News


మిడ్‌క్యాప్స్‌పై విదేశీ ఫండ్స్‌ మోజు

Wednesday 20th November 2019
Markets_main1574224940.png-29724

కొనుగోళ్లు పెంచుతున్న ఎఫ్‌పీఐలు
రెండు సంవత్సరాలుగా కేవలం లార్జ్‌క్యాప్స్‌లో మాత్రమే కొనుగోళ్లు జరుపుతూవస్తున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తాజాగా చిన్న స్టాకుల వైపు చూస్తున్నారు. ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద లభించే చిన్న స్టాకులు ఇచ్చే లాభాలను అందిపుచ్చుకోవడానికి ఎఫ్‌పీఐలు యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యు2లో ఎఫ్‌పీఐలు దాదాపు 60కి పైగా మిడ్‌క్యాప్స్‌లో వాటాలు పెంచుకున్నాయి. అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అధార్టీ, ఈస్ట్‌స్ప్రింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, యూరో పసిఫిక్‌ గ్రోత్‌ ఫండ్‌, ఫిడిలిటీ, గవర్నమెంట్‌ పెన్షన్‌ ఫండ్‌, నొమురా, నార్గెస్‌ బ్యాంక్‌ తదితర ఎఫ్‌పీఐలు క్యు2 అనంతరం కూడా మిడ్‌క్యాప్స్‌లో కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి. వీటితో పాటు క్యాపిటల్‌ గ్రప్‌, అబెర్డీన్‌, అమన్సా క్యాప్‌, టీ రో ప్రైస్‌, టీచర్‌ రిటైర్‌మెంట్‌ సిస్టమ్‌ ఆఫ్‌ టెక్సాస్‌, యూబీఎస్‌, మోర్గాన్‌స్టాన్లీ, సైఫ్‌ పార్టనర్స్‌, కొలంబియా థ్రెడ్‌ నీడిల్‌ తదితర ఎఫ్‌ఐఐలు గత నెల్లో రెండు డజన్లకు పైగా మిడ్‌క్యాప్స్‌ యాజమాన్యాలతో వాటాల పెంపునకు సంబంధించి చర్చలు జరిపాయి. ఇలా చర్చలు జరిపిన పలు మిడ్‌క్యాప్స్‌ మంచి ర్యాలీ చూపాయి.

ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అపోలో ట్రైకోట్‌ ట్యూబ్స్‌, యస్‌బ్యాంక్‌, వెల్‌స్పన్‌ కార్‌‍్ప, ఫోర్టిస్‌, ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌, డిషమాన్‌ కార్బొజెన్‌ తదితర మిడ్‌క్యాప్స్‌పై ఈ ఎఫ్‌పీఐలు మక్కువ చూపుతున్నాయి. ఎఫ్‌ఐఐల మక్కువ కారణంగా ఇటీవల కాలంలో ప్రధాన సూచీల కన్నా మిడ్‌క్యాప్‌ సూచీ మెరుగైన ప్రదర్శన చూపుతోంది. మిడ్‌క్యాప్స్‌ వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉండడం కూడా విదేశీ ఇన్వెస్టర్లకు ఆసక్తి పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీమా, ఎన్‌బీఎఫ్‌సీ, ఎయిర్‌లైన్స్‌, కన్జూమర్‌, ఫార్మా రంగాల్లోని నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌ను ఎఫ్‌పీఐలు పరిశీలిస్తున్నాయి. 



You may be interested

నష్టాల్లో చమురు ధరలు

Wednesday 20th November 2019

యుఎస్‌ చమురు నిల్వలు పెరగడంతో పాటు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వలన అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగించడంతో గత రెండు సెషన్‌లలో చమురు ధరలు పతనమయ్యాయి. ఈ పతనాన్ని కొనసాగిస్తు బుధవారం సెషన్లో కూడా చమురు ధరలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బుధవారం ఉదయం 9.46 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.10 శాతం తగ్గి బ్యారెల్‌కు 60.81 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.03 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 55.33 డాలర్ల

పడిపోయిన రూపీ

Wednesday 20th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం సెషన్లో 12 పైసలు బలహీనపడి 71.83 వద్ద ప్రారంభమైంది. కాగా చమురు ధరలు తగ్గడంతోపాటు, దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభపడడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ నష్టాల నుంచి కోలుకొని, చివరికి 13 పైసలు లాభపడి 71.71 వద్ద ముగిసింది. అధిక సరఫరా ఆందోళనలు పెరగడంతో గత సెషన్‌లో చమురు ధరలు భారీగా పడిపోయాయి. గత సెషన్‌లో డాలర్‌-రూపీ

Most from this category