News


మిడ్‌క్యాప్స్‌ సంబరం ఇక!

Monday 3rd June 2019
Markets_main1559501847.png-26049

బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ పీఈ, నిఫ్టీ 50పీఈ మధ్య అంతరరం మే నెలలో ప్రతికూల జోన్‌లోకి వెళ్లింది. 48 నెలల కాలంలో మొదటి సారి ఇలా జరగడం. ఇది మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీకి సంకేతంగా నిపుణులు పేర్కొంటున్నారు. చివరి సారిగా నిఫ్టీ-50కి, మిడ్‌క్యాప్‌ సూచీకి మధ్య అంతరం ప్రతికూల జోన్‌లోకి రావడం 2015 మే నెలలో జరిగింది. ఆ తర్వాత మిడ్‌క్యాప్స్‌లో మంచి ర్యాలీ చోటు చేసుకున్న విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అదే ఏడాది 2017 డిసెంబర్‌ నాటికి మిడ్‌క్యాప్‌ సూచీ 66 శాతం పెరిగి 17,822 మార్క్‌ను అధిగమించింది. రూ.5,000 కోట్లు, రూ.25,000 కోట్లలోపు మార్కెట్‌ క్యాప్‌ ఉన్న కంపెనీల్లో 18-30 శాతం అప్‌సైడ్‌కు అవకాశం ఉందని, రూ.25,000 కోట్లకు పైగా మార్కెట్‌క్యాప్‌ కలిగిన లార్జ్‌ కంపెనీల్లో 10 శాతం పెరుగుదలకు అవకాశం ఉందని నిపుణుల అంచనా. 

 

గతంలో మిడ్‌క్యాప్స్‌లో ఉన్న ప్రీమియం వ్యాల్యూషన్‌ పూర్తిగా తగ్గిపోయినట్టు రినైసెన్స్‌ ఇ‍న్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ వ్యవస్థాపకుడు పంకజ్‌ మురర్క పేర్కొన్నారు. ఈ విభాగంలో మరోసారి పెట్టుబడులకు చాలా స్టాక్స్‌ ఆకర్షణీయంగా ఉన్నట్టు చెప్పారు. గతంలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ సగటున నిఫ్టీ ఇండెక్స్‌ కంటే 6.9 శాతం అధిక వ్యాల్యూషన్‌తో ఉండేది. అంటే నిఫ్టీ-50 20 పీఈతో ఉంటే, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 26.9 పీఈలో ఉండేది. ఇప్పుడు ఇదంతా తగ్గిపోయింది. ‘‘లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్స్‌లో ఎంతో విలువ ప్రస్తుతం నెలకొని ఉంది. బ్లూంబర్గ్‌ అంచనా ప్రకారం... మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ప్రస్తుతం 14.8 రెట్ల ఫార్వార్డ్‌ పీఈ వ్దద ఉంది. నిఫ్టీ ఫార్వార్డ్‌ పీఈ 18.30గా ఉంది. అంటే 19 శాతం తక్కువ’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ... ఏజిస్‌ లాజిస్టిక్స్‌, అపోలోటైర్స్‌, సైయంట్‌, హిమాత్‌సింగాసీడ్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌, ఎన్‌సీసీ, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, సూర్యరోషిణి, వెల్‌స్పన్‌ కార్పొరేషన్‌ స్టాక్స్‌ పట్ల బుల్లిష్‌గా ఉన్నట్టు తెలిపింది. 

 

మిడ్‌క్యాప్‌ విభాగంలో చాలా స్టాక్స్‌ ఇప్పటికీ వాటి 52 వారాల గరిష్ట స్థాయి నుంచి చాలా తక్కువలోనే ట్రేడవుతున్న విషయం చూస్తూనే ఉన్నాం. బలమైన ఆర్థిక మూలాలు, మంచి యాజమాన్యం ఉన్న కంపెనీలను వీటి నుంచి ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్నికల ఫలితాల రిస్క్‌ను మార్కెట్‌ అధిగమించేయడంతో ఇప్పటి వరకు వేచి చూస్తున్న ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు వస్తారని, అలాగే, సిప్‌ పెట్టుబడుల రాకతో మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ పెరుగుతాయన్న అంచనాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ‘‘రాజకీయ స్థిరత్వం అన్నది మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్స్‌కు స్వల్ప కాలంలో సానుకూలం. రాజకీయ అనిశ్చితి తొలగిపోవడంతో పెద్ద ఎత్తున లిక్విడిటీ మార్కెట్లోకి వస్తుంది. వచ్చే ఆరు నెలల్లో సిప్‌ పెట్టుబడులు రెట్టింపు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లోకి ప్రవేశించేందుకు ఇది సరైన సమయం. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మంచి పనితీరు రానున్న కాలంలో చూపగలవు. అయితే, బలమైన బ్యాలన్స్‌ షీటు, నాణ్యత, వ్యాల్యూషన్‌ విషయంలో రాజీ పడకూడదు’’ అని ఈక్వినామిక్స్‌రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ వ్యవస్థాపకుడు జి.చొక్కలింగం సూచించారు.
 You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు అప్‌

Monday 3rd June 2019

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నప్పటికీ,  భారత్‌ మార్కెట్‌ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.40 గంటలకు 50  పాయింట్ల లాభంతో 11,966 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ నిఫ్టీ జూన్‌ ఫ్యూచర్‌ 11,916  పాయింట్ల వద్ద ముగిసింది.  తాజాగా ఆసియా మార్కెట్లలో  జపాన్‌ నికాయ్‌ 1 శాతంపైగా క్షీణించగా, సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ వెయిటెడ్‌  చైనా షాంఘై,

పోర్ట్‌ఫోలియో పెద్దదైతే చిక్కులే..!

Monday 3rd June 2019

స్టాక్‌ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేసే రిటైల్‌ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది నష్టాల గురించి చెబుతుండడం చాలా మందికి అనుభవమే. దీని వెనుక ఎన్నో కారణాలు ఉంటుంటాయి. అందరిలోనూ ఇవే ప్రధానంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఒక్కో ఇన్వెస్టర్‌ పదుల సంఖ్యలో షేర్లను తమ పోర్ట్‌ఫోలియోలో భాగంగా నిర్వహిస్తుంటారు. ఒక్కో కంపెనీలో కొంత చొప్పున, ఆకర్షణీయంగా కనిపించే ప్రతీ షేరు వెనుక పరుగులు పెడుతుంటారు. దీనివల్ల సంపద సృష్టి కష్టమవుతుందంటున్నారు వ్యాల్యూ

Most from this category