News


నష్టాల మార్కెట్లో మిడ్‌ క్యాప్స్‌ దూకుడు

Tuesday 21st January 2020
Markets_main1579592542.png-31071

అపోలో ట్రైకోట్‌ ట్యూబ్స్‌
కేన్‌ ఫిన్‌ హోమ్‌ ఫైనాన్స్‌
కేఈఐ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
సెంచురీ టెక్స్‌టైల్స్‌

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తాజాగా ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను కుదించడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. వర్ధమాన దేశాలలో భారత్‌ జీడీపీ మందగించడం ప్రభావం చూపనున్నట్లు ఐఎంఎఫ్‌ పేర్కొంది. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అమ్మకాలు పెరిగి మార్కెట్లు వెనకడుగు వేశాయి. మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 147 పాయింట్లు క్షీణించి 41,382ను తాకగా.. నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 12,186 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ విభిన్న వార్తల ఆధారంగా అపోలో ట్రైకోట్‌ ట్యూబ్స్‌,
కేన్‌ ఫిన్‌ హోమ్‌ ఫైనాన్స్‌, కేఈఐ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, సెంచురీ టెక్స్‌టైల్స్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ కౌంటర్లు లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం...

అపోలో ట్రైకోట్‌ ట్యూబ్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో అపోలో ట్రైకోట్‌ ట్యూబ్స్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 86 శాతం జంప్‌చేసి రూ. 17.5 కోట్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 49 శాతం పెరిగి రూ. 229 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 2.2 శాతం పుంజుకుని 12.4 శాతానికి బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఎస్‌ఈలో అపోలో ట్రైకోట్‌ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 350 వద్ద ట్రేడవుతోంది. 

కేన్‌ ఫిన్‌ హోమ్‌ ఫైనాన్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో కేన్‌ ఫిన్‌ హోమ్‌ ఫైనాన్స్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 41 శాతం జంప్‌చేసి రూ. 107 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 517 కోట్లను తాకింది. ఇబిటా 20 శాతం పుంజుకుని రూ. 145 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కేన్‌ ఫిన్‌ హోమ్‌ షేరు 15 శాతం దూసుకెళ్లి రూ. 448 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 458 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. 

కేఈఐ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో కేఈఐ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 50 శాతం జంప్‌చేసి రూ. 72.5 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 21 శాతం పెరిగి రూ. 1314 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు నామమాత్ర వృద్ధితో 11 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కేఈఐ ఇండస్ట్రీస్‌ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 538 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 551 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 

సెంచురీ టెక్స్‌టైల్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో సెంచురీ టెక్స్‌టైల్స్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 43 శాతం జంప్‌చేసి రూ. 202 కోట్లకు చేరింది. అయితే మొత్తం ఆదాయం 13 శాతం క్షీణించి రూ. 851 కోట్లకు పరిమితమైంది. కాగా.. ఈ ఏడాది ద్వితీయార్థంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించే వీలున్నట్లు కంపెనీ యాజమాన్యం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సెంచురీ టెక్స్‌టైల్స్‌ షేరు 2.3 శాతం లాభపడి రూ. 550 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 553 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 



You may be interested

అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Tuesday 21st January 2020

1శాతం నష్టాన్ని చవిచూసిన నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌  3శాతం క్షీణించి ఎన్‌ఎండీసీ మార్కెట్‌ పతనంతలో భాగంగా మంగళవారం మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ కల్లా 1శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,823.65 వద్ద మొదలైంది. మార్కెట్లో నెలకొన్న అమ్మకాలతో మెటల్‌ షేర్లు ఉదయం సెషన్‌లో భారీగా నష్టాలను చవిచూశాయి. ఒకదశలో దాదాపు 1శాతం నష్టపోయి 2809.00

క్యూ3లో బడా ఇన్వెస్టర్ల అమ్మక, కొనుగోళ్ల వివరాలివే..!

Tuesday 21st January 2020

దలాల్ స్ట్రీట్‌లోని బడాల ఇన్వెస్టర్ల అమ్మకాలు, కొనుగోళ్లపై చిన్నస్థాయి ఇన్వెస్టర్లు ఆస్తకి చూపుతుంటారు. వారు కూడా ఏస్‌ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను అనుసరించి లాభాలను గడించాలని ఆశిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏస్‌ ఇన్వెస్టర్లైన రాధాకృష్ణన్‌ ధమానీ, రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, అశిష్‌ ఖచోలియా, అనిల్‌ కుమార్‌ గోయెల్‌, డాలీఖన్నాలు డిసెంబర్‌ క్వార్టర్‌లో ఏయే షేర్లను కొన్నారో., ఏయే షేర్లను తమ పోర్ట్‌ఫోలియో నుంచి తొలిగించారనే అనే విషయాలు ఇప్పడు చూద్దాం...  ఈ మూడో క్వార్టర్‌లో

Most from this category