనపై ఇంత వరకు ప్రమోటర్ల వాటా అధికంగా ఉన్న ఏ ఒక్క కంపెనీ కూడా స్పందించలేదు. ప్రమోటర్ల వాటా 65 శాతానికి పైగా ఉన్న ప్రముఖ ఎంఎన్‌సీల్లో వర్ల్‌పూల్‌ ఇండియా, వాబ్కో ఇండియా, టిమ్‌కెన్‌ ఇండియా, థామస్‌ కుక్‌, సీమెన్స్‌, హిటాచి ఎయిర్‌, హానీవెల్‌ ఆటోమేషన్‌, హెచ్‌యూఎల్‌, గ్లాక్సోస్మిత్‌క్లయిన్‌ ఫార్మా, జిల్లెట్‌ ఇండియా, జీఈ టీఅండ్‌డీ, బోష్‌, అబాట్‌ ఇండియా, ఏబీబీ ఇండియా ఉన్నాయి. 65 శాతానికి తగ్గించుకోవాలంటే ఇవి 3 బిలియన్‌ డాలర్ల విలువైన వాటాలను విక్రయించాల్సి వస్తుంది. మార్కెట్‌ కదలికలతో సంబంధం లేకుండా ఎంఎన్‌సీలు స్థిరమైన పనితీరు చూపుతున్నాయి. గత ఐదేళ్లలో ఎంఎన్‌సీలు నిఫ్టీ కంటే అధిక రాబడులు ఇవ్వడం గమనార్హం. అయితే, ప్రభుత్వ ప్రతిపాదనను ఒకేసారి కాకుండా, దశలవారీగా అమలు చేసే అవకాశాలే ఉన్నాయన్నది మార్కెట్‌ వర్గాల అంచనా. ‘‘ఏబీబీ, హానీవెల్‌లో ‍ప్రమోటర్ల వాటా 75 శాతం చొప్పున ఉంది. ఈ నిబంధనను వచ్చే మూడు, నాలుగేళ్ల కాలంలో దశలవారీగా అమలు చేస్తారన్నది మా అంచనా. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో ఈ కంపెనీల ప్రమోటర్లు వాటాలు విక్రయిస్తే, అది సమీప కాలంలో ఈ స్టాక్స్‌పై ప్రభావం చూపుతుంది. సీమెన్స్‌, ఏబీబీ, హానీవెల్‌ బలమైన వ్యాపార మూలాలు కలిగి ఉన్నాయి. ఏదైనా కరెక్షన్‌ చోటు చేసుకుంటే, అది కొనుగోళ్లకు అవకాశం. హానీవెల్‌, సీమెన్స్‌కు బై రేటింగ్‌, ఏబీబీకి హోల్డ్‌ రేటింగ్‌ ఇస్తున్నాం’’ అని యాంటిక్యూ స్టాక్‌ బ్రోకింగ్‌ తెలిపింది.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు అప్‌

Thursday 11th July 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌....వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాల్ని వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్ల సానుకూలత ఫలితంగా భారత్‌ సూచీలు బుధవారం గ్యాప్‌అప్‌తో మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.55 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,542 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూలై నిఫ్టీ ఫ్యూచర్‌ 11,492

40 శాతం మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు బాలేదు

Wednesday 10th July 2019

మన దేశంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఆదరణ ఇటీవలి సంవత్సరాల్లోనే పెరిగింది. ప్యాసివ్‌గా పనిచేసే (ఇండెక్స్‌ ఫండ్స్‌)వాటితో పోలిస్తే యాక్టివ్‌గా పనిచేసే పథకాల్లోకి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ యాక్టివ్‌ ఫండ్‌ మేనేజర్లు తమ ప్రతిభతో సూచీలకు మించి అధిక రాబడులు తెచ్చిపెడతారన్న నమ్మకం వల్లే. కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ యాక్టివ్‌ పథకాల్లో 40 శాతం పథకాలు గత ఐదేళ్లలో తమ పోటీ సూచీల కంటే పనితీరులో చతికిలపడడం

Most from this category