News


మిడ్‌క్యాప్స్‌ ప్రదర్శన ఆరంభమవుతుంది!

Monday 30th September 2019
Markets_main1569840463.png-28634

  • సామ్‌కో సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ ఉమేశ్‌ మెహతా

బుల్‌మార్కెట్‌ తొలిదశలో టాప్‌ క్వాలిటీ ఉన్న బ్లుచిప్‌ స్టాకులు ముందుకు కదులుతాయని, తద్వారా బుల్లిష్‌ సెంటిమెంట్‌ విస్తరించి మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ సైతం పాజిటివ్‌ వాతావరణంలోకి వస్తాయని సామ్‌కో సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ ఉమేశ్‌ మెహతా చెప్పారు. బుల్‌మార్కెట్‌ కొంతగడిచిన తర్వాత పెద్ద స్టాకులు ఖరీదైనవిగా మారతాయని, దీంతో ఇన్వెస్టర్లు చిన్న స్టాకులపై దృష్టి పెడతారని చెప్పారు. బుల్‌మార్కెట్‌ మంచి దశకు చేరేటప్పటికి మిడ్‌క్యాప్స్‌ భారీ ర్యాలీల్లో ఉంటాయన్నారు. ప్రస్తుతం పెద్దస్టాకుల్లో వాల్యూషన్లు కొంత పెరిగినందున, వీటిని కొనాలంటే కొంత కరెక‌్షన్‌ కోసం చూడాలని సలహా ఇచ్చారు. నిఫ్టీ ఈవారంలో 11700- 11800 పాయింట్లను దాటకపోవచ్చని అభిప్రాయపడ్డారు. లాంగ్‌ పొజిషన్లు బాగా పెరిగినందున మరింత ర్యాలీకి స్వల్ప అవకాశాలుంటాయన్నారు. కొద్ది రోజుల్లో మార్కెట్‌ 11200- 11300 పాయింట్లను చేరవచ్చని అంచనా వేశారు. ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 8ఏళ్ల కనిష్టానికి చేరడమంటే బలహీన షార్టులు తొలగినా, బలమైన కాల్స్‌ ఆరంభం కావడం లేదని అందువల్ల అప్‌మూవ్‌ పరిమితం అవుతుందని వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిమాండ్‌ పెద్దగా లేదన్నారు. అందుకని బలమైన పతనం మరొకటి ఉండొచ్చన్నారు. అంతర్జాతీయంగా మెటల్‌ స్టాకులు బలహీనంగా ఉన్నందున స్వల్పకాలానికి వేదాంత, సెయిల్‌, ఎన్‌ఎండీసీ, హిండాల్కో, టాటాస్టీల్‌ కౌంటర్లలో షార్ట్స్‌ తీసుకోవచ్చన్నారు. You may be interested

భారత్‌లో వ్యాపార వృద్ధిపై నిప్పన్‌ లైఫ్‌ దృష్టి

Tuesday 1st October 2019

జపాన్‌కు చెందిన అతిపెద్ద ఇన్సూరెన్స్‌ కంపెనీ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఆర్‌నామ్‌)లో నియంత్రిత వాటాతో ఏకైక ప్రమోటర్‌గా అవతరించింది. కంపెనీలో రిలయన్స్‌ క్యాపిటల్‌కు ఉన్న వాటాలను నిప్పన్‌ లైఫ్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్‌నామ్‌లో నిప్పన్‌ లైఫ్‌ వాటా 75 శాతానికి చేరింది. తన రుణ భారాన్ని తగ్గించుకునేందుకు గాను ఆర్‌నామ్‌లో తన వాటాలను రిలయన్స్‌ క్యాపిటల్‌ విక్రయించి

అక్టోబర్‌లో 12వేలకు నిఫ్టీ?!

Monday 30th September 2019

వారం క్రితం అనూహ్య ర్యాలీ అనంతరం నిఫ్టీ కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి వెళ్లింది. వీక్లీ చార్టుల్లో డోజి క్యాండిల్‌ ఏర్పడడం మార్కెట్లో అస్పష్టతకు సంకేతం. గతవారం నిఫ్టీ ముగింపు అంతకుముందు పతనానికి 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయికి పైన జరిగింది. అందువల్ల సూచీల్లో ఇకముందు కూడా బలం కనిపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. చార్టుల్లో హయ్యర్‌టాప్‌, బాటమ్‌ ఏర్పరచడం కూడా ఇందుకు సంకేతంగా చెబుతున్నారు. ప్రస్తుత ప్యాట్రన్‌ ప్రకారం నిఫ్టీ 11620 పాయింట్ల

Most from this category