News


స్వల్పనష్టాలతో ప్రారంభం

Monday 9th September 2019
Markets_main1567999806.png-28258

 ఆగస్టు నెలలో చైనా ఎగుమతులు క్షీణించాయన్న వార్తలతో నిస్తేజంగా ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లకు అనుగుణంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 13 పాయింట్ల నష్టంతో 36,969 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 10,937 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఆటోమొబైల్‌ షేర్లు నష్టాలకు లోనయ్యాయి. టాటా మోటార్స్‌, మారుతి, ఐషర్‌ మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, హీరో మోటో, బజాజ్‌ ఆటో షేర్లు 1-3 శాతం చొప్పున క్షీణించాయి. సన్‌ఫార్మా, యూపీఎల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, సిప్లా షేర్లు స్వల్పలాభాలతో ఆరంభమయ్యాయి. 



You may be interested

సోమవారం వార్తల్లో షేర్లు

Monday 9th September 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  అవెన్యూ సూపర్‌మార్స్‌:- రూ.150 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూను జారీ చేసింది.  పీసీ జ్యూవెలర్స్‌:- సెప్టెంబర్‌ 30న కంపెనీ వార్షిక సాధారణ సమావేశం జరగనుంది.   పీటీసీ ఇండస్ట్రీస్‌:- ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ కోసం కంపెనీ సభ్యుల అనుమతి కోరే ప్రతిపాదనను వాయిదా వేయాలని నిర్ణయించుకుంటుంది  ఎన్‌బీసీసీ:- ఆగస్ట్‌లో రూ.400 కోట్ల విలువైన కోట్ల ఆర్డర్లను దక్కించుకున్నట్లు ఎక్సే‍్ఛంజీలకు సమాచారం ఇచ్చింది.  రాణే హోల్డింగ్స్‌:- రూ.50 కోట్ల విలువైన

ఈ వారం టాప్‌-3 బెట్స్‌: కునాల్‌ బోత్రా

Sunday 8th September 2019

ఈ వారం నిఫ్టీ 11,200 వరకు ర్యాలీ చేయవచ్చన్న అంచనాను ప్రముఖ మార్కెట్‌ అనలిస్ట్‌ కునాల్‌ బోత్రా వ్యక్తం చేశారు. ఈ వారం ట్రేడింగ్‌ పరంగా అనుకూలంగా ఉండే మూడు స్టాక్స్‌ను కూడా ఆయన సూచించారు.    నిఫ్టీ గత వారం కనిష్ట స్థాయిల నుంచి 100-150 పాయింట్ల మేర రికవరీ అయిందని, మరీ ముఖ్యమైన అంశం.. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ తిరిగి పెరిగేందుకు ప్రయత్నించడమన్నారు. అలాగే, మార్కెట్‌ బ్రెడ్త్‌ (లాభ, నష్టపోయిన షేర్ల

Most from this category