News


మిశ్రధాతుకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌

Thursday 9th January 2020
Markets_main1578508618.png-30772

మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని)కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు కంపెనీకి విస్తృతమైన వ్యాపార అవకాశాలను తెచ్చిపెడతాయని ఈ సంస్థ పేర్కొంది. 

 

ప్రభుత్వరంగ మిశ్రధాతు కంపెనీ సూపర్‌ అలాయ్‌, టైటానియం అలాయ్‌ తయారీలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సూపర్‌ అలాయ్‌ స్టీల్‌ విభాగంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ‘‘భారత అంతరిక్ష రంగానికి బడ్జెట్‌లో పెరుగుతున్న కేటాయింపులు మిధానికి కీలకమైన వనరు. అంతరిక్ష విభాగానికి గణనీయంగా పెరుగుతున్న కేటాయింపులు (గత ఆరేళ్లలో వార్షికంగా 15.8 శాతం కాంపౌండెడ్‌ వృద్ధి), వ్యూహాత్మకంగా కీలకమైన మెటీరియల్స్‌ విషయంలో ఇస్రోతో సంయుక్తంగా ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, తక్కువ స్థాయిలో కార్యకలాపాలు అన్నీ కలసి మిధాని విషయంలో రిస్క్‌ ఆధారిత రాబడులు ఆకర్షణీయంగా ఉన్నాయి’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తన నోట్‌లో పేర్కొంది. అయితే, ఉన్నట్టుండి అంతరిక్ష కాంట్రాక్టులు రావడం, నిర్వహణ ఆగిపోతే అది రిస్క్‌ అవుతుందని తెలిపింది.

 

‘‘అంతరిక్ష ఆర్డర్ల రాక, ఆర్డర్ల నిర్వహణ మిధాని లాభదాయకతను గణనీయంగా పెంచింది. అలాగే, మూలధన నిధుల పరంగానూ మేలు చేసింది. పెరుగుతున్న బడ్జెట్‌ కేటాయింపుల నేపథ్యంలో వచ్చే రెండు మూడేళ్లు కంపెనీకి సానుకూలమే’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ వివరించింది. నిజానికి మిధాని కంపెనీ దశను మార్చింది ఇస్రోనే అని చెప్పుకోవాలి. 2019-20 మొదటి ఆరు నెలల కాలంలో కంపెనీ ఆదాయంలో 55 శాతం అంతరిక్ష విభాగం కార్యకలాపాల నుంచే వచ్చింది. అదే విధంగా కంపెనీ మార్జిన్లు 29.9 శాతానికి పెరిగాయి. 2017-19 ఆర్థిక సంవత్సరాల్లో మిధాని అమ్మకాలు తగ్గినప్పటికీ.. ఆ తర్వాత ఎన్‌ఐ హెవీ అలాయ్‌ స్టీల్‌ కారణంగా మిధాని అమ్మకాలు మూడింతలు పెరగడం గమనార్హం. ప్రస్తుత ధర (రూ.155) నుంచి మిధాని 55 శాతం పెరిగేందుకు అవకాశం ఉందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ పేర్కొంది. You may be interested

మిడ్‌క్యాప్‌ నామ సంవత్సరం!

Thursday 9th January 2020

గడిచిన ఏడాది ఏం జరిగింది..? లార్జ్‌క్యాప్‌లు.. మరింత పెద్దవిగా మారాయి. కొనుగోళ్ల మద్దతుతో నాణ్యమైన, అధిక వ్యాల్యూషన్‌ కలిగిన స్టాక్స్‌ మరింత ర్యాలీ చేశాయి. కానీ, స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ మాత్రం బాగా దెబ్బతిన్నాయి. కొన్ని అయితే 50 శాతానికి పైగా నష్టపోయాయి. మరి 2020 ఎలా ఉండబోతోంది? గతేడాదితో పోలిస్తే మార్కెట్లలో ధోరణి మారుతుందనే నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌ క్యాప్‌ను పట్టించుకోకుండా, ఒక్కో కంపెనీని విడిగా చూడడం ద్వారా

భారీ నష్టాల నుంచి రికవరీ

Wednesday 8th January 2020

తొలుత సెన్సెక్స్‌ 400 పాయింట్లు డౌన్‌ నిఫ్టీ 125 పాయింట్లు పతనం చివరికి స్వల్ప నష్టాలతో సరి ఆటో, మెటల్‌, ఫార్మా వెనకడుగు  ఐటీ, ఎఫ్‌ఎంసీజీ ఎదురీత ముందుగా హెచ్చరించిన విధంగా ఇరాన్‌ ప్రతిదాడులకు దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కంగుతిన్నారు. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్‌ మిసైళ్లను ప్రయోగించడంతో తొలుత విదేశీ మార్కెట్లలో బంగారం, ముడిచమురు ధరలు రివ్వుమన్నాయి. బ్రెంట్‌ చమురు 70 డాలర్లను అధిగమించగా.. పసిడి ఔన్స్‌ 1603 డాలర్లను తాకింది. ఇక

Most from this category